Action OTT: 120 కోట్ల బడ్జెట్ - 25 కోట్ల క‌లెక్ష‌న్స్ - ఓటీటీలోకి క‌న్న‌డ డిజాస్ట‌ర్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ-dhruva sarja action thriller movie martin to stream on zee5 ott from this date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Action Ott: 120 కోట్ల బడ్జెట్ - 25 కోట్ల క‌లెక్ష‌న్స్ - ఓటీటీలోకి క‌న్న‌డ డిజాస్ట‌ర్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ

Action OTT: 120 కోట్ల బడ్జెట్ - 25 కోట్ల క‌లెక్ష‌న్స్ - ఓటీటీలోకి క‌న్న‌డ డిజాస్ట‌ర్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ

Nelki Naresh Kumar HT Telugu
Nov 12, 2024 11:54 AM IST

Action OTT: ధృవ్ స‌ర్జా హీరోగా న‌టించిన క‌న్న‌డ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ మార్టిన్ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ఈ నెల‌లోనే జీ5 ఓటీటీలో ఐదు భాష‌ల్లోస్ట్రీమింగ్ కాబోతోంది. దాదాపు 120 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 25 కోట్ల‌లోపే క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

యాక్షన్ ఓటీటీ
యాక్షన్ ఓటీటీ

Action OTT: ఈ ఏడాది క‌న్నడ‌ ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు రేకెత్తించిన సినిమాల్లో మార్టిన్ ఒక‌టి. ధృవ్ స‌ర్జా హీరోగా దాదాపు 120 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ రూపొందింది. ఈ క‌న్న‌డ మూవీకి సీనియ‌ర్ హీరో అర్జున్ క‌థ‌ను అందించాడు.

ఫ‌స్ట్ వీకెండ్‌లోనే ఔట్‌...

పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో క‌న్న‌డ, తెలుగుతో పాటు ఐదు భాష‌ల్లో అక్టోబ‌ర్ 11న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. కేవ‌లం యాక్ష‌న్ అంశాలు మిన‌హా క‌థ‌లో ఎమోష‌న‌ల్ క‌నెక్ట‌విటీ, కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం, ధృవ్ స‌ర్జా యాక్టింగ్ కూడా అంతంత మాత్రంగానే ఉండ‌టంతో మార్టిన్‌ను నిర్మొహ‌మాటంగా ప్రేక్ష‌కులు తిప్పికొట్టారు.

ఫ‌స్ట్ వీకెండ్‌లోనే థియేట‌ర్ల‌లో క‌నిపించ‌కుండాపోయింది. దాదాపు 120 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన మార్టిన్ మూవీ ఐదు భాష‌ల్లో క‌లిపి 25 కోట్ల‌లోపే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. నిర్మాత‌ల‌కు వంద కోట్ల వ‌ర‌కు న‌ష్టాల‌ను తెచ్చిపెట్టింది.

జీ5 ఓటీటీలో...

తాజాగా మార్టిన్ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్‌ను జీ5 ఓటీటీ సొంతం చేసుకున్న‌ది. ఈ నెల 23 నుంచి మార్టిన్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం. క‌న్న‌డంతో పాటు తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు తెలిసింది. థియేట‌ర్ల‌లో రిలీజైన నెల‌న్న‌ర త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది.

252 రోజులు షూటింగ్‌...

మార్టిన్ మూవీలో ధృవ్ స‌ర్జాకు జోడీగా వైభ‌వి శాండిల్య‌, అన్వేషి జైన్ హీరోయిన్లుగా న‌టించారు.ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీకి ఏపీ అర్జున్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మార్టిన్ మూవీ షూటింగ్ దాదాపు 252 రోజులు జ‌రిగింది. క్లైమాక్స్ యాక్ష‌న్ ఎపిసోడ్‌ను దాదాపు 52 రోజుల పాటు షూట్ చేశారు.

మార్టిన్ క‌థ ఇదే...

అర్జున్ (ధృవ్ స‌ర్జా) ఓ క‌స్ట‌మ్స్ ఆఫీస‌ర్‌. అత‌డిని నిజాయితీకి మెచ్చిన అధికారులు అత‌డిని సీక్రెట్ ఆప‌రేష‌న్ కోసం పాకిస్థాన్ పంపిస్తారు. కానీ అక్క‌డ జ‌రిగిన ప్ర‌మాదంలో అర్జున్ గ‌తం మ‌ర్చిపోతాడు. తాను ఎవ‌ర‌న్న‌ది తెలుసుకునే ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. ఈ అన్వేష‌ణ‌లో అర్జున్‌ క‌ల‌వాల‌ని అనుకున్న వారంతా అత‌డి క‌ళ్ల‌ముందే చ‌నిపోతుంటారు.

త‌న‌ను ప్రాణంగా ప్రేమించిన ప్రీతి (వైభ‌వి శాండిల్య‌) ప్రాణాల‌కు ప్ర‌మాదం పొంచి ఉండ‌టంతో ఇండియాకు వ‌స్తాడు అర్జున్‌. ప్రీతిని ఎలా కాపాడుకున్నాడు? త‌న గ‌తం అర్జున్‌కు గుర్తొచ్చిందా? అర్జున్‌కు మార్టిన్‌కు ఉన్న సంబంధంఏమిటి అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

సీనియ‌ర్ హీరో అర్జున్ మేన‌ల్లుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ధృవ్ స‌ర్జా. మార్టిన్ కంటే ముందు పొగ‌రు, బ‌హ‌ద్దూర్‌తో పాటు మ‌రికొన్ని సినిమాలు చేశాడు.

Whats_app_banner