RRR Win Oscars: ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ పక్కా.. డిక్లేర్ చేసిన హాలీవుడ్ నిర్మాత
RRR Win Oscars: ప్రముఖ హాలీవుడ్ నిర్మాత జేసన్ బ్లమ్.. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆస్కార్ తప్పకుండా వస్తుందని డిక్లేర్ చేశారు. ఈ సినిమా అద్భుతంగా ఉందని ప్రశంసల వర్షం కురిపించారు. గతేడాది మార్చి 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
RRR Win Oscars: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మేనియా ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. ఈ సినిమా భాషతో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా సూపర్ సక్సెస్ అందుకుంది. విడుదలైనప్పుడు కంటే కూడా ఆ తర్వాతి కాలంలో విదేశాల్లో విపరీతంగా ఆదరణ పొందింది. పాశ్చాత్య ప్రజలు ఆర్ఆర్ఆర్ చిత్రంపై ఎప్పటికప్పుడు తమ ప్రేమను కురిపిస్తూనే ఉన్నారు. దీంతోఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ తప్పకుండా వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హాలీవుడ్ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల వర్షాన్ని కురిపించారు. తాజాగా ఈ జాబితాలో మరో హాలీవుడ్ నిర్మాత కూడా చేరిపోయారు. ప్రముఖ నిర్మాత జేసన్ బ్లమ్.. ఆర్ఆర్ఆర్‌కు ఉత్తమ చిత్రంగా ఆస్కార్ వస్తుందని ట్విటర్ వేదికగా తెలియజేశారు.
"ఆర్ఆర్ఆర్ ఉత్తమ చిత్రంగా ఆస్కార్ గెలుస్తుందని నేను అనుకుంటున్నాం. ఇది తొలుత మీరు నా నుంచి విన్నారు. గుర్తు పెట్టుకోండి. నేను చెప్పింది కరెక్టే అయితే నా సొంత ఆస్కార్ నేను ప్రదానం చేస్తున్నాను" అని జేసన్ బ్లమ్ అన్నారు.
జేసన్ బ్లమ్ ఆస్రాన్ నామినేటెడ్ చిత్రం గెట్ అవుట్, పారోనార్మల్ యాక్టివిటీ, ఇన్‌సీడియస్ లాంటి పలు సినిమాలకు నిర్మాగా వ్యవహరించారు. తాజాగా రాజమౌళి విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్ కూడా ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా ఆస్కార్ గెలుస్తుందని స్పష్టం చేశారు.
ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా భట్, తారక్ సరసన బ్రిటీష్ యాక్ట్రెస్ ఒలివియా మోరిస్ నటించారు. అజయ్ దేవగణ్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదలైంది. మొత్తంగా రూ.1200 కోట్ల పైచిలుకు కలెక్షన్లు రాబట్టింది.
సంబంధిత కథనం