Jawan Piracy: జ‌వాన్ పైర‌సీపై హైకోర్టు సీరియ‌స్ - రోహిత్ శ‌ర్మ‌పై కేసు న‌మోదు-delhi highcourt orders to deactivate socialmedia groups selling and sharing pirated copies of jawan movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jawan Piracy: జ‌వాన్ పైర‌సీపై హైకోర్టు సీరియ‌స్ - రోహిత్ శ‌ర్మ‌పై కేసు న‌మోదు

Jawan Piracy: జ‌వాన్ పైర‌సీపై హైకోర్టు సీరియ‌స్ - రోహిత్ శ‌ర్మ‌పై కేసు న‌మోదు

HT Telugu Desk HT Telugu
Sep 21, 2023 06:27 AM IST

Jawan Piracy: షారుఖ్‌ఖాన్ జ‌వాన్ సినిమా పైర‌సీదారుల‌పై చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ నిర్మాణ సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించింది. జ‌వాన్‌ సినిమాను సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన‌ రోహిత్ శ‌ర్మ అనే వ్య‌క్తితో పాటు మ‌రికొంత‌మందిపై నిర్మాణ సంస్థ ప్ర‌తినిధులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

షారుఖ్‌ఖాన్ జ‌వాన్
షారుఖ్‌ఖాన్ జ‌వాన్

Jawan Piracy: జ‌వాన్ పైర‌సీదారుల‌పై ఢిల్లీ పోలీసులు కేసు న‌మోదు చేశారు. టెలిగ్రామ్‌, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోష‌ల్ మీడియా అకౌంట్స్ ద్వారా సినిమాను షేర్ చేసిన వారి వివ‌రాల్ని త‌మ‌కు అందించాల‌ని ఢిల్లీ హై కోర్టు కోరింది. షారుఖ్‌ఖాన్ హీరోగా న‌టించిన జ‌వాన్ సినిమా సెప్టెంబ‌ర్ 7న థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. 13 రోజుల్లోనే 900 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి ఇండ‌స్ట్రీ రికార్డుల‌ను ఈ మూవీ తిర‌గ‌రాసింది.

రిలీజ్ రోజే జ‌వాన్ సినిమా పైర‌సీకి గుర‌య్యింది. ప‌లు సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో సినిమా ద‌ర్శ‌న‌మిచ్చింది. ఈ పైర‌సీ కంటెంట్ తొల‌గించాలంటూ చిత్ర నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఢిల్లీ పోలీసుల‌తో పాటు హైకోర్టును ఆశ్ర‌యించారు. సోష‌ల్ మీడియాలో ఈ సినిమాను షేర్ చేస్తోన్నరోహిత్ శ‌ర్మ‌తో పాటు మ‌రికొంద‌రు వ్య‌క్తుల‌పై నిర్మాణ సంస్థ ప్ర‌తినిధులు శాంత‌క్రూజ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

పైర‌సీ కాపీల‌ను సోష‌ల్ మీడియాలోషేర్ చేయ‌డ‌మే కాకుండా కొంత‌మంది వాటిని విక్ర‌యిస్తున్న‌ట్లు గుర్తించారు. వారి వివ‌రాల్ని కూడా పోలీసుల‌కు అంద‌జేశారు.

ఢిల్లీ హై కోర్టు....

ఈ పైర‌సీ దారుల‌పై చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌ల‌ను తీసుకోవాల‌ని నిర్మాణ సంస్థ కోర్డును ఆశ్ర‌యించింది. సోష‌ల్ మీడియాలో షేర్ అవుతోన్న ఈ సినిమా పైరేటెడ్ కాపీల‌ను తొల‌గించాల‌ని కోర్టుకు విన్నవించింది. ఈ సినిమాను షేర్ చేసిన వారి సోష‌ల్ మీడియా అకౌంట్స్‌ను డీయాక్టివేట్ చేయ‌డ‌మే కాకుండా వారిపై చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌ల‌ను తీసుకోవాల‌ని కోర్టును నిర్మాణ సంస్థ ప్ర‌తినిధినులు కోరారు. రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ త‌ర‌ఫున న్యాయ‌వాదుల అభ్య‌ర్థ‌న‌ను స్వీక‌రించిన కోర్టు ఈ సినిమాను షేర్ చేస్తోన్న అకౌంట్స్ వివ‌రాల్ని అందించాల‌ని టెలిఫోన్ కంపెనీల‌ను ఆదేశించింది.

రివేంజ్ డ్రామా...

కోర్డు ఆర్డ‌ర్‌ను అనుస‌రించి ఈ పైర‌సీ దారుల‌ను అరెస్ట్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. జ‌వాన్ సినిమాకు అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. దేశ‌భ‌క్తికి యాక్ష‌న్ అంశాల‌ను మేళ‌వించి రివేంజ్ డ్రామాగా ఈ సినిమా తెర‌కెక్కింది. ఇందులో షారుఖ్‌ఖాన్ డ్యూయ‌ల్ షేడ్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించాడు. న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టించ‌గా దీపికా ప‌డుకోణ్ గెస్ట్ రోల్ చేసింది. జ‌వాన్ సినిమాలో విజ‌య్ సేతుప‌తి విల‌న్‌గా క‌నిపించాడు.

Whats_app_banner