BTS Jin New Album: బీటీఎస్ జిన్ సోలో ఆల్బమ్.. టీజర్ రిలీజ్.. ఇలా ప్రీఆర్డర్ చేసుకోవచ్చు-bts jin new solo album happy teaser released pre order this through online and offline ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bts Jin New Album: బీటీఎస్ జిన్ సోలో ఆల్బమ్.. టీజర్ రిలీజ్.. ఇలా ప్రీఆర్డర్ చేసుకోవచ్చు

BTS Jin New Album: బీటీఎస్ జిన్ సోలో ఆల్బమ్.. టీజర్ రిలీజ్.. ఇలా ప్రీఆర్డర్ చేసుకోవచ్చు

Hari Prasad S HT Telugu

BTS Jin New Album: బీటీఎస్‌కు చెందిన జిన్ ఇప్పుడు తన తొలి సోలో ఆల్బమ్ ద్వారా అభిమానుల ముందుకు వస్తున్నాడు. ఈ ఆల్బమ్ విడుదలతో పాటు జిన్ వివిధ కార్యకలాపాల ద్వారా అభిమానులకు దగ్గరవుతాడని బీటీఎస్ ఏజెన్సీ తెలిపింది. ఈ ఆల్బమ్ కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ చూడండి.

బీటీఎస్ జిన్ సోలో ఆల్బమ్.. టీజర్ రిలీజ్.. ఇలా ప్రీఆర్డర్ చేసుకోవచ్చు

BTS Jin New Album: బీటీఎస్ లో అందరి కంటే పెద్దవాడైన జిన్.. ఇప్పుడు హ్యాపీ పేరుతో తన తొలి సోలో ఆల్బమ్ ను విడుదల చేయనున్నాడు. ఈ ఆల్బమ్ ను ఈ ఏడాది నవంబర్ లో విడుదల చేయనున్నట్లు బీటీఎస్ సంస్థ బిగ్ హిట్ మ్యూజిక్ సోమవారం (అక్టోబర్ 14) వెవర్స్ లో అనౌన్స్ చేసింది. దక్షిణ కొరియా మిలిటరీ నుంచి బయటకు వచ్చిన తర్వాత జిన్ తొలిసారి ఈ ఆల్బమ్ ద్వారా రీఎంట్రీ ఇస్తున్నాడు.

జిన్ ఆల్బమ్‌పై బిగ్ హిట్ మ్యూజిక్

జిన్ సరికొత్త సోలో ఆల్బమ్ హ్యాపీ గురించి బీటీఎస్ ఏజెన్సీ ఇలా రాసింది. "హలో. ఇది బిగ్ హిట్ మ్యూజిక్. బీటీఎస్ మెంబర్ అయిన జిన్ మొదటి సోలో ఆల్బమ్ హ్యాపీ వివరాలను పంచుకోవడానికి మేము థ్రిల్లింగ్ గా ఉన్నాము. ఆనందాన్ని కనుగొనే తన ప్రయాణంలో తనతో కలిసి రావాలని జిన్ అభిమానులకు హృదయపూర్వక ఆహ్వానం పంపడం సంతోషంగా ఉంది. ఈ ఆల్బమ్ లో ఆరు ట్రాక్ లు ఉన్నాయి. ప్రతి ఒక్కటీ తనదైన వైబ్ తో ఉంటాయి" అని చెప్పింది.

బీటీఎస్ బ్యాండ్ సభ్యులు ప్రస్తుతం సౌత్ కొరియన్ మిలిటరీలో పని చేస్తున్న విషయం తెలిసిందే. ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇప్పుడు జిన్ ఇలా బయటకు వచ్చిన తర్వాత హ్యాపీ ఆల్బమ్ తో సోలోగా అభిమానుల ముందుకు వస్తున్నాడు. ఈ ఆల్బమ్ అందరికీ ఆనందాన్ని ఇస్తుందని తాము భావిస్తున్నట్లు బీటీఎస్ ఏజెన్సీ తెలిపింది. ఈ ఆల్బమ్ తోపాటు వివిధ ఈవెంట్స్ ద్వారా మరోసారి అభిమానులకు జిన్ దగ్గర కానున్నట్లు కూడా చెప్పింది.

హ్యాపీ ఆల్బమ్ గురించి..

ఈ ఆల్బమ్ ప్రీ-ఆర్డర్ మంగళవారం (అక్టోబర్ 15) కొరియన్ టైమ్ ప్రకారం ఉదయం 11 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఉదయం 7.30 గంటలకు) ప్రారంభం కానుంది. ఈ ఆల్బమ్ నవంబర్ 15న మధ్యాహ్నం 2 గంటలకు అంటే ఉదయం 10:30 గంటలకు విడుదల కానుంది. బిగ్హిట్ మ్యూజిక్ 20 సెకన్ల టీజర్ ను కూడా షేర్ చేసింది. రాబోయే ఆల్బమ్ నుండి కొన్ని ఫోటోలను కూడా బిటిఎస్ ఏజెన్సీ పంచుకుంది.

ఇక బిగ్ హిట్ మ్యూజిక్ మరో అనౌన్స్‌మెంట్ లో బీటీఎస్ ఆర్మీ ఆల్బమ్ ను ఎలా ప్రీఆర్డర్ చేసుకోవచ్చు షేర్ చేసింది. ఈ ప్రీఆర్డర్ ఇవాళ్టి (అక్టోబర్ 15) నుంచి నవంబర్ 14 వరకు చేసుకునే వీలుంది.

హ్యాపీ ఆల్బమ్ గురించి జిన్ ఏమన్నాడంటే..

ఈ ఏడాది జూన్ లో దక్షిణ కొరియా సైన్యం నుంచి జిన్ బయటకు వచ్చాడు. తాజాగా వీవర్స్ లైవ్ సెషన్లో తన ఆల్బమ్ గురించి మాట్లాడాడు. “మీరంతా దేని గురించి కుతూహలంగా ఉంటారో నాకు తెలుసు. నా ఆల్బమ్ రికార్డింగ్ పూర్తయి చాలా కాలమైంది. మరికొన్ని రోజులు వేచి చూడండి. ఇప్పుడే నేను ఆ పాటను ప్లే చేయగలను. కానీ మీరు ఆల్బమ్ వచ్చే వరకూ ఆగితే మంచిది. ఈ సాంగ్స్ చాలా బాగున్నాయి. నేను అప్పుడప్పుడూ వింటూనే ఉన్నాను” అని జిన్ అన్నాడు.