Gunde Ninda Gudi Gantalu: హాస్పిట‌ల్‌లోకి దొంగ‌చాటుగా వ‌చ్చిన మీనా - బాలు ప‌నిష్‌మెంట్ - ర‌వికి వార్నింగ్‌-gunde ninda gudi gantalu promo balu warns ravi and throws him out of the hospital star maa serial ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gunde Ninda Gudi Gantalu: హాస్పిట‌ల్‌లోకి దొంగ‌చాటుగా వ‌చ్చిన మీనా - బాలు ప‌నిష్‌మెంట్ - ర‌వికి వార్నింగ్‌

Gunde Ninda Gudi Gantalu: హాస్పిట‌ల్‌లోకి దొంగ‌చాటుగా వ‌చ్చిన మీనా - బాలు ప‌నిష్‌మెంట్ - ర‌వికి వార్నింగ్‌

Nelki Naresh Kumar HT Telugu
Nov 02, 2024 07:29 AM IST

Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంట‌లు లేటెస్ట్ ప్రోమోలో బాలుకు క‌నిపించ‌కుండా హాస్పిట‌ల్‌లోనే దాక్కుంటుంది మీనా. ఐసీయూలో ఎవ‌రూ లేని టైమ్ చూసి స‌త్యానికి తాయ‌త్తు క‌ట్టేందుకు లోప‌లికి వెళుతుంది. మీనా ఐసీయూలో ఉండ‌గానే ఆ రూమ్‌లోకి ప్ర‌భావ‌తి, రోహిణి ఎంట‌ర్ అవుతారు.

గుండె నిండా గుడిగంట‌లు
గుండె నిండా గుడిగంట‌లు

Gunde Ninda Gudi Gantalu: తండ్రికి హార్ట్ ఎటాక్ అని తెలియ‌డంతో కంగారుగా ర‌వి హాస్పిట‌ల్‌కు వ‌స్తాడు. స‌త్యాన్ని చూడ‌టానికి ఐసీయూలోకి వెళ్ల‌బోతుండ‌గా అత‌డిని మ‌నోజ్‌, ప్ర‌భావ‌తి ఆపేస్తారు. ర‌వి ముఖం చూడ‌టానికి ప్ర‌భావ‌తి ఇష్ట‌ప‌డ‌దు. నీ వ‌ల్లే ఎవ‌రికి అప‌కారం చేయ‌ని మీ నాన్న‌కు ఇన్ని క‌ష్టాలు వ‌చ్చాయ‌ని ర‌విని నానా మాట‌లు అంటుంది ప్ర‌భావ‌తి.

ఎవ‌రు చెప్పారు నీకు...

స‌త్యం మాకు మాత్ర‌మే నాన్న అని, నీకు మాకు ఏ సంబంధం లేద‌ని ర‌వితో బాలు అంటాడు. నీ వ‌ల్లే ప‌రువు మ‌ర్యాద అన్ని పొగొట్లుకొని చావుబ‌తుకుల మ‌ధ్య‌నాన్న ఉన్నాడ‌ని ర‌విని కొట్ట‌డానికి వ‌స్తాడు. నాన్న హాస్పిట‌ల్‌లో ఉన్నాడ‌ని నీకు ఎవ‌రు చెప్పార‌ని ర‌విని నిల‌దీస్తాడు బాలు. కానీ మౌనిక పేరు చెప్ప‌కుండా ర‌వి దాచేస్తాడు.

అన్న‌య్య‌కు ఎదురుతిరిగిన ర‌వి...

బాలు హెచ్చ‌రించిన విన‌కుండా ర‌వి ఐసీయూలోకి వెళ్ల‌బోతాడు. అత‌డిని బాలు నెట్టేస్తాడు. నువ్వు న‌న్ను ఎన్నో సార్లు కొట్టావు. నేను ప‌డ్డాను. ఏనాడు ఎదురు జ‌వాబు చెప్ప‌లేదు. నాన్న‌కు సీరియ‌ల్‌గా ఉంటే న‌న్ను ఎందుకు ఆపుతున్నావు. నేను కూడా మీలాగే ఆయ‌న‌కు కొడుకునే క‌దా అని బాలుకు ఎదురుచెబుతాడు ర‌వి.

మాట‌ల‌తో చెబితే ర‌వి విన‌డ‌ని అర్థం చేసుకున్న బాలు అత‌డిని కొట్ట‌డానికి చెయ్యేత్తుతాడు బాలును మ‌నోజ్ ఆపేస్తాడు. గొడ‌వ చేయ‌కుండా ఇక్క‌డి నుంచి వెళ్లిపొమ్మ‌ని రోహిణి, రంగా మావ‌య్య ర‌వి పంపించేస్తారు. మాతో సంబంధం లేద‌ని నీ దారి నువ్వు చూసుకున్నావు క‌దా అక్క‌డికే వెళ్ల‌మ‌ని ర‌వితో అంటుంది ప్ర‌భావ‌తి. స‌త్యం ట్రీట్‌మెంట్ కోసం తాను డ‌బ్బులు ఇస్తాన‌ని అన్న ప్ర‌భావ‌తి వ‌ద్ద‌ని అంటుంది.

హాస్పిట‌ల్‌లోనే మీనా...

ర‌వి, బాలు గొడ‌వ‌ను హాస్పిట‌ల్‌లో ఉన్న‌ మీనా చూస్తుంది. బాలుతో పాటు అత‌డి కుటుంబ‌స‌భ్యుల‌కు క‌నబ‌డ‌కుండా హాస్పిట‌ల్‌లో దాక్కుంటుంది . మీనాను జీవితంలో క్ష‌మించ‌న‌ని బాలు కోపంగా అంటాడు. ర‌వితో పాటు మీనాను మ‌ళ్లీ ఇంట్లోకి రానిచ్చేది లేద‌ని చెబుతాడు. భ‌ర్త‌కు త‌న‌పై ఉన్న కోపాన్ని చూసి మీనా ఎమోష‌న‌ల్ అవుతుంది.

ఐసీయూలోకి మీనా...

జ్యోతిష్యురాలు ఇచ్చిన కంక‌ణాన్ని స‌త్యానికి క‌ట్టే టైమ్ కోసం మీనా ఎదురుచూస్తుంటుంది. డాక్ట‌ర్ పిల‌వ‌డంతో బాలు, ప్ర‌భావ‌తి తో పాటు మిగిలిన కుటుంబ‌స‌భ్యులు అత‌డి రూమ్‌కు వెళ‌తారు. రంగా మావ‌య్య ఒక్క‌డే స‌త్యం ద‌గ్గ‌ర ఉండ‌టంతో ఇదే మంచి టైమ్‌గా భావించిన మీనా ఐసీయూ ద‌గ్గ‌ర‌కు వ‌స్తుంది. .

పూజ చేసి తాయ‌త్తు తెచ్చాన‌ని క‌ట్టేసి వెళ్లిపోతాన‌ని రంగా మావ‌య్య‌తో మీనా అంటుంది. ఈలోపు బాలు వ‌స్తే మ‌ళ్లీ పెద్ద గొడ‌వ అవుతుంద‌ని రంగా మావ‌య్య భ‌య‌ప‌డిపోతాడు. రంగా మాట విన‌కుండా రెండు నిమిషాల్లోనే బ‌య‌ట‌కు వ‌స్తాన‌ని మీనా ఐసీయూ లోప‌లికి వెళుతుంది.

దొరికిపోయిన మీనా...

ఐసీయూలో బెడ్‌పై ఉన్న స‌త్యాన్ని చూసి మీనా ఎమోష‌న‌ల్ అవుతుంది. స‌త్యం చేతికి కంక‌ణం క‌ట్ట‌బోతుండ‌గా అప్పుడే ప్ర‌భావ‌తి, రోహిణి ఐసీయూలోప‌లికి వెళ్ల‌బోతారు. వారిని చూసి రంగా కంగారు ప‌డ‌తాడు. ప్ర‌భావ‌తి, రోహిణిల‌కు మీనా క‌నిపించిందా?

త‌న ప‌ర్మిష‌న్ లేకుండా తండ్రి రూమ్‌లోకి ఎంట‌రైన మీనాకు బాలు ఏ ప‌నిష్‌మెంట్ విధించాడు? తండ్రిని బాలు కాపాడుకున్నాడా? లేదా? తండ్రిని చూసే అవ‌కాశం త‌న‌కు ద‌క్క‌క‌పోవ‌డంతో ఎమోష‌న‌ల్ అయినా ర‌విని శృతి ఎలా ఓదార్చింది అన్న‌ది సోమ‌వారం గుండె నిండా గుడిగంట‌లు సీరియ‌ల్ ఎపిసోడ్‌లో చూడాల్సిందే.

Whats_app_banner