(1 / 7)
నయనతార, ధనుష్ వివాదం ముదురుతోంది. ఈ వివాదంలో నయనతారకి మద్దతుగా హీరోయిన్ శ్రుతిహాసన్ నిలిచింది. నయనతారకు అనుకూలంగా ఆమె పోస్ట్‌కి శ్రుతిహాసన్ లైక్ చేసింది. 2012లో నటుడు ధనుష్ తో కలిసి 3 సినిమాలో శ్రుతిహాసన్ నటించింది.
(2 / 7)
నజ్రియా 2013లో నటుడు ధనుష్‌తో కలిసి నయ్యాండీ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈ ముద్దుగుమ్మ కూడా ఇప్పుడు నయనతార పోస్ట్‌కి లైక్ కొట్టింది. దాంతో ధనుష్‌కి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకున్నట్లు తేలిపోయింది.
(3 / 7)
2016లో వచ్చిన కోడి సినిమాలో ధనుష్‌తో కలిసి అనుపమ పరమేశ్వరన్ నటించింది. అనుపమ కూడా నయనతార పోస్ట్‌కి లైక్ కొట్టింది. అంటే.. ధనుష్‌కి వ్యతిరేకంగా మారినట్లే.
(4 / 7)
పార్వతి తిరువోతు 2016లో వచ్చిన మారియన్ సినిమాలో ధనుష్‌తో కలిసి హీరోయిన్‌గా నటించింది. ఇప్పుడు నయనతార పోస్ట్‌ను ఈమె కూడా లైక్ కొట్టింది.
(5 / 7)
2018లో నటుడు ధనుష్‌తో కలిసి నటించిన వడచెన్నై చిత్రంలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో లిప్ లాక్ కూడా ఉంది. కానీ.. ఈరోజు నయనతార పోస్ట్‌కి ఈ హీరోయిన్ కూడా లైక్ కొట్టింది.
(6 / 7)
2021లో వచ్చిన కర్ణన్ చిత్రంలో నటుడు ధనుష్‌తో కలిసి గౌరి జి కిషన్ ఒక చిన్న పాత్ర చేశారు. ఇప్పుడు నయనతార పోస్ట్ నచ్చి మద్దతుగా లైక్ కొట్టారు. దాంతో ధనుస్ ఒంటరి అయిపోయినట్లు కోలీవుడ్ తేల్చేస్తోంది.
(7 / 7)
2008లో ధనుష్ సరసన యారడి నీ మోహిని చిత్రంలో నయనతార నటించింది. 'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' అనే డాక్యుమెంటరీ కోసం ధనుష్ నిర్మించిన ‘నేనూ రౌడీనే’ 3 సెకన్ల సీన్‌ను ఇందులో వాడుకున్నారు. దానికే రూ.10 కోట్లు డిమాండ్ చేస్తూ ధనుష్ నోటీసులు పంపారు. దాంతో నయనతార ఘాటు లేఖ సంధించింది.
ఇతర గ్యాలరీలు