weekly horoscope: ఈ వారం వారఫలాలు- ఈ రాశి వారికి వ్యాపారం నిరాశాజనకంగా ఉంటుం-weekly horoscope in telugu november 17th to 23rd check zodiac signs result ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Weekly Horoscope: ఈ వారం వారఫలాలు- ఈ రాశి వారికి వ్యాపారం నిరాశాజనకంగా ఉంటుం

weekly horoscope: ఈ వారం వారఫలాలు- ఈ రాశి వారికి వ్యాపారం నిరాశాజనకంగా ఉంటుం

HT Telugu Desk HT Telugu
Nov 17, 2024 02:02 AM IST

Weekly Horoscope Telugu : ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. నవంబర్ 17 నుంచి 23వ తేదీ వరకు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.

రాశిఫలాలు (వారఫలాలు) 17-11-2024 నుంచి 23.11.2024
రాశిఫలాలు (వారఫలాలు) 17-11-2024 నుంచి 23.11.2024

రాశిఫలాలు (వారఫలాలు) 17-11-2024 నుంచి 23.11.2024

మాసం: కార్తీకము,

ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ సంవత్సరం

హిందుస్తాన్‌ టైమ్స్‌

రాశిఫలాలు (వారఫలాలు) 17-11-2024 నుంచి 23.11.2024

మాసం: కార్తీకము,

ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ సంవత్సరం

మేషం:

అనుకున్నది సాధిస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అన్నింటా ప్రోత్సాహం లభిస్తుంది. సమయం వృథా చేయవద్దు. ఉద్యోగంలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. స్థిరాస్తి కొనుగోలుపై ఆసక్తి చూపుతారు. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంపై సరిగ్గా దృష్టి సారించాలి. వ్యాపారంలో లాభసూచన. అదృష్ట రంగులు ఎరుపు, బంగారురంగు. లక్ష్మీదేవిని పూజించండి.

వృషభం:

అనుకూలమైన కాలం. సకాలంలో పనులు ప్రారంభించాలి. కోరుకున్నది నెరవేరుతుంది. సహోద్యోగులతో వివాదాలు తలెత్తవచ్చు. ఉద్యోగంలో ప్రోత్సాహం లభిస్తుంది. శత్రుపీడ తొలగుతుంది. మిత్రుల సహకారం లభిస్తుంది. వ్యాపారంలో లాభసూచన. నలుపు, లేత గులాబీ రంగులు. లక్ష్మీదేవి ఆరాధన ఉత్తమం.

మిథునం:

మాటపట్టింపులతో వివాదాలు తలెత్తుతాయి. కుటుంబంలో ఘర్షణలు మానసిక అశాంతి కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసంతో నిబ్బరంగా ఉండండి. ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. వారం మధ్యలో ఒత్తిళ్ళు పెరుగుతాయి. ఖర్చులు అధికమవుతాయి. తెలుపు, ఆకుపచ్చ రంగులు, ఈశ్వరారాధన ఉత్తమం.

కర్కాటకం:

అప్రమత్తంగా ఉండాలి. దైవం తోడ్పాటు లభిస్తుంది. బాధ్యతలు సక్రమంగా నెరవేర్చండి. ఒత్తిళ్ళు పెరుగుతాయి. పనులు సజావుగా సాగవు. బంధుమిత్రులతో వివాదాలు. వ్యాపారులకు నిరాశాజనకంగా ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం. కళాకారులకు, రాజకీయ నాయకులకు కష్టం మిగులుతుంది. అనారోగ్యం తలెత్తుతుంది. ఆకస్మిక ధనలాభ సూచన. లేత ఆకుపచ్చ, నేరేడు రంగులు. దేవీ స్తోత్రం పఠించండి.

సింహం:

ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఆకస్మిక ధనలాభం. శుభకార్యాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు సానుకూల ఫలితం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు అనుకూలమైన కాలం. కళారంగంలోనివారికి, ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. అనారోగ్య సూచన. పసుపు, నేరేడు రంగులు. గణేశ స్తోత్రం పఠిస్తే మంచిది.

కన్య:

ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సమస్యలనుంచి బయటపడతారు. అనుకున్నవి జరుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. విద్యార్థులకు అనుకూలమైన కాలం. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగుల సమస్యలు తీరతాయి. బంధువులతో విరోధాలు తలెత్తవచ్చు. గులాబీ, లేత ఎరుపు రంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

తుల:

శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తీరతాయి. వాహనయోగం. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో మంచి లాభాలు గడిస్తారు. ఉద్యోగులకు పైవారి మెప్పు లభిస్తుంది. రాజకీయనాయకులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో అనుకోని ఖర్చులు వస్తాయి. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు. ఆంజనేయ దండకం, హనుమాన్‌చాలీసా పఠించండి..

వృశ్చికం:

ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. పలుకుబడి పెరుగుతుంది. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగులకు పదోన్నతి లభించవచ్చు. వాహనం కొనుగోలు చేస్తారు. కళారంగంలోనివారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో ఖర్చులు పెరుగుతాయి. నీలం, ఆకుపచ్చ రంగులు. దుర్గాదేవి స్తోత్రాలు పఠిస్తే మంచిది.

ధనుస్సు:

ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. ఇంటినిర్మాణం చేపడతారు. రాజకీయ నాయకుల కోరికలు తీరతాయి. పారిశ్రామికవర్గాల వారు రాణిస్తారు. శ్రమ ఎక్కువగా ఉంటుంది. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మకరం:

పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అనారోగ్య సూచన. ఉద్యోగులకు ఒత్తిళ్ళు పెరుగుతాయి. వ్యాపారులకు నష్ట సూచన. నిరుద్యోగులకు నిరాశాజనకంగా ఉంటుంది. రాజకీయవర్గాల వారికి పరిస్థితులు అంత అనుకూలంగా ఉండవు. వారం మధ్యలో శుభవర్తమానం అందుతుంది. నీలం, నేరేడు రంగులు. శివాష్టకం, శివస్తోత్రాలు పఠించండి.

కుంభం:

పనులు నెమ్మదిగా పూర్తవుతాయి. ఆదాయం బాగుంటుంది. కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వ్యాపారులకు లాభసూచన. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉంటుంది. వారం చివరిలో వివాదాలు తలెత్తుతాయి. అనారోగ్య సూచన. ఇళ్ళు, స్థలాలు కొనుగోలు చేస్తారు. ఆదిత్యహృదయం పఠిస్తే మంచిది.

మీనం:

మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. బాల్యమిత్రులను కలుసుకుంటారు. కొత్తపరిచయాలు కలుగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగుల శ్రమకు గుర్తింపు లభిస్తుంది. వారం మధ్యలో అనారోగ్యసూచన. ఖర్చులు పెరుగుతాయి. విష్ణుసహస్రనామ పారాయణ ఉత్తమం.

Whats_app_banner