Nag Ashwin: అర్షద్ వార్సీకి కల్కి డైరెక్టర్ కౌంటర్ - సీక్వెల్‌లో ప్రభాస్ క్యారెక్టర్‌పై హింట్
Nag Ashwin: కల్కిలో ప్రభాస్ లుక్ జోకర్‌లా ఉందంటూ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన కామెంట్లపై దర్శకుడు నాగ్ అశ్విన్ కౌంటర్ ఇచ్చాడు. అర్షద్ వార్సీ పిల్లలకు బుజ్జి బొమ్మలను పంపిస్తానంటూ పేర్కొన్నాడు. కల్కి 2లో ప్రభాస్‌ను మరింత బెస్ట్‌గా చూపిస్తానంటూ పేర్కొన్నాడు.
Nag Ashwin: కల్కి 2898 ఏడీలో ప్రభాస్ లుక్ జోకర్‌లా ఉందంటూ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్నీ రేపుతోన్నాయి. అర్షద్ వార్సీ కామెంట్లను నాని, సిద్దు జొన్నలగడ్డ మా అధ్యక్షుడు మంచు విష్ణుతో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్లు తప్పుబడుతున్నారు. కొందరు బాలీవుడ్ నటులు సైతం అర్షద్ వార్సీ కామెంట్లు సమంజసం కాదంటూ పేర్కొంటున్నారు.
సౌత్ వర్సెస్ నార్త్...
అర్షద్ వార్సీ కామెంట్ల వివాదం కాస్త నార్, సౌత్ అంటూ ఫ్యాన్స్ వార్‌కు దారితీసింది. సౌత్ ఇండస్ట్రీకి బాలీవుడ్ ఎప్పటికీ పోటీరాదని, టాలీవుడ్ హీరోల బాక్సాఫీస్ సక్సెస్‌లు, రికార్డులు, ఇండస్ట్రీ ఎదుగుదలను ఓర్వలేక అసూయ, ద్వేషాలతో బాలీవుడ్ నటులు ఇలాంటి చీప్ కామెంట్ల చేస్తున్నారంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తోన్నారు.
టాలీవుడ్, బాలీవుడ్ అన్నదే లేదు...
కల్కి సినిమా క్లైమాక్స్‌లో ప్రభాస్ కనిపించే సీన్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఓ నెటిజన్ మొత్తం బాలీవుడ్ ఇండస్ట్రీ ఈ ఒక్క సీన్‌కు కూడా సాటిరాదంటూ ట్వీట్ పెట్టాడు. అతడి ట్వీట్‌కు నాగ్ అశ్విన్ రిప్లై ఇచ్చాడు. నార్త్ వర్సెస్ సౌత్, బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ అన్నవే లేవు. అలాంటి కంపేరిజన్స్‌తో మళ్లీ వెనుకటు రోజులకు వెళ్లడం కరెక్ట్ కాదు. ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రమే ఉంది.
అందరంఊ ఒక్క ఇండస్ట్రీకి చెందిన వాళ్లమే. అర్షద్ వార్సీ కాస్త చూసుకొని హుందాగా మాట్లాడితే బాగుండేది అంటూ అంటూ నాగ్ అశ్విన్ రిప్లై ఇచ్చాడు. మీ నలుగురు పిల్లలకు బుజ్జి బొమ్మలు పంపిస్తున్నా అని అర్షద్ వార్సీకి సైలెంట్‌గా నాగ్ అశ్విన్ కౌంటర్ ఇచ్చాడు. కల్కి 2లో ప్రభాస్‌ను మరింత బెస్ట్‌గా చూపిస్తానంటూ పేర్కొన్నాడు.
ద్వేషం పనికిరాదు...
మరో యూజర్ ట్వీట్‌కు అంత ద్వేషం, కోపం పనికిరాదంటూ నాగ్ అశ్విన్ సమాధానమిచ్చాడు. ద్వేషాన్ని తగ్గించేప్రయత్నం చేయడం మంచిదంటూ పేర్కొన్నాడు. నాగ్ అశ్విన్ సమాధానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
ఆరువందల కోట్ల బడ్జెట్...
దాదాపు ఆరు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా 1050కోట్ల వరకు వసూళ్లను సాధించింది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హయ్యస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఏడో ప్లేస్‌లో నిలిచింది.
కమల్ హాసన్ విలన్...
మూడు ఫిక్షనల్ వరల్డ్స్ కథతో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ మూవీని తెరకెక్కించాడు. ఈ మూవీలో కమల్‌హాసన్ విలన్‌గా నటించగా అమితాబ్‌బచ్చన్ కీలక పాత్ర పోషించాడు.
దీపికా పదుకోణ్, దిశా పటానీ హీరోయిన్లుగా నటించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రామ్‌గోపాల్‌వర్మ, రాజమౌళితో పాటు మరికొందరు యాక్టర్లు, డైరెక్టర్లు కీలక పాత్రల్లో కనిపించారు.
కల్కికి సీక్వెల్‌గా కల్కి 2 కూడా రాబోతుంది. సీక్వెల్‌కు సంబంధించి 30 శాతం వరకు షూటింగ్ పూర్తయినట్లు సమాచారం.
హిస్టారికల్ మూవీ…
ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ షూటింగ్‌తో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. సూపర్ నాచురల్ హారర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తోన్నాడు. హను రాఘవపూడితో ప్రభాస్ ఓ హిస్టారికల్ మూవీ చేయబోతున్నాడు. ఇటీవలే ఈ సినిమా లాంఛ్ అయ్యింది.