Devara Teaser: దేవర టీజర్‌పై క్రేజీ అప్‌డేట్.. వచ్చేది అప్పుడే
Devara Teaser: జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మూవీ టీజర్‌పై క్రేజీ అప్‌డేట్ వస్తోంది. ఈ టీజర్ ఈ నెలలోనే రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వస్తుండటం విశేషం.
Devara Teaser: టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత మరో సినిమాలో కనిపించలేదు. అయితే త్వరలోనే దేవర మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా టీజర్ పై ఇప్పుడో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వస్తోంది. దేవర టీజర్ ను ఈ నెలలోనే రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నాడు.
దేవర మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివతో యంగ్ టైగర్ చేస్తున్న రెండో సినిమా ఇది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మూవీ టీజర్ రిలీజ్ పై అధికారిక ప్రకటన త్వరలోనే రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో తండ్రి, కొడుకుగా డ్యుయల్ రోల్లో తారక్ నటిస్తున్నాడు.
దేవరను రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నారు. దేవర 1 వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ పై ఎక్కువ దృష్టి సారించనున్నారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక దేవర మూవీలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.
దేవర సినిమాలో ఒక కొత్త ప్రపంచం, చాలా బలమైన పాత్రలు, అత్యంత భారీతనం ఉంటుందని అన్నారు. అందుకే ఒకే భాగంలో దేవర కథను పూర్తిగా చూపించడం కష్టమని అనిపిస్తోందని కొరటాల చెప్పారు. అందుకే రెండు పార్ట్‌ల్లో దేవర సినిమాను తీసుకురావాలని నిర్ణయించినట్టు వివరించారు. రూ.300 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.