Thangalaan OTT: ఓటీటీలోకి ఆలస్యమవుతున్న తంగలాన్ చిత్రం.. ఎప్పుడు రావొచ్చు!-chiyaan vikram period action adventure movie thangalaan to stream on netflix soon in october ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thangalaan Ott: ఓటీటీలోకి ఆలస్యమవుతున్న తంగలాన్ చిత్రం.. ఎప్పుడు రావొచ్చు!

Thangalaan OTT: ఓటీటీలోకి ఆలస్యమవుతున్న తంగలాన్ చిత్రం.. ఎప్పుడు రావొచ్చు!

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 01, 2024 10:00 AM IST

Thangalaan OTT: తంగలాన్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. కానీ ఆలస్యమవుతూ వస్తోంది. ఇంకా స్ట్రీమింగ్‍కు రాలేదు. ఈ చిత్రం ఎప్పుడు స్ట్రీమింగ్‍కు రావొచ్చో అంచనాలు బయటికి వచ్చాయి.

Thangalaan OTT: ఓటీటీలోకి ఆలస్యమవుతున్న తంగలాన్ చిత్రం.. ఎప్పుడు రావొచ్చు!
Thangalaan OTT: ఓటీటీలోకి ఆలస్యమవుతున్న తంగలాన్ చిత్రం.. ఎప్పుడు రావొచ్చు!

భారీ అంచనాల మధ్య వచ్చిన తంగలాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మోస్తరు కలెక్షన్లను దక్కించుకుంది. ఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్ వరకు ఈ మూవీపై ఆసక్తి పెరుగుతూనే వచ్చింది. చియాన్ విక్రమ్ హీరోగా నటించిన తంగలాన్ మూవీ ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈ పీరియడ్ యాక్షన్ మూవీకి పా రంజిత్ దర్శకత్వం వహించారు.

తంగలాన్ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్‌లోనే ఓటీటీలోకి వస్తుందంటూ గతంలో అంచనాలు వచ్చాయి. అయితే అలా జరగలేదు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ ఆలస్యమైంది. థియేట్రికల్ రన్ ముగిసినా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టలేదు. అయితే, ఈ మూవీ స్ట్రీమింగ్‍పై తాజా బజ్ బయటికి వచ్చింది.

స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రావొచ్చంటే..

తంగలాన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ దగ్గర ఉన్నాయి. మంచి క్రేజ్ ఉండటంతో రిలీజ్‍కు ముందే భారీ ధరకు ఈ చిత్రాన్ని ఆ ప్లాట్‍ఫామ్ తీసుకుంది. కాగా, తంగలాన్ చిత్రం అక్టోబర్ తొలి వారం లేకపోతే రెండో వారం స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశాలు ఉన్నట్టు అంచనాలు వెలువడుతున్నాయి. అక్టోబర్ రెండో వారంలోగా స్ట్రీమింగ్‍కు వస్తుందని తెలుస్తోంది. స్ట్రీమింగ్ డేట్‍పై నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మొత్తంగా, తంగలాన్ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ కోసం నిరీక్షణ కొనసాగుతోంది. అక్టోబర్‌లో స్ట్రీమింగ్‍కు రావడం మాత్రం కచ్చితంగా కనిపిస్తోంది. మరి రెండో వారంలోగా ఈ మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో అడుగుపెడుతుందేమో చూడాలి.

తంగలాన్ చిత్రాన్ని భారత స్వాతంత్య్రానికి ముందు బ్రిటీషర్ల పాలన నాటి బ్యాక్‍డ్రాప్‍లో డైరెక్టర్ పా రంజిత్ తెరకెక్కించారు. 1850ల నాటి కథతో సాగుతుంది. కర్ణాటకలోని కొలార్ గోల్డ్ ఫీల్డ్స్ ప్రాంతంలో బంగార కోసం జరిపే అన్వేషణ చుట్టూ ఈ మూవీ రూపొందింది. తన భావజాలాన్ని కూడా రంజిత్ ఈ చిత్రంలో చూపించారు.

తంగలాన్ మూవీలో విక్రమ్‍తో పాటు మాళవిక మోహనన్, పశుపతి, పార్వతి తిరవోతు, డానియెల్ కాల్టగిరోన్, ఆనంద్‍సామి, వెట్టై ముత్తుకుమార్ కీలకపాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ మూవీకి సంగీతం అందించారు. కిశోర్ కుమార్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్లస్ అయింది.

తంగలాన్ కలెక్షన్లు

తంగలాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.100కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. ఈ మూవీకి బడ్జెట్ రూ.120 కోట్ల వరకు అయినట్టు అంచనా. దీంతో ఈ చిత్రం కమర్షియల్‍గా సక్సెస్ అనిపించుకోలేకపోయింది. మూవీకి ప్రశంసలు దక్కినా.. బాక్సాఫీస్ నంబర్లు మాత్రం అంచనాలకు తగ్గట్టు రాలేదు.

తంగలాన్ చిత్రాన్ని గ్రీన్ స్టూడియోస్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ నిర్మించారు. ఈ చిత్రంలో విక్రమ్ నటనపై మరోసారి ప్రశంసలు కురిశాయి. డిఫరెంట్ గెటప్‍ల్లో ఆయన కనిపించారు. వైవిధ్యమైన నటనతో మరోసారి మూవీ కోసం ప్రాణం పెట్టేశారు. ప్రతీ రోజు షూటింగ్‍లో గంటల పాటు మేకప్‍ కోసమే విక్రమ్ వెచ్చించారు. ఓ దశలో షూటింగ్‍లో గాయపడినా.. మళ్లీ కోలుకొని పూర్తి చేశారు. ఈ చిత్రం కోసం ప్రమోషన్లను కూడా మూవీ టీమ్ జోరుగానే చేసింది. తెలుగులోనూ ప్రమోషన్లు బాగా జరిగాయి.

Whats_app_banner