Kanguva Day 1 Collections: కంగువ కలెక్షన్స్ - రికార్డులు అనుకుంటే సీన్ రివర్స్ - తొలిరోజు వచ్చింది ఎంతంటే?
Kanguva Day 1 Collections: సూర్య కంగువ మూవీ తొలిరోజు వరల్డ్ వైడ్‌గా 22 కోట్ల కలెక్షన్స్ సాధించింది. తెలుగు వెర్షన్ ఆరు కోట్ల వరకు వసూళ్లను దక్కించుకున్నట్లు సమాచారం. హిందీలో మోస్తారు కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ మలయాళం, కన్నడ భాషల్లో పూర్తిగా డిసపాయింట్ చేసింది.
Kanguva Day 1 Collections: సూర్య కంగువ మూవీ తొలిరోజు కలెక్షన్స్ పరంగా అంచనాలకు అందుకోలేక డీలా పడింది. మొదటిరోజు సూర్య మూవీ రికార్డులు తిరగరాయడం ఖాయమని, యాభై కోట్ల వరకు కలెక్షన్స్ దక్కించుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ ప్రీమియర్స్ షో నుంచే కంగువ సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో ఫస్ట్ డే కలెక్షన్స్‌పై గట్టిగానే ఎఫెక్ట్ పడింది. అంచనా వేసిన కలెక్షన్స్‌లో సగం కూడా రాబట్టలేకపోయింది.
22 కోట్ల కలెక్షన్స్...
తొలిరోజు కంగువ మూవీ వరల్డ్ వైడ్‌గా 22 కోట్ల కలెక్షన్స్ మాత్రమే సాధించింది. అత్యధికంగా తమిళ వెర్షన్ పదమూడు కోట్ల వరకు వసూళ్లను సొంతం చేసుకున్నది. తెలుగు వెర్షన్‌కు ఆరు కోట్లు వచ్చినట్లు సమాచారం. హిందీలో మూడు కోట్ల ఇరవై ఐదు లక్షలకుపైగా ఈ ఫాంటసీ యాక్షన్ మూవీ కలెక్షన్స్ దక్కించుకున్నట్లు చెబుతోన్నారు.
కేరళ, కర్ణాటకలో కంగువ ప్రభావం ఏ మాత్రం కనిపించలేదు. ఈ రెండు స్టేట్స్‌లో సూర్య సినిమాను గట్టిగానే ప్రమోట్ చేశారు. అయినా తొలిరోజు కేరళ మూడు లక్షలు, కర్ణాటకలో తొమ్మిది లక్షలు మాత్రమే ఈ సినిమా కలెక్షన్స్‌ను దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
నాలుగు వందల కోట్లు...
వరల్డ్ వైడ్‌గా కంగువ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ నాలుగు వందల కోట్ల వరకు జరిగినట్లు సమాచారం. తొలిరోజు వసూళ్ల పరంగా చూస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడం కష్టమనే ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. శుక్రవారం రోజు వసూళ్లను మరింత తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. తెలుగులో 24 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో కంగువ రిలీజైంది. తొలిరోజు ఆరుకోట్ల వరకు తెలుగు వెర్షన్‌కు కలెక్షన్స్ వచ్చాయి. సూర్యకు తెలుగులో భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కథ కన్ఫ్యూజింగ్‌గా సాగడం, తమిళ నేటివిటీ ఎక్కువ కావడం మైనస్‌గా మారింది.
దిశా పటానీ హీరోయిన్...
దాదాపు మూడు వందల యాభై కోట్ల బడ్జెట్‌తో పీరియాడికల్ ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా డైరెక్టర్ శివ ఈ మూవీని తెరకెక్కించారు. దిశా పటానీ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరో బాబీ డియోల్ విలన్‌గా నటించాడు.
కంగువ కథ...
ప్రజెంట్ టైమ్ పీరియడ్‌కు 1070 కాలానికి చెందిన కంగువ అనే పోరాట యోధుడి జీవితాన్ని ముడిపెడుతూ దర్శకుడు శివ ఈ మూవీని తెరకెక్కించాడు. ఫ్రాన్సిన్ (సూర్య) గోవాలో బౌంటీ హంటర్స్‌గా పనిచేస్తోంటారు. క్రిమినల్స్ పట్టుకోవడంలో సాయం చేస్తుంటాడు. ఓ రష్యన్ ల్యాబ్ నుంచి జెటా అనే చిన్నారిని ఫ్రాన్సిస్ రక్షిస్తాడు. అసలు జెటాకు ఫ్రాన్సిస్‌కు ఉన్న సంబంధం ఏమిటి? 1070 కాలంలో విదేశీయుల బారి నుంచి ప్రణవాది తెగను కాపాడిన కంగువ ఎవరు?
కంగువకు కపాల కోనకు చెందిన రుధిర నేత్రకు(బాబీ డియోల్) మధ్య వైరం ఏర్పడటానికి కారణం ఏమిటి? ప్రణవాది తెగను విదేశీయులను అప్పగించాలని రుధిర నేత్ర ఎందుకు అనుకున్నాడు. పంచద్వీప సమూహంలోని ప్రణవాది, కాపాలతో పాటు మరో మూడు తెగల మధ్య రొమేనియన్లు ఎలాంటి విద్వేషాలు సృష్టించారు? రుద్రాంగ నేత్రుడు కథేమిటి? అన్నదే కంగువ మూవీ కథ.