Telugu News  /  Entertainment  /  Brahmastra Streaming Now On Disney Plus Hotstar
ర‌ణ్‌బీర్‌క‌పూర్‌, అలియాభ‌ట్
ర‌ణ్‌బీర్‌క‌పూర్‌, అలియాభ‌ట్

Brahmastra Streaming On Hotstar: ఓటీటీలోకి వ‌చ్చేసిన బ్ర‌హ్మాస్త్ర

04 November 2022, 14:22 ISTNelki Naresh Kumar
04 November 2022, 14:22 IST

Brahmastra Streaming On Hotstar: బాలీవుడ్ రియ‌ల్ క‌పుల్ ర‌ణ్‌బీర్‌క‌పూర్‌, అలియాభ‌ట్ జంట‌గా న‌టించిన బ్ర‌హ్మాస్త్ర సినిమా నేడు(శుక్ర‌వారం)ఓటీటీలో రిలీజైంది. ఏ ప్లాట్‌ఫామ్‌లో ఎన్ని భాష‌ల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందంటే..

Brahmastra Streaming On Hotstar: బ్ర‌హ్మాస్త్ర సినిమా ఓటీటీలోకి వ‌చ్చేసింది. నేటి నుంచి ఈ సినిమా డిస్నీప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మైథ‌లాజిక‌ల్ పాయింట్‌కు ఫాంట‌సీ యాక్ష‌న్ అంశాల‌ను జోడించి రూపొందించిన ఈ సినిమాలో బాలీవుడ్ రియ‌ల్ క‌పుల్ ర‌ణ్‌బీర్ క‌పూర్‌ (Ranbir kapoor), అలియా భ‌ట్ (Alia Bhatt) హీరోహీరోయిన్లుగా న‌టించారు. పెళ్లి త‌ర్వాత వీరిద్ద‌రు తొలిసారి జంట‌గా న‌టించిన సినిమా ఇది. అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ట్రెండింగ్ వార్తలు

సెప్టెంబ‌ర్ 9న థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా ఈ ఏడాది బాలీవుడ్‌లో హ‌య్యెస్ట్ గ్రాస‌ర్‌గా నిలిచింది. దాదాపు 450 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఈ సినిమా ద‌క్షిణాది వెర్ష‌న్‌కు అగ్ర ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ప్ర‌జెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌డంతో తెలుగులో ఈ సినిమా 20 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. తెలుగులో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ సొంతం చేసుకున్న బాలీవుడ్ డ‌బ్బింగ్ సినిమాల్లో ఒక‌టిగా బ్ర‌హ్మాస్త్ర నిలిచింది.

బ్ర‌హ్మాస్త్ర ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూశారు. ఈ నిరీక్ష‌ణ‌కు పుల్‌స్టాప్ పెడుతూ శుక్ర‌వారం డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో ఈ సినిమా రిలీజైంది. హిందీ, తెలుగుతో పాటు ద‌క్షిణాది భాష‌ల‌న్నింటిలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

దాదాపు 85 కోట్ల‌కు ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్‌ను డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం. మూడు ముక్క‌లైన బ్ర‌హ్మాస్త్రాన్ని కాపాడ‌టం కోసం శివ అనే యువ‌కుడు సాగించిన పోరాటం ఆధారంగా ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ ఈ సినిమాను తెర‌కెక్కించాడు.

ఇందులో షారుఖ్‌ఖాన్ అతిథి పాత్ర‌లో న‌టించాడు. అమితాబ్‌బ‌చ్చ‌న్, నాగార్జున అక్కినేని కీల‌క పాత్ర‌లు పోషించారు. సుదీర్ఘ విరామం త‌ర్వాత బ్ర‌హ్మాస్త్ర సినిమాతోనే నాగార్జున బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. క‌ర‌ణ్ జోహార్ ఈ సినిమాను నిర్మించాడు.మూడు భాగాలుగా బ్ర‌హ్మాస్త్ర సినిమా రూపొంద‌నుంది. సెకండ్ పార్ట్‌ను వ‌చ్చే ఏడాది రిలీజ్ చేయ‌బోతున్నారు.