OTT Sci Fi Thriller: తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు వచ్చిన కన్నడ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..-dheekshith shetty kannada sci fi thriller blink now streaming in telugu also on amazon prime video ott blink movie ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Sci Fi Thriller: తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు వచ్చిన కన్నడ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..

OTT Sci Fi Thriller: తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు వచ్చిన కన్నడ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 12, 2024 03:49 PM IST

Blink OTT Streaming: కన్నడ సైన్స్ ఫిక్షన్ మూవీ బ్లింక్ థియేటర్లలో సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఓటీటీలో కన్నడలో మాత్రమే స్ట్రీమింగ్‍కు వచ్చింది. అయితే, తాజాగా ఈ చిత్రం తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఆ వివరాలు ఇవే..

OTT Sci-Fi Thriller: తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు వచ్చిన కన్నడ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..
OTT Sci-Fi Thriller: తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు వచ్చిన కన్నడ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..

కన్నడ యంగ్ యాక్టర్ దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన బ్లింక్ సినిమా మంచి హిట్ అయింది. ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ రావటంతో పాటు కమర్షియల్‍గానూ సక్సెస్ సాధించింది. ఈ ఏడాది మార్చి 8వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. బ్లింక్ మూవీకి శ్రీనిధి దర్శకత్వం వహించారు. ఓటీటీలోనూ ఈ టైమ్ ట్రావెల్ చిత్రానికి మంచి రెస్పాన్ వచ్చింది. ముందుగా కన్నడలోనే వచ్చిన బ్లింక్ మూవీ తాజాగా తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది.

స్ట్రీమింగ్ ఎక్కడ..

బ్లింక్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మే నెలాఖరులో కన్నడలో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. అయితే, కొన్నాళ్లు మాయమై మళ్లీ అందుబాటులోకి వచ్చింది. ఇంతకాలం కన్నడలోనే స్ట్రీమ్ అయింది. ఈ బ్లింక్ చిత్రం తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు భాషలోనూ అందబాటులోకి వచ్చింది.

బ్లింక్ సినిమాకు తెలుగు ఆడియోను కూడా ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్ యాడ్ చేసింది. దీంతో ఇక నుంచి ఈ చిత్రాన్ని తెలుగులోనూ చూడొచ్చు. కన్నడలో సూపర్ రెస్పాన్స్ దక్కించుకున్న ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీకి తెలుగులో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. దసరా చిత్రంతో తెలుగులోనూ దీక్షిత్ శెట్టి పాపులర్ అయ్యారు.

బ్లింక్ సినిమాలో దీక్షిత్ శెట్టితో పాటు చైత్ర జే ఆచార్, మందార బత్తలహళ్లి, గోపాలకృష్ణ దేశ్‍పాండే, వజ్రధీర్ జైన్, సురేశ్ అంగాలీ, కిరణ్ నాయక్, సౌమ్యశ్రీ మర్నాడ్ కీలకపాత్రలు పోషించారు. టైమ్ ట్రావెల్‍తో ఈ సైన్స్ ఫిక్షన్ మూవీని డైరక్టర్ శ్రీనిధి ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు. విభిన్న టైమ్‍లైన్లలో ఉండే ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది.

కొంతకాలం మాయం.. మళ్లీ ఎంట్రీ

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో బ్లింగ్ సినిమా మే నెలలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తొలి నాలుగు రోజుల్లోనే ఈ చిత్రానికి మంచి వ్యూస్ దక్కాయి. అయితే, సడెన్‍గా ఓటీటీలో ఈ చిత్రం మాయమైంది. ఈ మూవీలో ఉన్న రింగ్ టోన్స్, వినిపించిన కొన్ని ట్యూన్స్ గురించి ఓ మ్యూజిక్ లేబుల్ కంపెనీ నోటీసులు పంపింది. దీంతో అవన్నీ తొలగించి మళ్లీ మూడు వారాల తర్వాత జూన్ 18వ తేదీన స్ట్రీమింగ్‍కు తెచ్చింది ప్రైమ్ వీడియో. అయితే, నేడు (ఆగస్టు 12) తెలుగు ఆడియోను కూడా ఆ ఓటీటీ యాడ్ చేసింది.

బ్లింక్ మూవీని జనని పిక్చర్స్ పతాకంపై రవీంద్ర ఏజే నిర్మించారు. ప్రసన్న కుమార్ ఎంఎస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి అనివాశ్ శాస్త్రి సినిమాటోగ్రఫీ చేశారు. ఈ మూవీ టెక్నికల్‍గానూ మెరుగ్గా ఉందనే ప్రశంసలు దక్కించుకుంది. పాజిటివ్ స్పందనతో మంచి వసూళ్లను సాధించింది.

బ్లింక్ సినిమా టైమ్ ట్రావెల్‍తో కాన్సెప్ట్‌తో సైన్స్ ఫిక్షన్ మూవీగా వచ్చింది. 1996, 2001, 20221, 2034 సంవత్సరాల మధ్య ఈ స్టోరీ సాగుతుంది. ఈ టైమ్‍లలో కథ ఉంటుంది. యాక్టింగ్‍పై ఎంతో ఆసక్తి ఉండే అపూర్వ (దీక్షిత్ శెట్టి).. ఎంఏ పూర్తి చేయడంలో విఫలమవుతాడు. ఆ విషయాన్ని ఇంట్లో తెలియకుండా దాచి పెడుతుంటాడు. కనురెప్పలను కొట్టకుండా నియంత్రించుకునే ప్రత్యేకమైన శక్తి అతడికి ఉంటుంది. తన తండ్రి గురించి అతడికి ఓ వృద్ధుడు షాకింగ్ రహస్యాలు చెబుతాడు. దీంతో పరిస్థితులన్నీ మారిపోతాయి. తండ్రి గురించి అపూర్వకు తెలిసిన రహస్యమేంటి? అతడు టైమ్ మిషన్‍ను ఎందుకు వినియోగించాడు? సవాళ్లను పరిష్కరించగలిగాడా అనేదే బ్లింక్ చిత్రంలో ప్రధాన అంశాలుగా ఉంటాయి.