Raayan Mahesh Babu Review: ఈ సినిమా కచ్చితంగా చూడండి అంటున్న మహేష్ బాబు.. సూపర్ స్టార్ రివ్యూ వైరల్
Raayan Mahesh Babu Review: సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా ధనుష్ నటించిన రాయన్ మూవీ చూసి రివ్యూ ఇచ్చాడు. ఇది కచ్చితంగా చూడాల్సిన సినిమా అంటూ ఒక్క ముక్కలో తన అభిప్రాయాన్ని చెప్పాడు.

Raayan Mahesh Babu Review: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇప్పుడో సినిమా తెగ నచ్చేసింది. ఈ మూవీని అందరూ కచ్చితంగా చూడండి అంటూ ట్వీట్ ద్వారా తన రివ్యూ ఇచ్చాడు. ఆ సినిమా మరేదో కాదు తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన రాయన్ మూవీ. ఈ మూవీని చూసిన తర్వాత సోమవారం (జులై 29) రాత్రి 11 గంటల తర్వాత సూపర్ స్టార్ ట్వీట్ చేయడం విశేషం.
మహేష్ బాబు రాయన్ రివ్యూ
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించి, డైరెక్ట్ చేసిన మూవీ రాయన్. గత శుక్రవారం (జులై 26) రిలీజైన ఈ సినిమాకు తొలి రోజే మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. నటుడిగా ధనుష్ అదరగొట్టినా.. అతడు డైరెక్టర్ గా అంత మెప్పించలేకపోయాడని పలువురు కామెంట్ చేశారు. అయితే తాజాగా తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ సినిమా చూసి తన రివ్యూ ఇచ్చాడు.
ఇది కచ్చితంగా చూడాల్సిన సినిమా అని అతడు అనడం విశేషం. ధనుష్ నటనకు ఫిదా అయినట్లు మహేష్ చెప్పాడు. "రాయన్.. ధనుష్ మెరిశాడు.. అద్భుతంగా డైరెక్ట్ చేయడంతోపాటు నటించాడు. ఎస్‌జే సూర్య, ప్రకాశ్ రాజ్, సందీప్ కిషన్, మొత్తం నటీనటులందరూ చాలా బాగా నటించారు. మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్ ఎలక్ట్రిఫయింగ్ స్కోర్ అందించాడు. కచ్చితంగా చూడాల్సిన సినిమా. మొత్తం టీమ్ కు శుభాకాంక్షలు" అని మహేష్ బాబు ట్వీట్ చేశాడు.
మహేష్ ఇచ్చిన రివ్యూపై ఈ మూవీలో నటించిన సందీప్ కిషన్ స్పందించాడు. "థ్యాంక్యూ సర్.. చాలా బాగా చెప్పారు. మీకు సినిమా నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది" అని మహేష్ చేసిన ట్వీట్ పై సందీప్ కామెంట్ చేశాడు. రాయన్ మూవీలో ధనుష్ తోపాటు సెల్వరాఘవన్, అపర్ణ బాలమురళీ, వరలక్ష్మి శరత్ కుమార్ లాంటి వాళ్లు నటించారు.
రాయన్ మూవీ ఎలా ఉందంటే?
అన్నతమ్ముళ్ల సెంటిమెంట్ ఫార్ములా ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద ఊపు ఊపేసింది. తమ్ముళ్ల బాగుకోసం అన్న ఏన్నో పోరాటాలు, త్యాగాలు చేయడం అనే సెంటిమెంట్ కథలతో రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలు పలు సినిమాలు చేసి విజయాల్ని అందుకున్నారు. రాయన్ అదే ఫార్ములాతో వచ్చిన రెగ్యులర్ రివేంజ్ డ్రామా మూవీ.
రొటీన్ స్టోరీకి తనదైన ట్రీట్‌మెంట్‌తో కొత్తదనం జోడించారు దర్శకుడు ధనుష్. సినిమా కంప్లీట్‌గా రా అండ్ రస్టిక్‌గా సాగుతుంది. మాస్ యాంగిల్ వల్లే సినిమాలో ప్రెష్‌నెస్ కనిపించింది. సినిమాలో ధనుష్ క్యారెక్టర్ మొత్తం అండర్‌ప్లేతో సాగుతుంది. అతడికి ఓ భీభత్సమైన ఫ్లాష్‌బ్యాక్ ఏదో ఉంటుందని సస్పెన్స్ క్రియేట్ చేస్తూవెళ్లాడు డైరెక్టర్. సినిమా బోర్‌గా సాగిపోతూ ట్రాక్ తప్పుతుందన్న టైమ్‌లో యాక్షన్ ఎపిసోడ్స్, ఎలివేషన్స్‌తో నిలబెట్టాడు ధనుష్.
ఈ సినిమా తొలి రోజే రూ.12.5 కోట్లు వసూలు చేసి అదరగొట్టింది. తమిళంలో రూ.11 కోట్లు రాగా.. తెలుగులో రూ.1.5 కోట్లు రావడం విశేషం. తమిళంతోపాటు తెలుగులోనూ తనకంటూ ప్రత్యేక మార్కెట్ క్రియేట్ చేసుకున్న ధనుష్.. రాయన్ మూవీ ద్వారా మరోసారి ఇక్కడి ప్రేక్షకులను అలరించాడు.