Gopichand: మాచో స్టార్ గోపిచంద్ తొలి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
టాలీవుడ్ హీరో గోపిచంద్ తన మొదటి పారితోషికం గురించి వివరించారు. ఆయన తాజా చిత్రం పక్కా కమర్షియల్ ప్రమోషన్లలో భాగంగా ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ సినిమా జులై 1న విడుదల కానుంది.
టాలీవుడ్‌లో మాచో స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరో గోపిచంద్. తెలుగులో రెండు దశబ్దాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఈ స్టార్.. వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. 2001లో తొలి వలపు చిత్రంతో ముత్యాల సుబ్బయ దర్శకత్వంలో హీరోగా అరంగేట్రం చేశారు. అయితే ఆ చిత్రం బాక్సాఫిస్ వద్ద విపలమవడంతో విలన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. జయం, వర్షం, నిజం సినిమాల్లో భయంకరమైన ప్రతినాయకుడిగా దుమ్మురేపారు. తర్వాత హీరోగానూ వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన పక్కా కమర్షియల్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవల ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న గోపిచంద్ తన గురించి ఆసక్తికర విషయాలను తెలియజేశారు.
పక్కా కమర్షియల్ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయనను తన తొలి రెమ్యునరేషన్ గురించి అడుగ్గా.. తను నటించిన రెండి సినిమా జయం చిత్రానికి గాను 11 వేల రూపాయలు అందుకున్నట్లు తెలియజేశారు. దీన్ని బట్టి చూస్తే.. గోపిచంద్ హీరోగా చేసిన తొలి సినిమాకు ఆయన ఎలాంటి పారితోషికాన్ని తీసుకోలేదని తెలుస్తుంది. తేజ దర్శకత్వం వహించిన జయం సినిమాలో అద్భుతమైన విలనిజంతో గోపిచంద్ ఆకట్టుకున్నారు. ఇప్పటికీ అందులో ఆయన పాత్ర తాలుకు పర్ఫార్మెన్స్ ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. అంతలా నటించారు.
గోపిచంద్ విలన్‌గా జయంతో పాటు మహేశ్ బాబు నిజం, ప్రభాస్ వర్షం సినిమాలో చేశారు. అయితే హీరోగా నిరూపించుకోవాలనే ఉద్దేశంతో ఏఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన యజ్ఞం సినిమాతో తిరిగి హీరోగా రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం 2004లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అక్కడ నుంచి ఆంధ్రుడు, రణం, ఒక్కడున్నాడు. లక్ష్యం, శౌర్యం, లౌక్యం, జిల్, సీటీమార్ లాంటి విజయాలను తన సొంతం చేసుకున్నారు.
ప్రస్తుతం పక్కా కమర్షియల్ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను సందడి చేయబోతున్నారు. ఈ సినిమా జులై 1న విడుదల కానుంది. వినోదాత్మక దర్శకుడు మారుతీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాశీ ఖన్నా ఇందులో హీరోయిన్‌గా చేసింది. యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.
సంబంధిత కథనం
టాపిక్