OTT Thriller Movie: మరో ఓటీటీలోకి వస్తున్న థ్రిల్లింగ్ టైమ్ ట్రావెలింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..-dheekshith shetty kannada sci fi thriller blink to stream in tamil on aha ott platform after amazon prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Thriller Movie: మరో ఓటీటీలోకి వస్తున్న థ్రిల్లింగ్ టైమ్ ట్రావెలింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

OTT Thriller Movie: మరో ఓటీటీలోకి వస్తున్న థ్రిల్లింగ్ టైమ్ ట్రావెలింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 21, 2024 06:53 PM IST

Blink OTT: బ్లింక్ చిత్రం మరో ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా రెండో ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ మూవీ ఏ ఓటీటీలోకి.. ఎప్పుడు రానుందంటే..

OTT Thriller Movie: మరో ఓటీటీలోకి వస్తున్న థ్రిల్లింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
OTT Thriller Movie: మరో ఓటీటీలోకి వస్తున్న థ్రిల్లింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన బ్లింక్ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. టైమ్ ట్రావెల్‍ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా మంచి కలెక్షన్లు దక్కించుకుంది. ఈ మూవీకి శ్రీనిధి బెంగళూరు దర్శకత్వం వహించారు. ఈ ఏడాది మార్చిలోనే ఈ చిత్రం థియేటర్లలో రిలీజైంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో కన్నడ, తెలుగులో అందుబాటులోకి వచ్చి మంచి వ్యూస్ దక్కించుకుంది. అయితే, ఇప్పుడు మరో భాషలో ఇంకో ఓటీటీలోకి బ్లింక్ సినిమా వస్తోంది.

స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

బ్లింక్ చిత్రం తమిళంలోనూ అందుబాటులోకి వస్తోంది. ఆహా తమిళ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో సెప్టెంబర్ 25వ తేదీన బ్లింక్ స్ట్రీమింగ్‍కు వస్తుంది. ఈ విషయంపై నేడు (సెప్టెంబర్ 21) అధికారిక ప్రకటన వచ్చింది.

ప్రైమ్ వీడియోలో..

బ్లింక్ చిత్రం మే నెలలో ముందుగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వచ్చింది. మంచి వ్యూస్ దుమ్మురేపింది. ఆ తర్వాత ఆగస్టులో తెలుగు వెర్షన్ కూడా ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. తెలుగులోనూ మంచి వ్యూస్ దక్కించుకుంది. దసరా చిత్రంతో తెలుగులోనూ దీక్షిత్ శెట్టి పాపులర్ అయ్యారు. అందులోనూ ఈ మూవీకి పాజిటివ్ టాక్ ఉండటంతో మంచి వ్యూస్ దక్కించుకుంది. ఇప్పుడు సెప్టెంబర్ 25న తమిళంలోనూ ఆహా తమిళ్‍లో అందుబాటులోకి రానుంది. ఆహా తెలుగులోకి కూడా వస్తుందని రూమర్లు ఉన్నా.. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

బ్లింక్ సినిమాకు శ్రీనిధి బెంగళూరు దర్శకత్వం వహించారు. నాలుగు కాలల మధ్య సైన్స్ ఫిక్షన్ చిత్రంగా స్టోరీని నడిపించారు. కనురెప్పలు కొట్టడాన్ని నియంత్రించుకోగలిగే యువకుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టితో పాటు చైత్ర జే అచార్, మందార బత్తలహళ్ళి, గోపాల్ కృష్ణ దేశ్‍పాండే, వజ్రధీర్, సురేశ్ అనగాలి, కిరణ్ నాయక్, సౌమ్యశ్రీ మర్నాడ్, యశస్విని రావ్ కీలకపాత్రలు పోషించారు.

బ్లింక్ చిత్రాన్ని జనని పిక్చర్స్ పతాకంపై రవీంద్ర ఏజే నిర్మించారు. ప్రసన్న కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రానికి అవినాశ శాస్త్రి సినిమాటోగ్రఫీ చేశారు.

బ్లింక్ స్టోరీలైన్

బ్లింక్ సినిమా నాలుగు టైమ్‍లైన్ల మధ్య నడుస్తుంది. 1996, 2001, 2021, 2023 కాలాల్లో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో డిఫరెంట్ నరేషన్‍తో సాగుతుంది. చిన్నచిన్న పనులు చేసుకుంటూ పీజీ చదివే అపూర్వ (దీక్షిత్ శెట్టి)కు కనురెప్పలు కొట్టకుండా నియంత్రించుకునే శక్తి ఉంటుంది. అయితే, అతడి తండ్రి గురించి ఓ రహస్యాన్ని ఓ వ్యక్తి అతడికి చెబుతాడు. ఆ తర్వాత అతడికి ఉన్న ఆ శక్తే శాపంగా మారుతుంది. అతడి జీవితంలో సవాళ్లు ఎదురవుతాయి. తన వారి గురించి, గతంలో విషయాల గురించి తెలుసుకునేందుకు అపూర్వ ఓ టైమ్ మిషన్ కనుగొంటాడు. దీనివల్ల చాలా విచిత్రాలు జరుగుతాయి. అతడి జీవితం గందరగోళం అవుతుంది. చాలా ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. అసలు అపూర్వకు ఆ శక్తి ఎలా వచ్చింది? తన తండ్రి గురించి అతడు తెలుసుకున్న నిజమేంటి? టైమ్ ట్రావెల్ ఎందుకు చేశాడు? చివరికి ఏం జరిగిందనే ముఖ్యమైన విషయాలు బ్లింక్ కథలో ఉంటాయి.