Gopichand on Ramabanam: అందరికీ నచ్చే ఫ్యామిలీ ఎంటర్టైనర్ రామబాణం.. గోపీచంద్ సరికొత్త అవతారం
Gopichand on Ramabanam: రామబాణం చిత్రం అందరికీ నచ్చుతుందని మ్యాచో స్టార్ గోపీచంద్ స్పష్టం చేశారు. మే 5న సినిమా విడుదల కానున్న తరుణంలో సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న ఆయన.. సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
Gopichand on Ramabanam: మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన సరికొత్త చిత్రం రామబాణం. తనతో లక్ష్యం, లౌక్యం లాంటి సూపర్ డూపర్ హిట్లు తీసిన శ్రీవాస్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. వీరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ చిత్రంగా ఇది రాబోతుంది. డింపుల్ హయాతీ కథానాయికగా నటించిన ఈ సినిమా మే 5న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్ ప్రేక్షకుల్లో భారీగా అంచనాలను పెంచేశాయి. విడుదల దగ్గర పడుతుండటంతో చిత్ర ప్రమోషన్లలో బిజీగా అవుతోంది చిత్రబృందం. ఇందులో భాగంగా బుధవారం నాడుప్రెస్ మీట్ నిర్వహించింది.
ఈ సందర్భంగా హీరో గోపీచంద్ మాట్లాడుతూ.. "శ్రీవాస్‌తో 'లక్ష్యం', 'లౌక్యం' చేశాను. మూడో సినిమా చేద్దామని అనుకున్నప్పుడు గత చిత్రాల మాదిరిగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేయాలని అనుకున్నాం. అప్పుడు భూపతి రాజా గారి దగ్గర ఉన్న కథ విన్నప్పుడు చాలా నచ్చింది. ఇందులో డింపుల్ చాలా చక్కగా నటించింది. తనకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మిక్కీ జే మేయర్ తో చేయడం ఇదే మొదటిసారి. చాలా అద్భుతమైన పాటలు ఇచ్చారు. ఇప్పటికే పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మే 5న మూవీని థియేటర్‌కు వెళ్లి చూడండి. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా" అని అన్నారు.
అనంతరం దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ.. "గోపీచంద్‌తో నేను సినిమా చేస్తున్నానని తెలిసినప్పటి నుంచి హ్యాట్రిక్ కాంబో అనే పాజిటివ్ వైబ్ వచ్చింద. అది మాలో పాజిటివ్ ఎనర్జీని ఇచ్చింది. రామబాణం అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చింది. పాటలతో మిక్కీ జే మేయర్ ఆల్రెడీ విజయం సాధించారు. ఇందులో జగపతి బాబు పాత్ర కూడా ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. డింపుల్ పాత్ర కీలకం. ఈ సినిమాకు పనిచేసినా పేరు పేరున కృతజ్ఞతలు చెబుతున్నా." అని అన్నారు.
రామబాణం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మించారు. వివేక్ కూచిబొట్ల సహా నిర్మాతగా వ్యవహరించారు. గోపీచంద్ సరసన డింపుల్ హయతి కథానాయికగా నటించింది. శ్రీవాస్ తెరకెక్కించిన ఈ మూవీ మే 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
టాపిక్