Guppedantha Manasu December 6th Episode: రిషి మిస్సింగ్‌పై వీడని సస్పెన్స్ - వసు టెన్షన్ - అనుపమపై మహేంద్ర ఫైర్
Guppedantha Manasu December 6th Episode: రిషి కనిపించకపోవడంతో వసుధార భయపడుతుంది. అతడి అడ్రెస్ కోసం తెలిసిన స్నేహితులకు ఫోన్ చేస్తుంది. కానీ రిషి తమ దగ్గరకు రాలేదని వారు సమాధానం చెప్పడంతో వసుధార భయం మరింత పెరుగుతుంది. ఆ తర్వాత నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగిందంటే?
Guppedantha Manasu December 6th Episode: శైలేంద్రకు తోడుగా హాస్పిటల్‌తో తాను, మహేంద్ర కలిసి ఉండాలని ఫిక్సయిన ఫణీంద్ర దేవయానికి ఇంటికి వెళ్లిపొమ్మని అంటాడు. తాను ఇంటికి వెళితే శైలేంద్ర నాటకం మొత్తం బయటపడుతుందని దేవయాని కంగారు పడుతుంది. ఇక్కడే ఉండి శైలేంద్ర కండీషన్ బాగా లేదని అందరిని నమ్మించాలని మనసులో అనుకుంటుంది.
తాను ఈ పరిస్థితుల్లో శైలేంద్రను వదిలిపెట్టి వెళ్లలేనని భర్తతో చెబుతుంది. శైలేంద్ర విషయం బయటపడకూడదని జాగ్రత్త పడటానికే దేవయాని హాస్పిటల్‌లో ఉంటానని అంటుందని మహేంద్ర కనిపెడతాడు.
వసుధార కంగారు...
రిషి కనిపించకపోవడంతో వసుధార కంగారు పడుతుంది. అతడి ఫోన్ స్విఛాఫ్ రావడంతో వసుధార భయపడుతుంది. ఏదో పని ఉండి వెళుతున్నానని మెసేజ్ చేశాడు కదా...భయపడాల్సిన అవసరం లేదని వసుధారకు ధైర్యం చెబుతాడు మహేంద్ర. రిషికి ఏం కాదని అంటాడు. జగతి మేడమ్ చావుకు కారణమైన వాళ్లను పట్టుకోవాలని ఎప్పటి నుంచో రిషి ట్రై చేస్తున్నాడు.
ఇన్నాళ్లకు ఒక ఆధారం దొరికింది. అనుమానితుడు దొరికాడు. ఇదే చాలా ఇంపార్టెంట్ పని. దీనికి మించి రిషికి ఇంపార్టెంట్ పని ఏముందని ఆలోచిస్తున్నాను అని మహేంద్రతో అంటుంది వసుధార. ఇన్నాళ్లు మంచివాడు అనుకున్న అన్నయ్యే...తల్లి చావుకు కారణం అన్న ఆలోచన రిషిని సందిగ్ధంలో పడేసింది కావచ్చు.
ఈ సిట్యూవేషన్‌ను ఫేస్ చేయలేక ఎక్కడికైనా వెళ్లింటాడు. గతంలో నాపై, జగతిపై కోపంతో చాలా సార్లు ఇంట్లో నుంచి వెళ్లి పోయి తిరిగివచ్చేవాడని, నీపై కూడా ఇలాగే అలిగి చాలా సార్లు వెళ్లాడని మహేంద్ర గుర్తుచేస్తాడు.
అనుపమ ఎదురుచూపులు...
హాస్పిటల్ నుంచి వసుధార, మహేంద్ర ఇంటికి వచ్చేసరికి వారి కోసం అనుపమ ఇంటి దగ్గర ఎదురుచూస్తుంటుంది. నువ్వేంటి ఇక్కడ. రావద్దొని చెప్పానుగా అంటూ అనుపమతో అంటాడు మహేంద్ర. ఏదైనా పని ఉంటే రావచ్చు. పనిలేనప్పుడు ఎందుకు వచ్చావు అంటూ అనుపమపై సెటైర్స్‌వేస్తాడు.
ఇంటి దాకా వచ్చిన వాళ్లను లోపలిదాకా పిలవకపోతే ఎలా అంటూ అనుపమకు లోపలికి ఆహ్వానిస్తుంది వసుధార. నీ పాజిటివ్ థింకింగ్ చాలా నచ్చింది వసుధార అంటూ అనుపమ ప్రశంసలు కురిపిస్తుంది. చిత్ర విషయంలో నిపై నిందలు వేసినా...నిన్ను పోలీసులకు పట్టించినా అవేవీ మనసులో పెట్టుకోకుండా నాతో పాజిటివ్‌గా ఉంటున్నావని, నీ తెలివితేటలు, ప్రవర్తన బాగున్నాయని వసుధారతో అంటుంది అనుపమ.
ఎండీ సీట్‌కు అర్హురాలివి కాదు...
చాలా విషయాల్లో నువ్వు ఇంప్రెసివ్‌గా కనిపిస్తావు. కానీ ఎండీ సీట్ విషయంలో నువ్వు అర్హురాలివి కాదని అనిపిస్తోందని వసుధారతో అంటుంది అనుపమ. ఆమె మాటలు విని మహేంద్ర సీరియస్ అవుతాడు. ఎదుటివాళ్ల ఫీలింగ్స్‌తో నీకు అవసరం ఉండదా అంటూ కోప్పడుతాడు. ఎప్పుడు ఇలాంటి సంబంధం లేని ప్రశ్నలు అడుగుతావేంటి రుసరుసలాడుతాడు. వసుధార, మహేంద్ర అలసిపోవడంతో వారి కోసం అనుపమ కాఫీ ప్రిపేర్ చేసి తీసుకొస్తుంది.
ధరణి కన్నీళ్లు...
శైలేంద్ర పరిస్థితి చూసి ధరణి కన్నీళ్లు పెట్టుకుంటుంది. నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటే నాకు చాలా బాధగా ఉందని శైలేంద్ర భార్యపై ప్రేమను కురిపిస్తాడు. నా వల్లే ఈ రోజు మీరు ఈ స్థితిలో ఉన్నారు అంటూ ధరణి ఎమోషనల్ అవుతుంది. ఇంతకుముందు మీరు ఎన్నో నేరాలు చేసినా ఏం కాలేదు.
నా కోసం మీరు మంచిగా మారిపోయి నన్ను హ్యాపీగా చూసుకుంటోన్న తరుణంలో ఇలా జరిగిందని బాధపడుతుంది. ధరణి పూర్తిగా తన బుట్టలో పడిపోయిందని శైలేంద్ర అనుకుంటాడు. తనను ఆయుధంగా ఉపయోగించుకొని ఎండీ సీట్ దక్కించుకోవాలని అనుకుంటాడు. రిషి, జగతికి తాను చేసిన పాపం వల్లే ఇలా జరిగిందని కొత్త డ్రామా మొదలుపెడతాడు.
మీపై ఎటాక్ చేసిన ఆ రౌడీలు ఎవరు? మిమ్మల్ని చంపాల్సిన అవసరం వారికి ఏముంది? మీ ఫ్యామిలీలో ఎవరిని వదలం అని వారు ఎందుకు చెప్పారని భర్తను అడుగుతుంది ధరణి. తనకు వాళ్లు ఎవరో తెలియడం లేదని శైలేంద్ర అంటాడు. వాళ్లు కాలేజీకి సంబంధించిన శత్రువులు అయిఉంటారని శైలేంద్ర అనుమానం వ్యక్తం చేస్తాడు. అతడి మాటలతో ధరణిలో డౌట్ మొదలవుతుంది. కాలేజీ సొంతం చేసుకోవాలని చూసింది మీరే కదా.
ఎండీ సీట్ కోసం మీ అంత తాపత్రయ పడ్డవాళ్లు ఎవరూ లేరని శైలేంద్రతో అంటుంది ధరణి. అంతే నన్ను అనుమానిస్తున్నావా? నాకు నేను పొడుచుకున్నానని అంటున్నావా అంటూ ఎమోషనల్‌గా ధరణితో అంటాడు శైలేంద్ర. వాళ్లు ఎవరైన వదిలిపెట్టను. కోలుకున్న తర్వాత పట్టుకొని తీరుతానని భార్యతో చెబుతుంది. . నాపై ఎటాక్ జరిగిన టైమ్‌లో నీకు ఏమవుతుందోనని కంగారు పడ్డానని టాపిక్ డైవర్ట్ చేస్తాడు శైలేంద్ర. తన మాటలతో ధరణిని పూర్తిగా నమ్మిస్తాడు. నిజంగానే భర్త మంచివాడిగా మారిపోయాడని ధరణి అనుకుంటుంది.
రిషి ఆచూకీ కోసం...
రిషి ఆచూకీ కోసం అతడికి తెలిసిన స్నేహితులకు ఫోన్ చేస్తుంది వసుధార. కానీ రిషి తమ దగ్గరకు రాలేదని వారందరూ సమాధానం చెబుతారు. దాంతో వసుధార భయం మరింత పెరుగుతుంది. అనుపమ కాఫీ తీసుకొని మహేంద్ర, వసుధాలరకు ఇస్తుంది. శైలేంద్ర గురించి మహేంద్రను ప్రశ్నలు అడుగుతుంది అనుపమ. ఇప్పుడు నన్నుం ఏం అడగొద్దు...నేను నీకు సమాధానం చెప్పలేను అని సీరియస్‌గా అనుపమతో అంటాడు మహేంద్ర.
నిజం చెప్పిన వసు...
ఉదయం నుంచి రిషి కనిపించడం లేదని వసుధార కన్నీళ్లతో అనుపమకు చెబుతుంది వసుధార. పనిమీద వెళ్తున్నానని మెసేజ్ చేశారు. కానీ ఏ పని మీద వె ళ్తున్నాడో...ఎక్కడికి వెళుతున్నాడో చెప్పలేదని భయపడుతుంది. కారులోనే ఛార్జర్ ఉన్నా అతడి ఫోన్ స్విఛాఫ్ వస్తుందని అంటుంది.
శైలేంద్ర చూడటానికి హాస్పిటల్‌కు అందరం కలిసే బయలుదేరామని కానీ రిషి హాస్పిటల్ లోపలికి రాలేదని, అప్పటి నుంచే కనిపించడం లేదని అంటుంది. రిషి పంపించిన మెసేజ్ గురించి అనుపమకు చెబుతుంది వసుధార. ఆ మెసేజ్ రిషి పంపించకపోయి ఉండొచ్చని అనుపమ అనుమానపడుతుంది.
మహేంద్ర కోపం...
వసుధార కంగారు పడుతుంటే నువ్వేందుకు కూల్‌గా ఉన్నావని మహేంద్రతో అంటుంది అనుపమ. ఆమె మాటలకు ఒక్కసారిగా మహేంద్ర సీరియస్ అవుతాడు. వసుధార బయటకు కనిపిస్తుంది నేను కనిపిచండం లేదు అంతే.
రిషికి ఏమైంది. ఏటు వెళ్లాడోనని ఉదయం నుంచి తాను చాలా ఆలోచిస్తున్నానని చెబుతాడు. ఇలా ఆలోచించడం కంటే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం మంచిదని అనుపమ చెబుతుంది. రిషి ఎక్కడికి వెళ్లాడో వాళ్లే ఇన్వేస్టిగేట్ చేసి చెబుతారని అంటుంది. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.