RRR Paid for Oscar: ఆస్కార్‌ను కొన్న ఆర్ఆర్ఆర్ టీమ్.. బాలీవుడ్ ఆర్టిస్ట్ షాకింగ్ కామెంట్స్..!
RRR Paid for Oscar: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు చెందిన మేకప్ ఆర్టిస్ట్, ఆమె సన్నిహితుడు షాన్ ముత్తాతిల్ ఆర్ఆర్ఆర్ చిత్రంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆర్ఆర్ఆర్ టీమ్ ఆస్కార్‌ను డబ్బుతో కొనుగోలు చేసిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
RRR Paid for Oscar: ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆస్కార్ అవార్డు రావడంతో తెలుగు వారే కాకుండా యావత్ దేశమొత్తం గర్వంతో పొంగిపోతుంది. నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ గెలవడం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాతో పాటు బెస్ట్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ది ఎలిఫెంట్ విస్పరర్స్‌కు అకాడమీ రావడం భారత్ పేరు అంతర్జాతీయ వేదికపై మారుమోగిపోయింది. ఇలాంటి సంతోషకరమైన క్షణాల్లో కొన్ని నెగిటివ్ కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. భారత చలనచిత్ర సీమ చరిత్రలో తొలిసారిగా ఆస్కార్ రావడంపై ఆనందించాల్సి పోయి అక్కసు వెళ్లగక్కుతున్నారు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ చిత్రానికి అకాడమీ రావడంపై షాకింగ్ కామెంట్ చేశాడు ఓ బాలీవుడ్ ఆర్టిస్ట్.
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వ్యక్తిగత మేకప్ ఆర్టిస్టు, స్నేహితుడు అయిన షాన్ ముత్తాతిల్ ఆర్ఆర్ఆర్ చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆర్ఆర్ఆర్ బృందం.. ఆస్కార్‌ను కొనుగోలు చేసిందంటూ షాకింగ్ కామెంట్లు విసిరాడు. తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ గెలవడంపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. "హా హా.. చాలా ఫన్నీగా ఉంది. ఇండియాలో మాత్రమే అవార్డులు కొనుగోలు చేస్తారని అనుకున్నా. కానీ ఇప్పుడు ఆస్కార్స్‌లో కూడా అది సాధ్యమవుతుందని తెలుస్తోంది. మన దగ్గర డబ్బుంటే ఎప్పుడై, ఏదైనా చేయవచ్చు. ఆస్కార్‌ను చూస్తుంటే నవ్వొస్తుంది." అంటూ షాన్ కామెంట్ చేశాడు,
షాన్ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా ఈ కామెంట్‌పై విశేషంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా షాన్‌పై విరుచుకుపడుతూ కామెంట్లు చేస్తున్నారు. షాన్ జలస్ ఫీలవుతున్నాడని, సౌత్ సినిమాల సక్సెస్‌ను చూసి ఓర్వలేకపోతున్నాడని తీవ్రంగా స్పందిస్తున్నారు. అతడు కేవలం పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నారని మరికొంతమంది అంటున్నారు. ఇదిలా ఉంటే షాన్ మాత్రం బయటపడ్డాడని, చాలా మంది బాలీవుడ్ సెలబ్రెటీలు విషయంలోనూ ఇలాంటి అసూయ కనిపిస్తోందని నెటిజన్లు అనుకుంటున్నారు.
ఇటీవల జరిగిన 95వ ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు సాంగ్ పురస్కారం సాధించింది. టాప్ గన్ మ్యావ్రిక్ సినిమా నుంచి లేడీ గాగా ఆలపించిన హోల్ట్ మై హ్యాండ్, బ్లాక్ ఫ్యాంతర్ వకాండ ఫరెవర్ నుంచి రిహానా పాడిన్ లిఫ్ట్ మీ అప్ లాంటి పాపులర్ సాంగ్స్‌ను కూడా అధిగమించి నాటు నాటు పాట ఆస్కార్ గెలిచింది. పాట స్వరపరిచిన ఎంఎం కీరవాణి, రాసిన చంద్రబోస్ ఆస్కార్ అవార్డులు అందుకున్నారు. దీంతో ఆర్ఆర్ఆర్ చిత్రంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంటే.. కొంతమంది మాత్రం తమ అసూయను వెళ్లగక్కుతున్నారు.
సంబంధిత కథనం