My Name is Shruthi OTT Streaming: ఓటీటీలో రిలీజైన‌ హ‌న్సిక మై నేమ్ ఈజ్ శృతి - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏదంటే?-hansika my name is shruthi streaming now on amazon prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  My Name Is Shruthi Ott Streaming: ఓటీటీలో రిలీజైన‌ హ‌న్సిక మై నేమ్ ఈజ్ శృతి - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏదంటే?

My Name is Shruthi OTT Streaming: ఓటీటీలో రిలీజైన‌ హ‌న్సిక మై నేమ్ ఈజ్ శృతి - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏదంటే?

My Name is Shruthi OTT Streaming: హ‌న్సిక మై నేమ్ ఈజ్ శృతి మూవీ ఓటీటీలోకి వ‌చ్చేసింది. శుక్ర‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

హ‌న్సిక మై నేమ్ ఈజ్ శృతి మూవీ

My Name is Shruthi OTT Streaming: హ‌న్సిక హీరోయిన్‌గా న‌టించిన మై నేమ్ ఈజ్ శృతి మూవీ ఓటీటీలోకి వ‌చ్చేసింది. శుక్ర‌వారం నుంచి ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈసినిమా రిలీజైంది. మై నేమ్ ఈజ్ శృతి సినిమాకు శ్రీనివాస్ ఓంకార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. న‌వంబ‌ర్ 17న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోయింది.

కాన్సెప్ట్‌, హ‌న్సిక యాక్టింగ్ బాగుంద‌నే పేరొచ్చినా... స్క్రీన్‌ప్లే ఆస‌క్తిక‌రంగా లేక‌పోవ‌డంతో సినిమా ఫెయిల్యూర్‌గా మిగిలింది. దాదాపు మూడేళ్ల విరామం త‌ర్వాత మై నేమ్ ఈజ్ శృతి మూవీతో టాలీవుడ్‌లోకి హ‌న్సిక రీఎంట్రీ ఇచ్చింది. స్కిన్ మాఫియాపై పోరాడే ఓ సాధారాణ యువ‌తిగా హ‌న్సిక ఈ సినిమాలో క‌నిపించింది.

ఈ పోరాటంలో ఆమెకు ఎలాంటి ప‌రిణామాలు ఎదుర‌య్యాన్న‌ది ఈ మూవీ క‌థ‌. మై నేమ్ ఈజ్ శృతి మూవీలో ముర‌ళీశ‌ర్మ‌, న‌రేన్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ప్ర‌స్తుతం తెలుగులో 105 మినిట్స్ అనే సినిమా చేస్తోంది హ‌న్సిక‌. త‌మిళంలో రౌడీ బేబీ, గార్డియ‌న్ అనే సినిమాల్లో న‌టిస్తోంది.