Guppedantha Manasu Serial: మను కోసం మహేంద్ర త్యాగం - రిషి రీఎంట్రీపై సస్పెన్స్ - బాబాయ్‌పై శైలేంద్ర రివేంజ్
Guppedantha Manasu Today Episode: నేటి గుప్పెడంత మనసు సీరియల్ లో మనును రాజీవ్ మర్డర్ కేసులో ఇరికించి అతడిని జైలుకు పంపించింది శైలేంద్రనే అనే అని వసుధార అనుమానపడుతుంది. రాజీవ్ చనిపోలేదని, అతడిని ప్రాణాలతోనే శైలేంద్ర ఎక్కడో దాచి ఉంటాడని అనుకుంటుంది. నేటి గుప్పెడంత మనసు సీరియల్ లో
Guppedantha Manasu Today Episode: చేయని తప్పుకు తన కొడుకు మను జైలుకు వెళ్లడం అనుపమ తట్టుకోలేకపోతుంది. తాను చేసిన పొరపాట్ల వల్ల తన కొడుకు జీవితం కష్టాలమయం అవుతుందని కన్నీళ్లు పెట్టుకుంటుంది. మను అవమానాలు, బాధల పాలు కావడానికి తానే కారణమని బాధపడుతుంది. మను కొడుకుగా తాను అంగీకరించి ఉంటే ఈ కష్టాలు ఉండేవి కావని అనుకుంటుంది. ఆమెను వసుధార, పెద్దమ్మ ఓదార్చుతారు.
నిజం చెప్పిన పెద్దమ్మ...
మనును జైలు నుంచి విడిపించే బాధ్యత తనది అని అనుపమకు మాటిస్తాడు మహేంద్ర. మనుషుల ప్రాణాలు తీసే మనస్తత్వం మనుది కాదని, అతడి గురించి తనకు బాగా తెలుసునని అనుపమతో అంటాడు మహేంద్ర. అక్కడే ఉన్న పెద్దమ్మ....నీది, మనుది రక్త సంబంధం లాంటి బంధమని మహేంద్రతో అంటుంది. ఇన్‌డైరెక్ట్‌గా మను అతడి కొడుకే అనే నిజం మహేంద్రకు చెబుతుంది పెద్దమ్మ. కానీ ఆమె మాటలను మహేంద్ర సరిగ్గా అర్థం చేసుకోలేకపోతాడు. పెద్దమ్మ నిజం ఎక్కడ బయటపెడుతుందోనని వసుధార, అనుపమ కంగారు పడతారు. ఆమె మాటలను అడ్డుకుంటారు.
హంతకుడిగా మను...
కన్నతండ్రిపై ద్వేషం, కోపంతో మను రగిలిపోతుంటాడు. ఈ పరిస్థితుల్లో మహేంద్రనే తన కన్న తండ్రి అనే నిజం తెలిస్తే మను అతడిని చంపి నిజంగానే హంతకుడిగా మారుతాడని అనుపమ భయపడుతుంది. మనుపై తన తండ్రిపై ఉన్న ద్వేషం పోయేవరకు ఈ నిజం కొడుకుకు తెలియకూండా దాచిపెట్టాలని ఫిక్సవుతుంది.
రాజీవ్‌ను దాచిపెట్టిన శైలేంద్ర...
ఎండీ సీట్ దక్కకుండా అడ్డొస్తున్నాడని మనును తెలివిగా రాజీవ్ మర్డర్ కేసులో శైలేంద్రనే ఇరికించి జైలుకు పంపించాడనే మహేంద్ర, వసుధార అనుమానపడతారు. రాజీవ్ చనిపోయి ఉండడని, అతడిని శైలేంద్రనే ఎక్కడో రహస్యంగా దాచిపెట్టి ఉంటాడని అనుకుంటారు. రాజీవ్ బతికే ఉన్నాడని నిరూపించి మనును జైలు నుంచి విడిపించాలని అనుకుంటారు.నిజంగానే వారు ఊహించినట్లుగా రాజీవ్ బతికే ఉన్నాడా? రాజీవ్‌ను శైలేంద్ర ఎక్కడ దాచిపెట్టాడన్నది నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో తేలనుంది.
శైలేంద్ర రివేంజ్...
తనను మహేంద్ర చెంప దెబ్బ కొట్టడంతో శైలేంద్ర సహించలేకపోతాడు. ఈ దెబ్బకు ప్రతీకారం తీర్చుకునే సమయం కోసం ఎదురుచూస్తుంటాడు. మను అడ్డు తొలగిపోవడంతో వసుధార నుంచి ఎండీ సీట్‌ను తన సొంతం చేసుకోవడానికి కొత్త స్కెచ్ వేస్తాడు శైలేంద్ర. కాలేజీలో సమస్యలు సృష్టించి ఎండీ పదవి నుంచి వసుధార తనంతట తానే దిగిపోయేలా చేయాలని అనుకుంటాడు. అతడి ప్లాన్ వర్కవుట్ అయ్యిందా? లేదా? ఎండీ పదవి నుంచి దిగిపోకుండా రిషి ఇన్‌డైరెక్ట్‌గా వసుధారను ఎలా కాపాడాడు అన్నది నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఆసక్తికరంగా ఉండనుంది.
మహేంద్ర త్యాగం…
మను జైలు నుంచి బయటకు వచ్చేందుకు దారులు మూసుకుపోవడంతో మహేంద్ర టెన్షన్ పడతాడు. అనుపమకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం రాజీవ్‌ను చంపిన కేసును తనపై వేసుకొని జైలుకు వెళ్లాలని ఫిక్సవుతాడు. కేసును తనపై వేసుకుంటే మను బయటకు వస్తాడని అంటాడు. మహేంద్ర నిర్ణయం విని అనుపమతో పాటు వసుధార షాకవుతారు. వద్దని వారిస్తారు. తన కోసం మహేంద్ర చేస్తోన్న త్యాగాన్ని చూసి మను ఎలా రియాక్ట్ అయ్యాడన్నది నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో చూడాల్సిందే.