Kriti Sanon Smoking: సిగరెట్ తాగుతూ దొరికిపోయిన హీరోయిన్.. ఆమె తల్లి చేసిన పాత ట్వీట్‌తో ట్రోల్ చేస్తున్న నెటిజన్లు-kriti sanon smoking in greece video photos gone viral fans trolling her with an old tweet ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kriti Sanon Smoking: సిగరెట్ తాగుతూ దొరికిపోయిన హీరోయిన్.. ఆమె తల్లి చేసిన పాత ట్వీట్‌తో ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

Kriti Sanon Smoking: సిగరెట్ తాగుతూ దొరికిపోయిన హీరోయిన్.. ఆమె తల్లి చేసిన పాత ట్వీట్‌తో ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

Hari Prasad S HT Telugu

Kriti Sanon Smoking: బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ సిగరెట్ తాగుతూ కెమెరాలకు దొరికిపోయింది. దీంతో గతంలో ఆమె తల్లి చేసిన పాత ట్వీట్ ను బయటకు తీసి ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.

సిగరెట్ తాగుతూ దొరికిపోయిన హీరోయిన్.. ఆమె తల్లి చేసిన పాత ట్వీట్‌తో ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

Kriti Sanon Smoking: వన్ నేనొక్కడినే, ఆదిపురుష్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్. ఇప్పుడామె గ్రీస్ లో సిగరెట్ తాగుతూ కెమెరాలకు దొరికిపోయింది. ఆమెకు అలవాటు కాదు కదా.. పక్కన వాళ్లు సిగరెట్ తాగుతున్నా ఆమె వారిస్తుందంటూ కృతి తల్లి గతంలో చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

కృతి సనన్ స్మోకింగ్

ఆదిపురుష్ మూవీలో సీతగా నటించి మెప్పించింది కృతి సనన్. ఆమె జులై 27న తన బర్త్ డే జరుపుకుంది. ఈ సెలబ్రేషన్స్ కోసం కృతి తన సోదరి నుపుర్, బాయ్‌ఫ్రెండ్ కబీర్ బహియాతో కలిసి గ్రీస్ వెళ్లింది. అక్కడ ఎవరో అభిమాని తీసిన వీడియోలో కృతి ఓ రెడ్ డ్రెస్ లో కనిపించింది. ఆ వీడియో చివర్లో కృతి చేతుల్లో సిగరెట్ కనిపించినట్లు ఓ రెడిట్ యూజర్ దానిని పోస్ట్ చేశారు.

దీంతో ఆ వీడియో, ఫొటోలు వైరల్ అయ్యాయి. సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరమే అయినా.. ఇందులో పెద్ద విశేషం ఏముంది అంటూ కొందరు కృతికి సపోర్ట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమె తల్లి గతంలో చేసిన ట్వీట్ ను వెలికి తీసి కృతిని ట్రోల్ చేస్తుండటం విశేషం. కృతి సిగరెట్ తాగడం కాదు కదా.. తన చుట్టుపక్కల ఎవరైనా తాగినా వారిస్తుందన్నది ఆ ట్వీట్ సారాంశం.

గ్రీస్‌లో దొరికిపోయిన కృతి?

అయితే ఆ వీడియో అంత స్పష్టంగా కనిపించడం లేదు. ఆమె కృతి సననేనా కాదా అన్నది ఒక వాదన అయితే.. ఆమె సిగరెట్ కాల్చుతోందా లేదా అన్నది కూడా స్పష్టంగా తెలియడం లేదు. ఇండియాలో పబ్లిక్ ప్లేస్ లలో తమ ఇమేజ్ ను కాపాడుకోవడం కోసం ఇలాంటి వాటికి దూరంగా ఉండే వీళ్లు.. బయటి దేశాల్లో మాత్రం విచ్చలవిడిగా ఇలా చేసేస్తుంటారని ఓ యూజర్ కామెంట్ చేయడం గమనార్హం.

వాళ్లూ మనుషులే.. వాళ్ల బతుకేలేవో వాళ్లను బతకనీయండి.. ప్రైవసీతో బతకడానికి వాళ్లు చంద్రుడిపైకి వెళ్లాలా అని మరో యూజర్ ఆమెకు మద్దతుగా కామెంట్ చేశారు. గతంలో ఆమె నటించిన బరేలీ కీ బర్ఫీ మూవీలో తనకు సిగరెట్ కాల్చే అలవాటు లేకపోయినా.. సినిమా కోసం చేయాల్సి వచ్చిందని కృతి చెప్పిన వీడియోను కూడా కొందరు వైరల్ చేస్తున్నారు.

ఈ వీడియోపైనే అప్పట్లో కృతి తల్లి గీత ట్వీట్ చేసింది. ఆమె స్మోకింగ్ కు వ్యతిరేకం అని, తన చుట్టూ ఎవరైనా అలాంటి వాళ్లుంటే మానేయాలని చెబుతుందని అప్పట్లో కృతి తల్లి ట్వీట్ చేయడం విశేషం. తెలుగులో మహేష్ బాబు సరసన వన్ నేనొక్కిడినే మూవీతో కృతి సనన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత బాలీవుడ్ లో వరుస ఆఫర్లతో బిజీ అయింది. ఆదిపురుష్ లో ప్రభాస్ తో కలిసి సీత పాత్రలో ఆమె నటించింది.