Gunde Ninda Gudi Gantalu: మీనా ప్లాన్ వర్కవుట్ - భయంతో వణికిపోయిన బాలు - సత్యానికి గుండెపోటు
Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడి గంటలు అక్టోబర్ 25 ఎపిసోడ్లో తాను చేసిన అవమానం కారణంగా ఆవేశంలో మీనా ఏదైనా కఠిన నిర్ణయం తీసుకుంటుందేమోనని బాలు కంగారుపడతాడు. తన స్నేహితుడితో మీనాకు ఫోన్చేయిస్తాడు. ఏం మాట్లాడకుండా మీనా ఫోన్ కట్‌చేస్తుంది. దాంతో నేరుగా మీనా ఇంటికి వెళతాడు బాలు.
Gunde Ninda Gudi Gantalu: భర్త బాలుకు తన ఆవేదన, బాధ చెప్పుకోవాలని అనుకుంటుంది మీనా. కానీ భార్య మాటలను నమ్మడు బాలు. మీనా ముఖం కూడా చూడటానికి ఇష్టపడడు. చచ్చే వరకు నిన్ను క్షమించనని మాటలతో మీనా మనసు ముక్కలు చేస్తాడు. జీవితంలో మళ్లీ మీకు కనిపించనని బాలుతో చెప్పి కన్నీళ్లతో మీనా వెనుదిరుగుతుంది. రవి రెస్టారెంట్‌కు వచ్చాడని తెలుసుకున్న బాలు అక్కడికి వెళ్లి అతడిని రక్తం వచ్చేలా కొడతాడు.
బార్లో బాలు...
స్నేహితుడితో కలిసి బార్లో మందు తాగుతుంటాడు బాలు. పక్క టేబుల్లో కూర్చున్న వ్యక్తి... తన భార్య జీవితంలో మళ్లీ కనిపించనని చెప్పి ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయిందని అంటాడు. అతడి మాటలు విని బాలు కంగారు పడతాడు. మీనా కూడా ఆవేశంలో అలాంటి నిర్ణయమే ఎక్కడ తీసుకుంటుందోనని భయపడిపోతాడు. తాను దూరమైన తర్వాత మీరు జీవితాంతం ఏడుస్తూనే ఉంటారని మీనా అన్న మాటల్ని గుర్తుచేసుకుంటాడు.
రవి ఎమోషనల్...
తన ప్రేమ పెళ్లి కారణంగా తండ్రి సత్యంతో పాటు తన కుటుంబానికి ఎదురైన అవమానాలు, పడిన బాధలు గుర్తుచేసుకుంటూ రవి ఎమోషనల్ అవుతాడు. ఈ రోజు నుంచి నువ్వు ఎవరో...మేము ఎవరో అంటూ బాలు అన్న మాటలు అతడి మనసును మరింత బాధపెడతాయి.
అప్పుడే డబ్బింగ్ స్టూడియో నుంచి ఇంటికొస్తుంది శృతి. వచ్చిరావడంతోనే రవిపై మాటలతో విరుచుకుపడుతుంది. తాను అలిగి స్టూడియోకు వెళ్లిపోయిన ఒక్క ఫోన్, మెసేజ్ కూడా చేయలేదు ఎందుకని రవిని నిలదీస్తుంది. కోపం తగ్గిన తర్వాత అయినా డబ్బింగ్ స్టూడియోకు వస్తావని నీ కోసం ఎదురుచూశానని అంటుంది. పెళ్లయితే ప్రేమ ఉండదని కోపంగా అంటుంది.
నిజం తెలుసుకున్న శృతి...
సడెన్‌గా రవి ముఖంపై కనిపించిన దెబ్బలు చూసి శృతి కంగారు పడుతుంది. ఏం జరిగింది, ఈ దెబ్బలు ఎలా తగిలాయని శృతి అడిగితే బాత్రూమ్లో జారి పడ్డానని రవి అబద్ధం ఆడుతాడు. రవి కిచెన్లోకివెళ్లిన టైమ్‌లో రెస్టారెంట్లో పనిచేసిన వ్యక్తి అతడికి కాల్చేస్తాడు. ఫోన్ శృతి లిఫ్ట్ చేస్తుంది. అతడి ద్వారా రవిని బాలు కొట్టిన సంగతి తెలుసుకుంటుంది శృతి.
శృతి కన్నీళ్లు...
తన ప్రేమ కోసం రవి అన్నయ్య చేతిలో తన్నులు తిన్నాడని తెలిసి శృతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. మీ అన్నయ్య నిన్ను కొట్టిన విషయం నాకు ఎందుకు చెప్పలేదని రవిని అడుగుతుంది. నిన్ను ఇష్టం వచ్చినట్లు కొట్టే హక్కు బాలుకు లేదని అంటుంది. ఇంకోసారి ఇలాచేస్తే తాను చూస్తూ ఊరుకోనని అంటుంది.
బాలును నిలదీస్తానని ఆవేశంగా అంటుంది శృతి. అన్నయ్య కోపంలోనూ న్యాయం ఉందని, మనల్ని ఒక్కటి చేసి బాలు, మీనా విడిపోయారని శృతికి సర్ధిచెబుతాడు రవి. ఉదయం జరిగిన గొడవను మర్చిపోయి రవి, శృతి ఒకరికొకరు ప్రేమగా అన్నం తినిపించుకుంటారు.
బాలు కలవరింతలు...
బార్ నుంచి ఇంటికెళుతున్న టైమ్‌లో నిద్రపోయిన బాలు..మీనా అంటూ కలవరిస్తాడు.మీనా ఎక్కడుందో, క్షేమంగా ఉందో లేదో తెలుసుకోవాలని అనుకుంటాడు. తాను ఫోన్ చేస్తే మీనా లిఫ్ట్ చేయదని భావిస్తాడు. తన స్నేహితుడు రాజేష్‌ను మీనాకు ఫోన్ చేయమని అంటాడు. ఇందాక బార్లో మాట్లాడిన వ్యక్తి మాటల్ని వింటుంటే ఏదో తేడా కొడుకుతుందని బాలు తన స్నేహితుడితో అంటాడు.
బాలు టార్చర్ భరించలేక మీనాకు ఫోన్ చేస్తాడు రాజేష్. తాగిన మత్తులో ఏదేదో మాట్లాడుతాడు. అతడి చెంపపై గట్టిగా ఒక్కటి కొడతాడు బాలు. చివరకు రాజేష్ ట్రైనింగ్‌తో...బాలు ఉన్నాడా అని మీనాను అడుగుతాడు. బాలు చేత రాజేష్ ఫోన్ చేయిస్తున్నాడని మీనా తెలుసుకొని ఏం సమాధానం ఇవ్వకుండా ఫోన్ కట్ చేస్తుంది.
రాజేష్ భయం...
మీనా ఏదైనా చేసుకుంటే లాస్ట్ కాల్ తన నుంచే వెళ్లిందికాబట్టి తనను పోలీసులు అరెస్ట్ చేస్తారని రాజేష్ భయపడతాడు. అతడి మాటలతో టెన్షన్ మరింత పెరుగుతుంది. జీవితంలో మళ్లీ కనిపించనని తాను చెప్పిన డైలాగ్ వర్కవుట్ అవుతుందని మీనా అనుకుంటుంది.
మీనా ఇంటికి వెళ్లిన బాలు...
నేరుగా మీనా ఇంటికి వెళతాడు బాలు. మీనా ఇంట్లోనే ఉంటుందని, కావాలనే మనల్ని భయపెట్టడానికి ఈ డ్రామా ఆడుతుందని తనకు డౌట్‌గా ఉందని బాలు అంటాడు.
నీ భర్త కనిపించడం లేదని వెళ్లి మీనాతో చెబితే...గడగడవణికిపోయి తనకు ఫోన్చేస్తుందని రాజేష్‌కు తన ప్లాన్ చెబుతాడు బాలు. అప్పుడు మీనాతో తాను కూడా ఏం మాట్లాడకుండా రివేంజ్ తీర్చుకుంటానని అంటాడు.
మనోజ్...బాలు గొడవ...
బాలు ఇంటికి తాగి రావడంలో సత్యం అతడిని నిలదీస్తాడు. రవిని పిచ్చిపిచ్చిగా కొట్టానని ఇంట్లోవాళ్లతో చెబుతాడు బాలు. రవి వల్ల వీధిలో తలెత్తుకొని తిరగలేకపోతున్నానని మనోజ్ అంటాడు.
నువ్వు కూడా ఓ అమ్మాయితో లేచిపోవడానికి ఇంట్లో నుంచి నలభై లక్షలు ఎత్తుకెళ్లావు కదా అని మనోజ్‌పై సెటైర్లువేస్తాడు బాలు. బాలును నెట్టివేస్తాడు మనోజ్. కోపంతో మనోజ్‌ను కొట్టబోతాడు. కానీ ఆ దెబ్బ రోహిణికి తగులుతుంది. ఈ గొడవలు చూసి గుండెనొప్పితో సత్యం కుప్పకూలిపోతాడు. అక్కడితో నేటి గుండెనిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.