Rakhi Sawant Wedding : పెళ్లి కోసం ఫాతిమాగా రాఖీ సావంత్ పేరు మార్చుకుందా?
Rakhi Sawant Marriage : రాఖీ సావంత్ తన మెుదటి భర్తతో విడిపోయింది. అతడి పేరు రితేష్. ఆ తర్వాత ఆదిల్ దురానీ అనే బిజినెస్ మ్యాన్ తో ప్రేమలో పడింది. అయితే ఇప్పుడు ఆమె పెళ్లికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఆమె పేరు మార్చుకుందాని ప్రచారం జరుగుతోంది.
రాఖీ సావంత్(Rakhi Sawant) పేరు చెప్పగానే కొన్ని వివాదాలు గుర్తొస్తాయి. మరోవైపు ఆమె గ్లామర్ రోల్స్, హాట్ ఎక్స్ పోజింగ్ కూడా జనాల్లో ముద్రపడిపోయింది. అప్పుడప్పుడు ఆమె చేసే కామెంట్స్ కూడా వివాదం అవుతాయి. తాజాగా ఆమె పెళ్లికి సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. కిందటి ఏడాది.. రాఖీ తన మొదటి భర్త నుంచి విడిపోయింది. హింసిస్తున్నాడని విడాకులు తీసుకుంది. ఆదిల్ దురాని(Adil Durrani) అనే బిజినెస్ మ్యాన్ తో ప్రేమలో పడింది. వీరికి గతంలో ఎంగేజ్మెంట్ జరిగినట్లు వార్తలు వచ్చాయి.
ఇప్పుడు తాజాగా రాఖీ సావంత్, ఆదిల్ దురాని వివాహానికి సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి. 2022లోనే వీరి వివాహం జరిగినట్టుగా ప్రచారం జరుగుతోంది. వైరల్ అవుతున్న ఫొటోలు చూస్తే.. ఆదిల్, రాఖీ పూలదండలతో కనిపిస్తున్నారు. తమ మ్యారేజ్ సర్టిఫికెట్(Marriage Certificate)ను సైతం చూపిస్తున్నారు. ఆదిల్, రాఖీల వివాహ ధృవీకరణ పత్రం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. అందులో వరుడిని ఆదిల్ దురానీగా, వధువు రాఖీ సావంత్ ఫాతిమాగా పేర్కొన్నట్టుగా ఉంది. వారి బొటనవేలు ముద్రలు, సంతకాలతో పాటు ఇద్దరి చిత్రాలు కూడా ఉన్నాయి.
రాఖీ ఇస్లాం మతంలోకి మారిందని లేదా ఆదిల్‌తో వివాహం కోసం తన పేరును ఫాతిమాగా మార్చుకుందని ఇప్పుడు చర్చించుకుంటున్నారు. దీనిపై రాఖీ సోదరుడు రాకేష్ స్పందించాడు. అలాంటిదేమీ తనకు తెలియదని చెప్పాడు. 'నాకు దాని గురించి తెలియదు. ఇది భార్యాభర్తల మధ్య వ్యక్తిగత విషయం. కానీ రాఖీ(Rakhi) అలా చేసి ఉంటే ఆమెనే తెలుసుకోవాలి. సరైనదే అని భావించి అడుగు వేసి ఉండొచ్చు.' అని చెప్పాడు.
తాము పెళ్లి చేసుకున్న విషయాన్ని ఆదిల్ మొదట ఖండించినప్పటికీ, రాఖీ దానిని ధృవీకరించింది. 'అవును, నేను, ఆదిల్ వివాహం చేసుకున్నాం. మేము నిఖా వేడుక, కోర్టు వివాహం చేసుకున్నాం. ఆ విషయాన్ని బహిర్గతం చేయకుండా ఉన్నాం.' అని రాఖీ చెప్పింది. అయితే స్వయంగా తన పెళ్లికి సంబంధించిన కొన్ని చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుందీ నటి. నేను చాలా సంతోషిస్తున్నాని, నా ప్రేమ ఆదిల్‌పై ఎప్పుడూ ఉంటుందని తెలిపింది. తన పేరు మార్పుపై మాత్రం రాఖీ ఇంకా వ్యాఖ్యానించలేదు.
సంబంధిత కథనం