Katrina Kaif Pregnant: కత్రినా కైఫ్ ప్రెగ్నెంటా? ఆమె భర్త విక్కీ కౌశల్ ఏమన్నాడో చూడండి-katrina kaif pregnancy husband vicky kaushal responds bad newz trailer ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Katrina Kaif Pregnant: కత్రినా కైఫ్ ప్రెగ్నెంటా? ఆమె భర్త విక్కీ కౌశల్ ఏమన్నాడో చూడండి

Katrina Kaif Pregnant: కత్రినా కైఫ్ ప్రెగ్నెంటా? ఆమె భర్త విక్కీ కౌశల్ ఏమన్నాడో చూడండి

Hari Prasad S HT Telugu

Katrina Kaif Pregnant: కత్రినా కైఫ్ ప్రెగ్నెంటా? ఇదే ప్రశ్నకు ఆమె భర్త విక్కీ కౌశల్ కాస్త డిఫరెంట్ గా సమాధానమిచ్చాడు. తన లేటెస్ట్ మూవీ బ్యాడ్ న్యూస్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా విక్కీ దీనిపై స్పందించాడు.

కత్రినా కైఫ్ ప్రెగ్నెంటా? ఆమె భర్త విక్కీ కౌశల్ ఏమన్నాడో చూడండి (Katrina Kaif Instagram)

Katrina Kaif Pregnant: బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్ అంటూ చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆమె తన గర్భాన్ని దాచి పెడుతోందని, అంతేకాదు అనుష్క శర్మలాగా ఆమె కూడా లండన్ లో తన బిడ్డకు జన్మనివ్వడానికి ప్లాన్ చేసినట్లు కూడా చెప్పారు. అయితే తాజాగా ఈ వార్తలపై ఆమె భర్త, బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ స్పందించాడు.

కత్రినా కైఫ్ ప్రెగ్నెంటా?

విక్కీ కౌశల్ తాజాగా బ్యాడ్ న్యూస్ అనే సినిమాలో నటించాడు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ శుక్రవారం (జూన్ 28) జరిగింది. ఈ సందర్భంగా సినిమా విశేషాలతోపాటు అతన్ని కత్రినా ప్రెగ్నెన్సీ గురించి కూడా మీడియా ప్రశ్నించింది. తన సినిమాకు లింకు పెడుతూ ఈ ప్రశ్నకు అతడు కాస్త వెరైటీగా సమాధానం ఇవ్వడం విశేషం.

మీ జీవితంలో గుడ్ న్యూస్ గురించి చెప్పండి అంటూ మీడియా అతన్ని అడిగింది. దీనిపై విక్కీ స్పందిస్తూ.. "ఇప్పటికైతే మేమే తీసుకొస్తున్న ఈ బ్యాడ్ న్యూస్ మీరు ఎంజాయ్ చేయండి. ఆ గుడ్ న్యూస్ వచ్చినప్పుడు మీకు చెప్పకుండా ఏమీ దాచములెండి" అని అనడం విశేషం. అతని సమాధానంతో కత్రినా ప్రెగ్నెంట్ కాదన్న విషయం తేలిపోయినట్లే.

బ్యాడ్ న్యూస్ ట్రైలర్

విక్కీ కౌశల్, తృప్తి దిమ్రి, ఆమీ విర్క్ నటించిన బ్యాడ్ న్యూస్ మూవీ ట్రైలర్ శుక్రవారం (జూన్ 28) రిలీజైంది. ఓ భిన్నమైన కాన్సెప్ట్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒకేసారి ఓ యువతి ఇద్దరు యువకుల ద్వారా తల్లి కావడమన్నదే ఈ సినిమా స్టోరీ. కోట్లలో ఒకరికి ఎదురయ్యే భిన్నమైన పరిస్థితి ఇది. హెటెరోప్యాటెర్నల్ సూపర్ఫెకండేషన్ అని పిలుస్తారు.

అంటే ఒకే రుతక్రమంలో ఇద్దరు యువకుల వీర్య కణాలతో రెండు అండాల ద్వారా ఓ మహిళ గర్భం దాల్చడం. ఈ భిన్నమైన కాన్సెప్ట్ కు బ్యాడ్ న్యూస్ అనే టైటిల్ పెట్టి సినిమా తీశారు. ఇందులో యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రి.. ఇలా ఇద్దరు యువకుల ద్వారా గర్భం దాల్చిన అమ్మాయి పాత్రలో కనిపిస్తోంది. ఆమె బిడ్డకు ఇద్దరు తండ్రులన్న బోల్డ్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ తోనే మెప్పించింది.

ఈ మూవీ జులై 19న రిలీజ్ కాబోతోంది. నిజానికి ఈ మూవీ ట్రైలర్ లో కత్రినాకు సంబంధించిన ఓ అంశం కూడా ఉంది. అయితే ఆ విషయం ఆమెకు తెలియదని విక్కీ చెప్పాడు. ట్రైలర్ లో ఆమె కూడా ఉంటుందన్న హింట్ తనకు ఇచ్చినా.. అదేంటన్నది మాత్రం ట్రైలర్ లాంచ్ వరకు తెలియదని చెప్పడం విశేషం. ఆనంద్ తివారీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ తెరకెక్కించింది.