Brahmamudi September 20th Episode: బ్రహ్మముడి సీరియల్.. కావ్య తండ్రిని చుట్టుముట్టిన రౌడీలు.. గాయాలతో కృష్ణమూర్తి
Brahmamudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతోంది. వేరు కుంపటి పెడదామనుకున్న అపర్ణకు సాఫ్ట్ వార్నింగ్ ఇచ్చి నిర్ణయం వెనక్కి తీసుకునేలా చేస్తుంది కావ్య. ఇంకా బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 20వ తేది ఎపిసోడ్లో
దుగ్గిరాల కుటుంబం అంతా కావ్యకు సపోర్ట్ చేయడంతో అపర్ణ రగిలిపోతుంది. వేరు కుంపటి పెడుతుంది. దీంతో ఇందిరాదేవి ఆస్తలు పంచుకుని విడిపోండి అని తెగేసి చెబుతుంది. దానితో ఇంట్లో వాళ్లంతా డిస్టర్బ్ అవుతారు. భర్త రాజ్ బాధను చూడలేక.. అత్త అపర్ణ నిర్ణయం మార్చుకునేలా ప్లాన్ వేస్తుంది కావ్య. ఇప్పటివరకు మీరు అనుకున్నట్లు చేయలేదని.. ఇక నుంచి అలా జరగదని హామీ ఇవ్వలేనని అపర్ణకు కావ్య సాఫ్ట్ వార్నింగ్ ఇస్తుంది. దీంతో అపర్ణ తన నిర్ణయం, మనసు మారిపోతుంది.
అప్పులన్నీ తీరిపోతాయి
బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్లో హాల్లో సీతా రామయ్య, ఇందిరాదేవి, అపర్ణ, రుద్రాణి, ధాన్యలక్ష్మి ఉంటారు. కావ్య వచ్చి.. తాతయ్య గారు ఈరోజు మీ ఆశీర్వాదం కావాలి అని అడుగుతుంది. అప్పుడే మెట్లపై నుంచి దిగుతున్న రాజ్ కావ్యను చూస్తాడు. ఈరోజు ఏంటీ కావ్య చాలా ఎగ్జయిటింగ్‌గా ఉన్నావ్ అని ధాన్యలక్ష్మి అంటుంది. అవును చిన్నత్తయ్య.. ఇది పూర్తయితే మా నాన్న అప్పులన్నీ తీరిపోతాయి. ఇల్లు మావాళ్ల సొంతం అవుతుంది అని సంతోషంగా చెబుతుంది.
కావ్య చెప్పేది ధాన్యలక్ష్మి, రాజ్‌తో పాటు రుద్రాణి కూడా వింటుంది. అనంతరం కొడుకు రాహుల్‌కు ఫోన్ చేసిన రుద్రాణి.. ఆ కావ్య ఈరోజు కాంట్రాక్ట్ పూర్తి చేసి తన అప్పులు తీర్చేయాలనుకుంటుంది. అది జరగకూడదు అని చెబుతుంది. నువ్ అన్నట్లే ఈరోజు రాత్రికే.. ఆ కావ్య విగ్రహాలన్నీ మాయమైపోతాయ్ అని రాహుల్ అంటాడు. తర్వాత కొంతమంది రౌడీలు కృష్ణమూర్తిని చుట్టుముట్టి, అతన్ని కొట్టి విగ్రహాలు ఎత్తుకుపోతారు. గాయాలతో కృష్ణమూర్తి కిందపడిపోయి ఉంటాడు.
నాకు సానుభూతి పెరుగుతుంది
ఇప్పటివరకు మీరు అనుకున్నది నేను చేయలేదు. కానీ, ఇకనుంచి అలా జరగదని నేను చెప్పలేను అని కావ్య అంటుంది. ఏంటీ బెదిరిస్తున్నావా అని అపర్ణ అంటే.. అయ్యో అంత ధైర్యం నాకు లేదు. ఇప్పటివరకు నేను ఇంట్లో ఎవరినీ నావైపు తిప్పుకోలేదు. మీ అబ్బాయిని కూడా అని కావ్య అంటుంది. మరి జరిగింది ఏంటీ అని అపర్ణ అంటే.. మీరు అనకుంటున్నదానికి ఆరంభం. మీకు ఇప్పటివరకు అంతా గౌరవం ఇచ్చారు. ఇప్పుడు మీరు వేరే కుంపటి పెడితే.. నాకు సానుభూతి పెరుగుతుంది అని కావ్య అంటుంది.
మీ అబ్బాయి కూడా నా తప్పు లేదని అర్థం చేసుకున్నారు కాబట్టి.. ఆయన నాకే దగ్గరైపోతారు. దీన్ని బట్టి దుగ్గిరాల కుటుంబానికి దూరం అయ్యేది ఎవరు మీరే. మీరు ఏదైతే మనసులో ఊహించుకుంటున్నారో అదే జరుగుతుంది. మీరు ఇలాగే ఉంటే అధికారం అంతా నాకే దక్కుతుంది. ఇకపై ఆలోచించుకోండి అత్తయ్య. మీ ఇష్టం అని కావ్య అంటుంది. దీంతో షాక్ అయిన అపర్ణ ఆలోచనలో పడిపోతుంది. తన ప్లాన్ అనుకున్నదానికంటే సక్సెస అయినందుకు రుద్రాణి తాగుతూ సెలబ్రేట్ చేసుకుంటుంది.
రోజుకో ట్విస్ట్
మరుసటి రోజు కావ్య డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తుంటే హాల్లో అంతా కూర్చుని ఉంటారు. అక్కడి వచ్చిన అపర్ణ.. కావ్య అని గట్టిగా పిలుస్తుంది. రోజు చేసే పనులు కూడా నీకు గుర్తు చేయాలా. ఇంత టైమ్ అవుతుంది ఒక్కరికైనా కాఫీ ఇచ్చావా అని అపర్ణ అడుగుతుంది. దీంతో ఇంట్లో వాళ్లంతా పిచ్చోళ్లు ఉన్నారు. రోజుకో ట్విస్ట్ ఇస్తున్నారు అని రుద్రాణి అనుకుంటుంది. నైట్ మాట్లాడింది బాగానే వర్కౌట్ అయింది అని కావ్య మనసులో అనుకుంటూ కాఫీ తీసుకురావడానికి వెళ్తుంది కావ్య.
రుద్రాణి వచ్చి అపర్ణను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో అంతా రుద్రాణిపై సెటైర్లు వేస్తూ మండిపడుతుంటారు. అయినా రుద్రాణి ఆపదు. కావ్య చేసింది తప్పు. వదినా ఏం చేసింది. ఇలా ఎందుకు మారిపోయావ్ వదినా. నీ కోడలికి శిక్ష వేయవా అని రుద్రాణి మాట్లాడుతుంది. ఇంతలో వచ్చిన కావ్య.. మీ ఆలోచనలను అత్తయ్యపై ఎందుకు రుద్దుతారు అని కావ్య అంటుంది. వాగింది చాలు. నేను చెప్పి టిఫిన్ చేయు అని చెప్పేసి వెళ్లిపోతుంది అపర్ణ. దీంతో అంతా కావ్యను ఇందిరాదేవి, సీతారామయ్య పొగుడుతుంటారు.