JR NTR: అరుదైన ఘనత సాధించిన జూనియర్ ఎన్టీఆర్.. అందులో ఒకే ఒక్క తెలుగు హీరోగా రికార్డ్-jr ntr gets 25th place in asian top 50 stars of eastern eye 2023 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jr Ntr: అరుదైన ఘనత సాధించిన జూనియర్ ఎన్టీఆర్.. అందులో ఒకే ఒక్క తెలుగు హీరోగా రికార్డ్

JR NTR: అరుదైన ఘనత సాధించిన జూనియర్ ఎన్టీఆర్.. అందులో ఒకే ఒక్క తెలుగు హీరోగా రికార్డ్

Sanjiv Kumar HT Telugu
Dec 23, 2023 10:29 AM IST

JR NTR Eastern Eye 2023: యంగ్ టైగర్ జూనియర్ 2023 ఆసియా టాప్ 50 నటుల జాబితాలో చోటు సంపాదించుకుని మరో ఘనత సాధించాడు. ఏకైక తెలుగు హీరోగా అరుదైన రికార్డ్ సంపాదించి అభిమానులు పండుగ చేసుకునే అవకాశం ఇచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

అరుదైన ఘనత సాధించిన జూనియర్ ఎన్టీఆర్.. అందులో ఒకే ఒక్క తెలుగు హీరోగా రికార్డ్
అరుదైన ఘనత సాధించిన జూనియర్ ఎన్టీఆర్.. అందులో ఒకే ఒక్క తెలుగు హీరోగా రికార్డ్

JR NTR Asian Top Stars 2023: RRR సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు. దేవర మూవీని రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నట్లు తెలిసిందే. దేవర మూవీ మొదటి పార్టును వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ఇదే కాకుండా బాలీవుడ్ యాక్షన్ మూవీ వార్ 2 సినిమాలో కూడా ఎన్టీఆర్ పవర్‌ఫుల్ రోల్ చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలతోపాటు తారక్ చేస్తున్న మరో క్రేజీ మూవీ NTR31. కేజీఎఫ్ సిరీస్, సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తెరకెక్కిస్తున్న ఈ సినిమా అనౌన్స్ మెంట్‌తోనే భారీ అంచనాలు నెలకొంది. ఇదిలా ఉంటే తాజాగా అభిమానులు తలెత్తుకునేలా ఎన్టీఆర్ అరుదైన ఘనత సాధించాడు.

2023లో ఆసియాలో టాప్ 50 నటుల జాబితాలో చోటు సంపాదించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ విషయాన్ని ఏషియన్ వీక్లీ మ్యాగజైన్ 'ఈస్టర్న్ ఐ 2023' పేరుతో ప్రకటించింది. ఆసియా టాప్ 50 యాక్టర్స్ జాబితాలో జూనియర్ ఎన్టీఆర్ 25వ స్థానం సాధించుకున్నాడు. దీంతో ఈ జాబితాలో టాలీవుడ్ నుంచి అంటే తెలుగు నుంచి స్థానం సంపాదించుకున్న ఏకైగా హీరోగా తారక్ కావడం విశేషంగా మారింది. దీంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

ఇక ఏషియన్ టాప్ 50లో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ మొదటి స్థానంలో నిలిచాడు. అలాగే అలియా భట్, ప్రియాంక చోప్రా రెండు, మూడు స్థానాలు సంపాదించుకున్నారు. ఇక రణ్‌బీర్ కపూర్‌కు 6, ఇళయదళపతి విజయ్‌కు 8 స్థానాలు వచ్చాయి.

Whats_app_banner