KGF Chapter 2 | యశ్‌కు కిస్‌ ఇచ్చిన ప్రశాంత్‌ నీల్‌-kgf chapter 2 team enjoying the success of the movie in their signature style ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Kgf Chapter 2 Team Enjoying The Success Of The Movie In Their Signature Style

KGF Chapter 2 | యశ్‌కు కిస్‌ ఇచ్చిన ప్రశాంత్‌ నీల్‌

HT Telugu Desk HT Telugu
Apr 24, 2022 07:40 PM IST

KGF Chapter 2 మూవీ టీమ్‌ సెలబ్రేషన్‌ మోడ్‌లో ఉంది. బొమ్మ బంపర్‌ హిట్‌ కావడంతో ఆ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తోంది.

కేజీఎఫ్ ప్రొడ్యూసర్ విజయ్, హీరో యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్
కేజీఎఫ్ ప్రొడ్యూసర్ విజయ్, హీరో యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (twitter)

బాహుబలిని మించి బాహుబలి 2 సక్సెస్‌ సాధించింది. ఇప్పుడు కేజీఎఫ్‌ విషయంలోనూ అదే జరిగింది. మూడున్నరేళ్ల కిందట వచ్చిన కేజీఎఫ్‌ కంటే.. ఇప్పటి సెకండ్‌ చాప్టర్‌ సూపర్‌డూపర్‌ హిట్‌ సాధించింది. బాక్సాఫీస్‌ కలెక్షన్ల విషయంలో రికార్డులన్నింటినీ బద్ధలు కొట్టేసింది. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.850 కోట్లు వసూలు చేసి.. రూ.వెయ్యి కోట్లు వైపు పరుగులు పెడుతోంది. హిందీ బెల్ట్‌లోనే రూ.300 కోట్ల మార్క్‌ దాటింది.

కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2 రెండో వారంలోనూ తగ్గేదే లే అనుకుంటూ బాక్సాఫీస్‌పై దండయాత్ర కొనసాగించడం విశేషం. దీంతో మూవీ టీమ్‌ పట్టరాని ఆనందంలో ఉంది. ఈ మూవీతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయిన యశ్‌తోపాటు డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. కేజీఎఫ్‌ సక్సెస్‌ సాధించినప్పుడు ఎలా అయితే ఎంజాయ్‌ చేశారో.. అచ్చూ అలాగే ఇప్పుడు కూడా చేయడం విశేషం.

డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌, ప్రొడ్యూసర్‌ విజయ్‌ కిర్గండూర్‌.. హీరో యశ్‌కు కిస్‌ ఇస్తున్న ఫొటోను చిత్ర నిర్మాణ సంస్థ హోంబళె పిక్చర్స్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. సెలబ్రేషన్స్‌కు ఇది ప్రారంభం మాత్రమే అంటూ కామెంట్‌ చేసింది. ఈ ఫొటో వెంటనే వైరల్‌గా మారిపోయింది. ఇప్పటికే మేకర్స్‌ కేజీఎఫ్‌ 3ని కూడా అనౌన్స్‌ చేసిన విషయం తెలిసిందే.

IPL_Entry_Point

సంబంధిత కథనం