Prasanth Varma Next Movie: ప్రశాంత్ వర్మ తర్వాతి చిత్రం ఏదో తెలుసా! ‘జై హనుమాన్’ కంటే ముందే మరో సూపర్ హీరో మూవీ-hanuman director prasanth varma next movie is adhira ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prasanth Varma Next Movie: ప్రశాంత్ వర్మ తర్వాతి చిత్రం ఏదో తెలుసా! ‘జై హనుమాన్’ కంటే ముందే మరో సూపర్ హీరో మూవీ

Prasanth Varma Next Movie: ప్రశాంత్ వర్మ తర్వాతి చిత్రం ఏదో తెలుసా! ‘జై హనుమాన్’ కంటే ముందే మరో సూపర్ హీరో మూవీ

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 12, 2024 06:09 PM IST

HanuMan Prasanth Varma Next Movie: హనుమాన్ చిత్రం తర్వాత ప్రశాంత్ వర్మ.. మరో సూపర్ హీరో మూవీ చేయనున్నారు. ‘జై హనుమాన్’ సినిమా కంటే ముందే అది రానుంది. ఆ వివరాలివే..

Prasanth Varma Next Movie: ప్రశాంత్ వర్మ తర్వాతి చిత్రం ఏదో తెలుసా!
Prasanth Varma Next Movie: ప్రశాంత్ వర్మ తర్వాతి చిత్రం ఏదో తెలుసా!

HanuMan Prasanth Varma Next Movie: హనుమాన్ సినిమాకు దేశవ్యాప్తంగా సూపర్ హిట్ టాక్ వస్తోంది. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు మార్మోగుతోంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో తొలి చిత్రం హను-మాన్ నేడు (జనవరి 12) నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ తెలుగు తొలి సూపర్ హీరో మూవీకి ఫుల్ పాజిటివ్ టాక్ వస్తోంది. దీంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా రేంజ్‍లో ఫేమస్ అయ్యారు. దీంతో PVCUలో ప్రశాంత్ వర్మ తర్వాత చేసే సినిమా ఏది అని ఇంటర్నెట్‍లో చాలా మంది వెతికేస్తున్నారు.

హను-మాన్ చిత్రానికి సీక్వెల్‍గా ‘జై హనుమాన్’ వస్తుందని సినిమా ఆఖర్లో మేకర్స్ ప్రకటించారు. 2025లో ‘జై హనుమాన్’ వస్తుందని ఖరారు చేశారు. అయితే, ఈ చిత్రం కంటే ముందు ప్రశాంత్ వర్మ మరో సూపర్ హీరో మూవీ చేయనున్నారు. ఆ సినిమా పేరు ‘అధీర’ (Adhira). ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ స్ట్రైక్ గ్లింప్స్ కూడా గతేడాదిలోనే వచ్చింది. చాలా ఆసక్తిని కలిగించింది.

అధీర చిత్రంతో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు కల్యాణ్ దాసరి హీరోగా పరిచయం కానున్నారు. ఈ మూవీలో హీరోకు కరెంట్ షాక్ లాంటి అతీత శక్తి ఉంటుందని చూపించారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. బ్లాక్ సూపర్ హీరో డ్రెస్‍లో అధీర లుక్ అదిరిపోయింది. చివర్లో చూపించే వజ్రాయుధం లాంటిది కూడా ఇంట్రెస్ట్ పెంచేసింది.

అధీర చిత్రాన్ని హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డినే.. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. హనుమాన్‍కు బీజీఎం ఇచ్చిన గౌరహరి మ్యూజిక్ డైరెక్టర్ కాగా.. శివేంద్ర దాశరథి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నారు. అధీర చిత్రాన్ని ఈ ఏడాదే రిలీజ్ చేయాలని ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత ‘జై హనుమాన్’ మొదలుపెట్టి 2025లో రిలీజ్ చేసేలా ప్రణాళికలు రచించుకున్నారు. అధీర గురించి త్వరలోనే అప్‍డేట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

కాగా, తన సినిమాటిక్ యూనివర్స్ PVCUలో 12 చిత్రాలు వస్తాయని ప్రశాంత్ వర్మ ఇదివరకే వెల్లడించారు. భారతీయ పురాణాల ఆధారంగా సూపర్ హీరోలను ప్రశాంత్ వర్మ క్రియేట్ చేయనున్నారు. అవేంజర్స్ సిరీస్‍లానే చాలా మంది సూపర్ హీరోలను తీసుకురావాలని ప్రశాంత్ ప్లాన్ చేసుకున్నారు.

భారీ విజయం దిశగా హను-మాన్‍

సంక్రాంతి సీజన్ సందర్భంగా నేడు (జనవరి 12) రిలీజైన హను-మాన్ సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోంది. ఒక రోజు ముందే ప్రీమియర్ షోల నుంచే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీని ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన విధానం, నరేషన్, పీఎఫ్‍ఎక్స్, ఎలివేషన్లు, హనుమంతుడిని చూపించిన విధానం, నటీనటుల పర్ఫార్మెన్స్, బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఇలా అన్ని విషయాల్లో హనుమాన్‍కు మంచి టాక్ వస్తోంది. దీంతో.. హనుమాన్ సినిమా భారీ కలెక్షన్లను సాధించడం పక్కాగా కనిపిస్తోంది. బడ్జెట్ పరంగా చిన్న చిత్రంగా వచ్చిన ఈ మూవీ.. పాన్ ఇండియా రేంజ్‍లో మంచి వసూళ్లను రాబడుతుందని అంచనా.

హనుమాన్ చిత్రంలో తేజ సజ్జా ప్రధాన పాత్ర చేయగా.. అమృత అయ్యర్ హీరోయిన్‍గా నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, గెటప్ శ్రీను తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీని నిరంజన్ రెడ్డి నిర్మించారు.

Whats_app_banner