Ileana Confirms Pregnancy: పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న ఇలియానా - ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వైరల్
Ileana Confirms Pregnancy: గోవా బ్యూటీ ఇలియానా తల్లికాబోతున్నది. తాను తల్లికాబోతున్న విషయాన్ని మంగళవారం ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నది.
Ileana Confirms Pregnancy: పోకిరి బ్యూటీ ఇలియానా తల్లికాబోతున్నది. ఈ గుడ్‌న్యూస్‌ను మంగళవారం ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నది ఇలియానా. నా లిటిల్ డార్లింగ్‌ను చూసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. కమింగ్ సూన్ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది ఇలియానా.
చిన్నారి డ్రెస్ ఫొటోను పోస్ట్ చేసింది. ఇలియానా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు ఇలియానాకు శుభాకాంక్షలు చెబుతోన్నారు. ఇలియానా తల్లి సమీరా డిక్రూజ్ కూడా కూతురికి శుభాకాంక్షలు అందజేస్తూ ఎమోషనల్ రిప్లై ఇచ్చింది. కొత్త ప్రపంచంలోకి నా మనవరాలికి స్వాగతం పలికేందుకు రెడీగా ఉన్నా అంటూ డ్యాన్సింగ్ ఎమోజీలను జోడించింది.
పెళ్లి కాకుండానే తల్లి అవుతోన్న ఇలియానా...
పెళ్లి కాకుండా ఇలియానా తల్లి కాబోతుండటం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. గత కొంతకాలంగా కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మైఖేల్‌తో ఇలియానా డేటింగ్లో ఉంది. వీరిద్దరు సన్నిహితంగా ఉన్న పలు ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్నాయి. పెళ్లి కాకుండానే ఈ జోడీ తల్లిదండ్రులుగా మారుతోన్నారు. ఇలియానా, సెబాస్టియన్‌కు కత్రినా, విక్కీ కౌశల్ ఫ్యాన్స్ కూడా విషెస్ అందజేస్తున్నారు.
కాగా ఒకప్పుడు టాలీవుడ్లో అగ్ర హీరోయిన్లలో ఒకరిగా కొనసాగింది ఇలియానా. మహేష్‌బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది.
టాలీవుడ్లో అగ్ర నాయికగా కొనసాగుతోన్న తరుణంలోనే బాలీవుడ్ బాట పట్టింది. కానీ ఆశించిన సక్సెస్‌లను మాత్రం అందుకోలేకపోయింది. అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్‌కు దూరమైన ఇలియానా ప్రస్తుతం మ్యూజిక్ వీడియోలలో నటిస్తోంది.