Godfather First Review: గాడ్‌ఫాదర్‌ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. మెగాస్టార్‌ హిట్‌ కొడతాడా?-godfather first review labels it as a pretty average movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Godfather First Review: గాడ్‌ఫాదర్‌ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. మెగాస్టార్‌ హిట్‌ కొడతాడా?

Godfather First Review: గాడ్‌ఫాదర్‌ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. మెగాస్టార్‌ హిట్‌ కొడతాడా?

HT Telugu Desk HT Telugu
Oct 04, 2022 12:23 PM IST

Godfather First Review: గాడ్‌ఫాదర్‌ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఈ సినిమా దసరా సందర్భంగా బుధవారం (అక్టోబర్‌ 5) రిలీజ్‌ కానుండగా.. మెగాస్టార్‌ భారీ ఆశలే పెట్టుకున్నాడు.

<p>గాడ్ ఫాదర్ మూవీలో చిరంజీవి పవర్ ఫుల్ లుక్</p>
గాడ్ ఫాదర్ మూవీలో చిరంజీవి పవర్ ఫుల్ లుక్

Godfather First Review: ఆచార్యలాంటి ఓ డిజాస్టర్‌ తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి నటించిన మూవీ గాడ్‌ఫాదర్‌. మలయాళ సినిమా లూసిఫర్‌ రీమేక్‌గా ఈ మూవీ వస్తోంది. అయితే ఆచార్య ఎఫెక్టో మరేంటోగానీ ఈ సినిమాకు ఊహించినంత బజ్‌ అయితే లేదు. మెగాస్టార్‌ మూవీ అయినా కూడా ఆ రేంజ్‌ హడావిడి కనిపించడం లేదు.

ఇక ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్‌ రివ్యూ కూడా వచ్చేసింది. ఏ పెద్ద సినిమా రిలీజైనా తన ఫస్ట్‌ రివ్యూ ఇచ్చే ఓవర్సీస్‌ సెన్సార్‌ బోర్డు సభ్యుడు, ఫిల్మ్‌ క్రిటిక్‌ ఉమేర్‌ సంధు.. గాడ్‌ఫాదర్‌పై కూడా తన రివ్యూ చెప్పేశాడు. తన ట్విటర్‌ ద్వారా రెండే రెండు వరుసల్లో సినిమా గురించి వివరించాడు. అయితే చాలా వరకూ అతని నుంచి పాజిటివ్‌ రివ్యూలే వస్తుండగా.. తొలిసారి గాడ్‌ఫాదర్‌పై మాత్రం ఉమేర్‌ పెదవి విరిచాడు.

కొత్త సీసాలో పాత సారా అంటూ ఒక్క ముక్కలో సినిమా బాలేదని చెప్పాడు. "కేవలం బీ&సీ క్లాస్‌ మాసెస్‌ కోసమే తీసిన ఓ సాదాసీదా సినిమా. కొత్త సీసాలో పాత సారా. చిరంజీవి మీకు రెస్ట్‌ కావాలి" అంటూ ఈ సినిమాకు 2.5 రేటింగ్‌ ఇచ్చాడు ఉమేర్‌ సంధు. అయితే సినిమా గురించి అతడు చేసిన కామెంట్స్‌ ఎలా ఉన్నా.. చిరుపై ఇలాంటి కామెంట్ చేయడం కొందరు అభిమానులకు నచ్చలేదు.

ఓ అభిమాని అయితే నేరుగానే ఉమేర్‌ సంధుకు కౌంటర్‌ ఇచ్చాడు. సినిమాపై తీర్పు చెప్పే హక్కు నీకుంది కానీ.. ఇలా చిరంజీవి రెస్ట్‌ తీసుకోవాలా, సినిమా తీయాలా అని చెప్పే హక్కు నీకు లేదు అని ఆ ట్వీట్‌కు రిప్లై ఇచ్చాడు. సెన్సార్‌ బోర్డు సభ్యుడు సినిమా రివ్యూ ఇవ్వడమేంటి అని మరో అభిమాని ప్రశ్నించాడు.

మలయాళ సినిమా లూసిఫర్‌కు రీమేక్‌ అయిన గాడ్‌ఫాదర్‌లో చిరంజీవితోపాటు బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ కూడా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్‌, పూరి జగన్నాథ్‌ కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్‌ అయితే పవర్‌ఫుల్‌గా ఉంది. సాల్ట్‌ పెప్పర్‌ లుక్‌లో చిరంజీవి డాషింగ్‌గా కనిపిస్తున్నాడు.

Whats_app_banner