Brahmamudi December 3rd Episode: రాహుల్‌ను చితక్కొట్టిన స్వప్న - అత్తను వెళ్లగొట్టిన కావ్య - అపర్ణ విడాకుల నోటీసులు
Brahmamudi: బ్రహ్మముడి డిసెంబర్ 3 ఎపిసోడ్‌లో సుభాష్‌కు విడాకుల నోటీసులు పంపిస్తుంది అపర్ణ. ఈ విడాకుల నోటీసుల వెనుక కావ్య ప్రేమయం ఉందని ఆమెను తప్పుపడతాడు రాజ్. కళ్యాణ్‌కు ఆస్తిలో వాటా ఇవ్వకపోతే తాను ప్రాణాలు తీసుకుంటానని దుగ్గిరాల ఇంటి పెద్దలను బ్లాక్‌మెయిల్ చేస్తుంది ధాన్యలక్ష్మి.
Brahmamudi December 3rd Episode: స్టెల్లా చేసిన వంటలు చూసి రాజ్, రాహుల్‌తో పాటు మిగిలిన వాళ్లు కంగు తింటారు. ఉప్పు, కారం లేకుండా వంట చేస్తుంది. కావ్య చేసిన వంటల్ని రొటీన్ ఫుడ్ అంటూ సెటైర్లు వేస్తాడు రాజ్. కానీ స్టెల్లా చేసిన ఫుడ్ మాత్రం తినలేకపోతాడు. ఫుడ్ టేస్ట్ లేదని స్టెల్లాతో రాజ్ అంటాడు. మీకు టేస్ట్ కావాలా...ప్రోటీన్స్ కావాలా అంటూ స్టెల్లా తిక్క సమాధానాలు చెబుతూ అతడి నోరు మూయిస్తుంది.
రాజ్ ఆర్డర్...
స్టెల్లా వంటను తినలేమని రాహుల్, ప్రకాశం అంటారు. కావ్య పార్టీలో చేరబోతే వారిని రాజ్ అడ్డుకుంటాడు. నోరుమూసుకొని తినమని ఆర్డర్స్ వేస్తాడు. చివరకు స్టెల్లా భోజనం తినలేక అర్జంట్ అంటూ రాహుల్, ప్రకాశం పారిపోతారు. రూమ్‌లో నా ఫోన్ మోగుతుంది అంటూ రాజ్ కూడా జంప్ అవుతాడు. ఇంటి ఫుడ్‌కు...ఇన్‌స్టంట్ ఫుడ్‌కు ఇప్పుడు తేడా తెలిసిందా అంటూ రాజ్‌పై సెటైర్ వేస్తాడు సీతారామయ్య.
రాహుల్ పులిహోర...
కిచెన్‌లో ఉన్న స్టెల్లాతో పులిహోర కలపడం మొదలుపెడతాడు రాహుల్. మీరు చేసిన ఫుడ్ కంటే మీరు చాలా అందంగా ఉన్నారని స్టెల్లాతో అంటాడు రాహుల్. మీలాంటి బ్యూటీఫుల్ గర్ల్స్‌కు కుకింగ్‌తో పాటు ఇంకా చాలా టాలెంట్స్ ఉంటాయి కదా...అలాంటివి ఏం లేవా అని స్టెల్లాను అడుగుతాడు రాహుల్. హెడ్ మసాజ్ చేయడంలో తాను ఎక్స్‌పర్ట్ అని స్టెల్లా అంటుంది. అందుకోసం పదివేలు తీసుకుంటానని అంటుంది. డబ్బులు ఇచ్చి స్టెల్లాను తన బెడ్‌రూమ్‌కు తీసుకొస్తాడు రాహుల్.
ఇరిగేటింగ్ వైఫ్...
ఇంత బ్యూటీఫుల్ బెడ్‌రూమ్‌లో అగ్లీ వైఫ్‌తో బెడ్ షేర్ చేసుకోవాల్సివస్తుందని స్వప్న గురించి ఎగతాళిగా మాట్లాడుతాడు రాహుల్. చాలా ఇరిరేటింగ్ పర్సన్ అని అంటాడు. మీరు అడుగుపెట్టిన తర్వాత బెడ్ రూమ్‌కు అందం వచ్చిందని స్టెల్లాపై పొగడ్తలు కురిపిస్తాడు.
చిపురు తిరగేసిన స్వప్న...
స్టెల్లా రాహుల్‌కు హెడ్ మసాజ్ చేస్తుంటుంది. మీ చేతి తాకగానే నా తలనొప్పి మొత్తం పోయ్యిందని రాహుల్ అంటాడు. సంతోషంగా పాటలు పాడుతుంటాడు. అప్పుడే రూమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన స్వప్న ఆ సీన్ చూసి కోపం పట్టలేకపోతుంది. చీపురు తిరగేసి రాహుల్‌ను చితక్కొడుతుంది.
పనిలో పనిగా స్టెల్లాను కూడా చీపురుతో తరిమికొడుతుంది. స్వప్న దెబ్బలకు రాహుల్ వణికిపోతాడు. స్వప్న దెబ్బలకు భయపడి ఇంటి నుంచి పారిపోతుంది స్టెల్లా. ఇంటి మనిషికి, వంట మనిషికి తేడా ఏమిటన్నది ఇప్పటికైనా అర్థమైందా అని రాజ్‌కు క్లాస్ ఇస్తుంది ఇందిరాదేవి.
విడాకుల నోటిస్...
అప్పుడే కొరియర్ బాయ్ వచ్చి కవర్ ఇచ్చి వెళ్లిపోతాడు. ఆ కవర్ కావ్య ఇంటి నుంచే వచ్చిందని రాజ్ అంటాడు. ఆ కవర్ ఓపెన్ చేసి రాజ్ షాకవుతాడు. విడాకులు ఇస్తున్నట్లుగా మమ్మీ నీకు నోటీస్ పంపించిందని తండ్రితో అంటాడు రాజ్. అత్తయ్య విడాకుల నోటీసులు పంపించడం ఏంటి అని కావ్యఅంటుంది.
ఆపు నీ డ్రామాలు...ఈ నోటీసుల వెనుక నువ్వు, క్యాన్సర్ కనకం ఉండి ఉంటారని కావ్యపై నిందలు వేస్తాడు రాజ్. నిజంగా ఈ నోటీసుల గురించి తనకు తెలియదని, నిజానిజాలేమిటో మీరే మీ అమ్మను తెలుసుకొండి అని కావ్య కంగారుగా వెళ్లిపోతుంది. ఇక్కడే ఉంటే నిజాలు బయటపడతాయని వెళ్లిపోయిందని రాజ్ అంటాడు.
కొడుకును తప్పు పట్టిన సుభాష్...
అపర్ణ విడాకుల నోటీసులు పంపడానికి కారణం కావ్య కాదని నువ్వేనని కొడుకుపై సుభాష్ ఫైర్ అవుతాడు. మీరు మీరు గొడవలు పడి మధ్యలో మమ్మల్ని విడదీయడం ఏంటి? అమ్మ ఇళ్లు వదిలివెళ్లిపోయినప్పుడు నువ్వు దిగిరాలేదు, అర్థం చేసుకోలేదు.
నీ మూలంగా ఈ ఇంటితో మీ అమ్మ శాశ్వతంగా బంధం తెంచుకోవాలని అనుకుంటుందని సుభాష్ కోపంగా అంటాడు. మాయ విషయం బయటపడ్డప్పుడు కూడా మీ అమ్మ నాకు విడాకులు ఇవ్వాలని అనుకోలేదు. అలాంటిది నీ వల్ల ఈ రోజు మా కాపురం ముక్కలవుతుందని రాజ్‌ను నిలదీస్తాడు సుభాష్.
రాజ్ మూలంగా...
కావ్యతో నాకు ఉన్న గొడవలు..మీ విడాకులకు ఎలాంటి సంబంధం లేదని తండ్రితో రాజ్ వాదిస్తాడు. ముందు ఈ అనర్థాన్ని ఎలా ఆపాలో...అపర్ణ విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటే ఏం చేయాలో అది ఆలోచించమని సీతారామయ్య అంటాడు.
రాజ్ మూలంగా నా జీవితం, నా భార్య జీవితం ఎటూ కాకుండా పోయేలా ఉందని సుభాష్ అంటాడు. ఈ వయసులో మాకు కష్టాలు, కన్నీళ్లు అవసరమా అని రాజ్‌ను అడుగుతాడు. నాకు నా భార్య కావాలని అంటాడు. జీవితాంతం తోడు ఉండాల్సిన భార్యను ఎవరికోసం దూరం చేసుకోనని రాజ్‌తో ఖరాఖండిగా చెబుతాడు సుభాష్.
తండ్రికి మాటిచ్చిన రాజ్...
రేపటికల్లా అమ్మను ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది అని తండ్రికి మాటిస్తాడు రాజ్. కావ్య రాకుండా మీ అమ్మ ఇంటికి రానని అంటుందిగా అని ఇందిరాదేవి అంటుంది. కావ్య ఎప్పటికి ఈ ఇంటికి రాదు...కానీ అమ్మ మాత్రం తిరిగి ఇంటికి వస్తుంది...వచ్చేలా నేను చేస్తానని రాజ్ అంటాడు.
క్రిమినల్ బ్రెయిన్...
కావ్య ఇంట్లో అడుగుపెడుతూనే అత్తయ్య అని కోపంగా అరుస్తుంది. ఎందుకు అలా అరిచావని కనకం అంటుంది. మా అత్తయ్య చేసిన పని వెనుక నీ క్రిమినల్ బ్రెయిన్ ఉందా అని తల్లిపై కావ్య ఫైర్ అవుతుంది. నేను ఏ తప్పు చేయలేదని కనకం అంటుంది.
ఏదైనా ఉంటే సూటిగా నన్నే అడుగు కావ్యతో అంటుంది అపర్ణ. మీరు మావయ్యకు విడాకుల నోటీసులు పంపించేయడం ఏంటి...ఏమైంది మీకు అని అపర్ణను అడుగుతుంది కావ్య. మీరు తీసుకున్న ఈ నిర్ణయం వెనుకు మా అమ్మ హస్తం ఉందా అని అనుమానంగా అడుగుతుంది కావ్య. కూతురు మాటలకు కనకం వణికిపోతుంది.
నా స్వంత నిర్ణయం...
ఇది నా స్వంత విషయం...స్వతంత్రంగా నేను తీసుకున్న నిర్ణయం...ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అపర్ణ బదులిస్తుంది. అసలు మీకు బుర్ర పనిచేస్తుందా...హాస్పిటల్ తీసుకెళ్లమంటారా అంటూ అపర్ణతో అంటుంది కావ్య. కూతురి మాటలకు కనకం కంగారు పడుతుంది.
రాజ్ ఇప్పటికే బండరాయిలా తయారయ్యాడని, మీకు అతడికి తేడా లేకుండా పోతుందని అపర్ణతో అంటుంది కావ్య. ఆ బండరాయిని కరిగించడానికి ఈ నోటీసులు పంపించానని కావ్యతో అంటుంది అపర్ణ. నీ భర్తకు బుద్ది రావాలనే ఇదంతా చేశానని చెబుతుంది.
ఓ అడుగు ముందే ఉంటా...
రాజ్‌కు బుద్ధి చెప్పడానికి ఇదే దారి దొరికిందా...మీ అబ్బాయి ఆడే తైతక్కల గురించి మీకు తెలియదు. అనుకున్నది జరగడానికి ఎంత దూరమైన రాజ్ వెళతాడని కావ్య అంటుంది. రాజ్ ఎంత దూరం వెళ్లినా అతడి కంటే ఓ అడుగు ముందే ఉంటానని అపర్ణ బదులిస్తుంది.
నా కాపురం చక్కదిద్దడం కోసం మీ సంసారంలో కలతలు కొనితెచ్చుకోవద్దని, నన్ను వదిలేయమని అపర్ణతో చెబుతూ ఎమోషనల్ అవుతుంది. మీ కొడుకు దిగొస్తే దిగస్తాడు. లేదంటే నా ఖర్మ ఇంతే అనుకొని బతికేస్తానని కావ్య అంటుంది.
అపర్ణ సూట్‌కేస్ సర్ధి తీసుకురమ్మని తల్లికి ఆర్డర్ వేస్తుంది కావ్య. ఎందుకు అని అపర్ణ అనగానే...మీరు మా ఇంట్లో ఉండొద్దు...వెంటనే మీ ఇంటికి వెళ్లిపొమ్మని అపర్ణతో ఖరాఖండిగా చెప్పేస్తుంది కావ్య.
ఆస్తిలో వాటా...
కళ్యాణ్‌కు ఆస్తిలో వాటా వెంటనే రాసివ్వకపోతే తాను ప్రాణం తీసుకుంటానని బెదిరిస్తుంది ధాన్యలక్ష్మి. ఉరి వేసుకోబోతుంది. ఆ గొడవలు చూసి సీతారామయ్య తట్టుకోలేకపోతాడు. గుండెనొప్పితో విలవిలలాడుతూ కిందపడిపోతాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.