Chandra Mohan Last Rites: అశ్రునయనాల మధ్య చంద్రమోహన్ అంత్యక్రియలు.. అంతిమ సంస్కారాలు ఎవరు చేశారంటే..
Chandra Mohan Last Rites: దిగ్గజ నటుడు చంద్రమోహన్ అంత్యక్రియలు ముగిశాయి. సినీ ప్రముఖులు, అభిమానులు.. అశ్రు నయనాలతో ఆయనకు తుది వీడ్కోలు పలికారు.
Chandra Mohan Last Rites: దిగ్గజ నటుడు చంద్రమోహన్ అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్‍లోని పంజాగుట్ట శ్మశాన వాటికలో ఆయన అంతిమ సంస్కారాలు నేడు (నవంబర్ 13) జరిగాయి. ముందుగా ఫిల్మ్ నగర్‌లోని ఆయన నివాసం నుంచి శ్మశాన వాటిక వరకు అంతిమ యాత్ర జరిగింది. పలువురు సినిమా ప్రముఖులు, అభిమానుల అశ్రునయనాల మధ్య చంద్రమోహన్ అంత్యక్రియలు జరిగాయి. అందరూ ఆవేదనతో ఆయనకు కడసారి వీడ్కోలు పలికారు.
గుండెపోటుకు రావడంతో గత శనివారం (నవంబర్ 11) చంద్రమోహన్ (80) కన్నుమూశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆ తర్వాత సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం భౌతిక కాయాన్ని ఫిల్మ్ నగర్‌లోని ఆయన ఇంట్లోనే ఉంచారు. అనేక మంది సినీ ప్రముఖులు, భారీ సంఖ్యలో అభిమానులు చంద్రమోహన్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
అమెరికాలో ఉంటున్న చంద్రమోహన్ కుమార్తె మధుర మీనాక్షి నేడు హైదరాబాద్‍కు చేరుకున్నారు. తన తండ్రిని కడసారి చూసి కంటతడి పెట్టారు. మధ్యాహ్నం అంతిమ యాత్ర జరిగింది. పంజాగుట్ట శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. చంద్రమోహన్‍కు కుమారులు లేరు. దీంతో చంద్రమోహన్‍కు ఆయన సోదరుడు దుర్గాప్రసాద్ అంతిమ సంస్కారాలు చేశారు. అశ్రు నయనాలతో ఆయనకు అభిమానులు కడసారి వీడ్కోలు పలికారు.
హీరోగా, క్యారెక్టర్ ఆరిస్టుగా తెలుగు, తమిళంలో చంద్రమోహన్ 932 సినిమాలు చేశారు. అందులో హీరోగా సుమారు 150 సినిమాలు చేశారు. దశాబ్దాల సినిమా కెరీర్లో ఆయన ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించారు. ముఖ్యంగా తండ్రి పాత్రలో చాలా సినిమాల్లో చేశారు చంద్రమోహన్. ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. ఎమోషన్‍తో కంట తడిపెట్టించారు. దిగ్గజ నటుడి స్థాయికి చేరారు. గత రెండు సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమోహన్ నవంబర్ 11న కన్నుమూశారు.
సంబంధిత కథనం
టాపిక్