Rama Banam Trailer: ఈ కాలంలో చెయ్యెత్తినోడికే మర్యాద.. రామబాణం ట్రైలర్ చూశారా?-rama banam trailer released with full of action ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rama Banam Trailer: ఈ కాలంలో చెయ్యెత్తినోడికే మర్యాద.. రామబాణం ట్రైలర్ చూశారా?

Rama Banam Trailer: ఈ కాలంలో చెయ్యెత్తినోడికే మర్యాద.. రామబాణం ట్రైలర్ చూశారా?

Hari Prasad S HT Telugu
Apr 20, 2023 09:31 PM IST

Rama Banam Trailer: ఈ కాలంలో చెయ్యెత్తినోడికే మర్యాద అంటూ రామబాణం ట్రైలర్ వచ్చేసింది. గోపీచంద్, డింపుల్ హయాతీ నటించిన ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

రామబాణం మూవీలో గోపీచంద్
రామబాణం మూవీలో గోపీచంద్

Rama Banam Trailer: మ్యాచో స్టార్ గోపీచంద్ నటించిన మూవీ రామ బాణం. ఈ మూవీ ట్రైలర్ గురువారం (ఏప్రిల్ 20) రిలీజైంది. శ్రీవాస్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా మే 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. గోపీచంద్ అభిమానులకు కావాల్సి ఫుల్ ప్యాకేజీతో రామ బాణం ట్రైలర్ ను తీసుకొచ్చారు. పవర్ ఫుల్ డైలాగులు, యాక్షన్ సీన్స్, ఫ్యామిలీ డ్రామాతో ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాలో గోపీచంద్ సరసన డింపుల్ హయాతీ నటిస్తోంది. ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లా కనిపిస్తున్న ఈ రామ బాణం మూవీ ట్రైలర్ ను రాజమండ్రిలో రిలీజ్ చేశారు. ఈ క్షణం ఈ ప్రయాణం నేను ఊహించింది కాదు.. నేను ప్లాన్ చేసిందీ కాదు అనే గోపీచంద్ డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది.

ఆ తర్వాత హీరోయిన్ ను ఓ యూట్యూబర్ గా ఇంట్రడ్యూస్ చేశారు. లీడ్ రోల్స్ మధ్య కొన్ని రొమాన్స్ కూడా ట్రైలర్లో చూపించారు. అక్కడి నుంచి కథను మెల్లగా మెయిన్ సబ్జెక్ట్ లోకి తీసుకెళ్లారు. స్వచ్ఛమైన ఆహారం, మంచి బంధాలే మనిషిని కాపాడతాయంటూ సీన్లోకి జగపతి బాబు ఎంటరవుతాడు. రసాయనాలు లేని పంటల కోసం అతడు పోరాడుతూ ఉంటాడు.

అదే సమయంలో కథలోకి విలన్ ఎంటరవుతాడు. అక్కడి నుంచీ ట్రైలర్ లో యాక్షన్ సీన్స్ మొదలవుతాయి. ఎప్పటిలాగే ఇలాంటి సీన్లలో మ్యాచో స్టార్ గోపీచంద్ మెప్పించాడు. ఒకప్పుడు తల దించుకునేవాడికి మర్యాద.. ఇప్పుడు చెయ్యెత్తినోడికే మర్యాద అనే ఓ పవర్ ఫుల్ డైలాగ్ కూడా చెబుతాడు. అన్ని కమర్షియల్ హంగులూ ఈ రామ బాణం ట్రైలర్లో ఉన్నాయి.

ఈ సినిమాపై గోపీచంద్ భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఖుష్బూ, నాజర్, అలీ, వెన్నెల కిశోర్, సప్తగిరిలాంటి వాళ్లు ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఇక రామబాణం సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు.

Whats_app_banner