Ramabanam OTT Release Date: ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న గోపీచంద్ రామ‌బాణం - స్ట్రీమింగ్ ఎప్పుడంటే-gopichand ramabanam ott release date fixed ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Gopichand Ramabanam Ott Release Date Fixed

Ramabanam OTT Release Date: ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న గోపీచంద్ రామ‌బాణం - స్ట్రీమింగ్ ఎప్పుడంటే

గోపీచంద్ రామ‌బాణం
గోపీచంద్ రామ‌బాణం

Ramabanam OTT Release Date: గోపీచంద్ రామ‌బాణం మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా ఏ ఓటీటీలో ఏ రోజు నుంచి స్ట్రీమింగ్ కానుందంటే....

Ramabanam OTT Release Date: గోపీచంద్ హీరోగా శ్రీవాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన రామ‌బాణం మూవీ థియేటర్లలో రిలీజై నెల రోజులు కూడా పూర్తికాకముందే ఓటీటీలోకి రాబోతోంది. జూన్ 3 నుంచి సోనిలివ్ ఓటీటీలో రామబాణం మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు తెలిసింది.

ట్రెండింగ్ వార్తలు

థియేట్రిక‌ల్ రిలీజ్‌కు ముందే దాదాపు ఎనిమిది కోట్ల‌కు రామబాణం డిజిట‌ల్ రైట్స్‌ను సోనిలివ్ ద‌క్కించుకోన్న‌ట్లు స‌మాచారం. గోపీచంద్‌, శ్రీవాస్ కాంబినేష‌న్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని భారీ మొత్తానికి ఈ సినిమా ఓటీటీ హ‌క్కుల‌ను సోనిలివ్‌ కొనుగోలు చేసిన‌ట్లు తెలిసింది.

యాక్ష‌న్ ఫ్యామిలీ డ్రామా క‌థాంశంతో రూపొందిన రామ‌బాణం మే 5న థియేట‌ర్ల‌లో రిలీజైంది. ల‌క్ష్యం, లౌక్యం హిట్స్ త‌ర్వాత గోపీచంద్‌, శ్రీవాస్ క‌లయికలో రూపొందిన ఈ మూవీ ఇద్ద‌రికీ హ్యాట్రిక్ విజ‌యాన్ని అందివ్వ‌లేక‌పోయింది.

దాదాపు 25 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ థియేట్రిక‌ల్ ర‌న్‌లో కేవ‌లం ప‌ది కోట్ల వ‌ర‌కు మాత్ర‌మే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి నిర్మాత‌ల‌కు న‌ష్టాల‌ను మిగిల్చింది. క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం రామ‌బాణం డిజాస్ట‌ర్‌కు ప్ర‌ధాన కార‌ణంగా నిలిచింది. ఇందులో విక్కీ భాయ్ అనే మాఫియా డాన్‌గా మాస్ పాత్ర‌లో గోపీచంద్ న‌టించాడు.

త‌న కుటుంబానికి ఎదురైన ఆప‌ద‌ను విక్కీ భాయ్ ఎలా ప‌రిష్క‌రించాడ‌న్న‌ది యాక్ష‌న్‌, ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో పాటు ఎంట‌ర్‌టైన్‌మెంట్ మిక్స్ చేస్తూ ద‌ర్శ‌కుడు శ్రీవాస్ ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఇందులో గోపీచంద్‌కు జోడీగా డింపుల్ హ‌య‌తి హీరోయిన్‌గా న‌టించింది. జ‌గ‌ప‌తిబాబు, ఖుష్భూ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.