Condolences to Kaika Satyanarayana: కైకాల పార్థివదేహాన్ని చూసి చిరంజీవీ కన్నీటి పర్యంతం
Condolences to Kaika Satyanarayana: కైకాల సత్యనారాయణ పార్థివ దేహాన్ని చూసేందుకు ఆయన నివాసానికి చేరుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. కైకాల కుటుంబానికి సానుభూతిని తెలియజేసి ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
Condolences to Kaika Satyanarayana: ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ శుక్రవారం నాడు కన్నుమూయడంతో యావత్ తెలుగు చిత్రసీమ శోక సంద్రంలో మునిగిపోయింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు తెల్లవారుజామున కన్నుముశారు. ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. ఆయన పార్థివ దేహం చూసేందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి కన్నీటి పర్యంతమయ్యారు. ఫిల్మ్ నగర్‌లోని సత్యనారాయణ నివాసం వద్దకు వచ్చి భావోద్వేగానికి లోనయ్యారు. కైకాల కుటుంబ సభ్యులను ఓదార్చి తనతో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఈ రోజు తెలుగు చిత్రసీమ ఓ మహా నటుడిని కోల్పోయింది. మాకు సంబంధించినంత వరకూ ఆయన మా కుటుంబ సభ్యుడు. నన్ను తమ్ముడు అంటూ అప్యాయంగా పిలిచే ఒక అన్నయ్యను కోల్పోయినట్టు భావిస్తున్నా. ఇది మాకు తీరని లోటు. ఆయనతో నటించిన ప్రతి సినిమా నాకొక తీపి జ్ఞాపకం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నాను. అని చిరంజీవి అన్నారు.
కైకాల పార్థివదేహానికి నివాళులర్పించేందుకు పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. ఆయనతో తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కైకాల సత్యనారాయణ మృతి బాధాకరం. ఆయన ఎంపీగా ఎన్నికైనప్పుడు అన్నయ్య చెప్పడంతో నేను వెళ్లి పుష్పగుచ్ఛం ఇచ్చి వచ్చాను. అలా ఆయనను మొదటిసారి కలిశాను. చాలా ఆప్యాయంగా పలకరించారు. ఆయన అజాతశత్రువు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
కైకాలకు నివాళుల అర్పించేందుకు సినీ, రాజకీయ నటులు ఆయన నివాసానాకి చేరుకుంటున్నారు. మోహన్ బాబు, బ్రహ్మానందం, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసరావు తదితరులు ఫిల్మ్ నగర్‌లోని ఆయన నివాసానికి చేరుకుని నివాళులు అర్పించారు.
సంబంధిత కథనం
టాపిక్