Devara Part 1: మూడు కట్స్ తర్వాత దేవర సినిమాకి సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్.. ఆ సీన్‌లో డిస్ల్కైమర్ వేయాలని సూచన
Devara Part 1 Censor Certificate: జూనియర్ ఎన్టీఆర్ దేవర పార్ట్-1 సినిమాకి సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ వచ్చేసింది. నాలుగు సీన్లపై అభ్యంతరం తెలిపిన సెన్సార్ బోర్డు సభ్యులు.. మూడింటిని తొలగించాలని సూచించింది. అలానే ఒక సీన్‌లో డిస్ల్కైమర్ వేయాలని చిత్ర యూనిట్‌ని ఆదేశించింది.
Jr NTR Devara Part 1 Release Date: భారీ అంచనాల నడుమ విడుదలకి సిద్ధమవుతున్న దేవర పార్ట్- 1మూవీకి సెన్సార్ నుంచి క్లియరెన్స్ వచ్చేసింది. జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ మూవీకి నాలుగు కట్స్ తర్వాత U/A సర్టిఫికేట్‌ను సెన్సార్ బోర్డు ఇచ్చినట్లు బాలీవుడ్ హంగామా తెలిపింది.
'మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ దేవర: పార్ట్ 1 (తెలుగు)కు సెన్సార్ బోర్డు నుంచి యు/ఏ సర్టిఫికేట్ లభించింది' అని నిర్మాతలు ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఈ చిత్రంలో నాలుగు చోట్ల సీన్లకి అభ్యంతరం తెలిపిన సెన్సార్ బోర్డు.. కట్ సూచించినట్లు తెలుస్తోంది. దానికి చిత్ర యూనిట్ అంగీకరించిన తర్వాత యు/ఎ సర్టిఫికేట్ జారీ చేసింది.
సినిమాలో హింసకు సంబంధించిన మూడు సీన్లపై అభ్యంతరం తెలిపిన సెన్సార్ బోర్డు.. జూనియర్ ఎన్టీఆర్ సముద్రంలో షార్క్ రైడింగ్ చేస్తున్న సీన్ దగ్గర డిస్ల్కైమర్ వేయమని సూచించినట్లు తెలుస్తోంది.
కట్ చెప్పిన సీన్లు ఏవంటే.. భార్యను కడుపులో తన్నుతున్న తండ్రి పాత్ర షాట్, రెండవది బిడ్డ తన తల్లిని తన్నే సీన్, మూడవది కత్తికి వేలాడుతూ ఒక పాత్ర కిందకు జారిపోయే ఐదు సెకన్ల షాట్. ఈ మూడింటినీ కత్తిరించాలని సెన్సార్ బోర్డు సూచించింది.
డిస్ల్కైమర్ వేయమన్న సెన్సార్ బోర్డు
నాలుగో మార్పు.. జూనియర్ ఎన్టీఆర్ సముద్రంలో షార్క్ రైడింగ్ చేస్తున్న షాట్. ఆ సీన్ సమయంలో సిజిఐ ద్వారా షార్క్ జనరేట్ చేయబడిందని అని డిస్ల్కైమర్ వేయాల్సిందిగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అధికారులు చిత్ర యూనిట్‌కి సూచించింది. సినిమా చిత్రీకరణ సమయంలో జంతువులకు హాని కలిగించడం భారతదేశంలో అనుమతించరు. ఈ నాలుగు మార్పుల తర్వాత 2 గంటల 58 నిమిషాల రన్ టైమ్‌తో దేవర: పార్ట్ 1 విడుదలకు యు/ఎ సర్టిఫికేట్‌తో క్లియరెన్స్ లభించింది.
జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్
రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్రం భారతదేశంలోని తీరప్రాంతాల నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా. మొదటి భాగం ఈ ఏడాది సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది. దేవర: పార్ట్ 1లో జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ కీలక పాత్రల్లో నటించారు. జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేశాడు.
నందమూరి కళ్యాణ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన జనతా గ్యారేజ్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.