Kushi Title Song: ఖుషి టైటిల్ సాంగ్ వచ్చేసింది.. మెలోడియస్‍గా.. మైమరిపించేలా!
Kushi Title Song: ఖుషి సినిమా నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ అయింది. హేషమ్ అబ్దుల్ వాహబ్ స్వరపరిచిన ఈ పాట కూడా మెలోడియస్‍గా ఉంది.
Kushi Title Song: ఖుషి సినిమా నుంచి మూడో పాట వచ్చేసింది. మెలోడియస్‍గా ఈ లవ్ సాంగ్ ఉంది. ‘ఖుషి.. నువ్వు కనపడితే’ అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్‍ను మూవీ యూనిట్ నేడు (జూలై 28) విడుదల చేసింది. స్టార్ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న ఖుషి చిత్రానికి హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నాడు. ఫీల్ గుడ్ సినిమాలకు ఫేమస్ అయిన శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఖుషి నుంచి వచ్చిన రెండు పాటలు సూపర్ హిట్ కాగా.. నేడు మూడో లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది.
హీరో విజయ్ దేవరకొండ ఆనందంలో మునిగి తేలుతున్నట్టు ఖుషి టైటిల్ సాంగ్ ఉంది. హీరోయిన్ సమంతతో ప్రేమలో పడిన తర్వాత పాడుకునే సాంగ్‍గా మెలోడియస్‍గా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ స్వరాలు సమకూర్చటంతో పాటు తెలుగులో ఈ పాట పాడాడు. దర్శకుడు శివ నిర్వాణ ఈ పాటకు లిరిక్స్ రాశాడు. బృందా మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేశారు.
‘ఖుషి.. నువ్వు కనపడితే - ఖుషి నీ మాట వినపడితే’ అంటూ ఈ టైటిల్ సాంగ్ మొదలవుతుంది. సినిమాలో విజయ్, సమంత పెళ్లి విజువల్స్ కూడా ఈ లిరికల్ సాంగ్‍లో ఉన్నాయి. లిరిక్స్ కూడా చాలా క్యాచీగా ఉన్నాయి. అబ్దుల్ వాహబ్ వాయిస్ కూడా ఈ పాటకు బాగా సూటైంది.
తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఖుషి టైటిల్ సాంగ్ రిలీజ్ అయింది. ఆయా భాషను బట్టి సింగర్స్, లిరిక్ రైటర్స్ వేరుగా ఉన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేనీ, యలమంచలి రవిశంకర్ ఖుషి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు శివ నిర్వాణ.
ఖుషి సినిమా థియేటర్లలో సెప్టెంబర్ 1వ తేదీన విడుదల కానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఖుషి సినిమాలో జయరామ్, మురళీ శర్మ, సచిన్ ఖేడకర్, లక్ష్మి, రోహిణి, వెన్నెల కిశోర్, శ్రీకాంత్ అయ్యంగార్ కీ రోల్స్ ప్లే చేశారు. కాగా, ఖుషి చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన ‘నా రోజా నువ్వే’, ఆరాధ్య పాటలు సూపర్ హిట్ అయ్యాయి. తెలుగుతో పాటు మిగిలిన భాషల్లోనూ మంచి ఆదరణ పొందుతున్నాయి. దీంతో సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది.
టాపిక్