Deepika Padukone: త‌ల్ల‌యిన క‌ల్కి హీరోయిన్ - పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన దీపికా ప‌దుకోణ్‌-bollywood couple ranveer singh deepika padukone blessed with a baby girl ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Deepika Padukone: త‌ల్ల‌యిన క‌ల్కి హీరోయిన్ - పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన దీపికా ప‌దుకోణ్‌

Deepika Padukone: త‌ల్ల‌యిన క‌ల్కి హీరోయిన్ - పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన దీపికా ప‌దుకోణ్‌

Nelki Naresh Kumar HT Telugu
Sep 08, 2024 02:11 PM IST

Deepika Padukone: బాలీవుడ్ హీరోయిన్ దీపికా ప‌దుకోణ్ త‌ల్ల‌యింది. ఆదివారం ఉద‌యం పండ‌టి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. త‌ల్లిదండ్రులుగా మారిన ర‌ణ్‌వీర్‌సింగ్‌, దీపికా ప‌దుకోణ్‌ల‌కు సినీ ప్ర‌ముఖుల‌తో పాటు అభిమానులు శుభాకాంక్ష‌లు అంద‌జేస్తున్నారు.

ర‌ణ్‌వీర్ సింగ్‌, దీపికా ప‌దుకోణ్
ర‌ణ్‌వీర్ సింగ్‌, దీపికా ప‌దుకోణ్

Deepika Padukone: బాలీవుడ్ క‌పుల్ ర‌ణ్‌వీర్ సింగ్‌, దీపికా ప‌దుకోణ్ త‌మ‌ అభిమానుల‌కు గుడ్‌న్యూస్ వినిపించారు. దీపికా ప‌దుకోణ్ త‌ల్ల‌యింది. ఆదివారం ఉద‌యం పండ‌ంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. త‌ల్లీబిడ్డా ఇద్ద‌రు క్షేమంగా ఉన్న‌ట్లు తెలిసింది. డెలివ‌రీ కోసం శనివారం సాయంత్రం ముంబయిలోని హెచ్‌ఎన్ రిలయన్స్ హాస్పిట‌ల్‌కు దీపికాను తీసుకొని ర‌ణ్‌వీర్‌సింగ్ వ‌చ్చాడు. బేబీ బంప్‌తో దీపికా క‌నిపించిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

వినాయ‌క‌చ‌వితి త‌ర్వాత రోజే...

వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా శుక్రవారం ముంబైలోని సిద్ధివినాయక ఆలయంలో ర‌ణ‌వీర్‌సింగ్‌, దీపికా ప‌దుకోణ్ పూజ‌లు నిర్వ‌హించారు. వినాయ‌క‌చ‌వితి త‌ర్వాత రోజే ఈ బాలీవుడ్ జంట జీవితంలోకి లిటిల్ ప్రిన్సెస్ వ‌చ్చింది. త‌ల్లిదండ్రులుగా మారిన‌ ర‌ణ్‌వీర్‌సింగ్‌, దీపికాల‌కు బాలీవుడ్ సినీ ప్ర‌ముఖుల‌తో పాటు అభిమానులు శుభాకాంక్ష‌లు చెబుతోన్నారు.

ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో...

ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో తాము త‌ల్లిదండ్రులు కాబోతున్న‌ట్లు ర‌ణ్‌వీర్‌సింగ్‌, దీపికా ప‌దుకోణ్ ప్ర‌క‌టించారు. సెప్టెంబర్ 2024 అంటూ త‌మ జీవితంలోకి ఓ చిన్నారి రాబోతున్న విష‌యాన్ని భ‌ర్త‌తో క‌లిసి అభిమానుల‌తో పంచుకున్న‌ది దీపికా ప‌దుకోణ్. చిన్నారి డ్రెస్‌, షూస్‌తో అలంక‌రించిన ఓ ఫొటోను పోస్ట్ చేసింది.

ఆరేళ్ల త‌ర్వాత‌...

ర‌ణ్‌వీర్‌సింగ్‌, దీపికా ప‌దుకోణ్ 2018లో పెళ్లిపీట‌లెక్కారు. ఇటలీలో డెస్టినేష‌న్ వెడ్డింగ్ చేసుకున్నారు. పెళ్ల‌యిన ఆరేళ్ల త‌ర్వాత ఈ బాలీవుడ్ జోడీ త‌ల్లిదండ్రులుగా మారారు. త‌మ కూతురితో క‌లిసి త్వ‌ర‌లోనే కొత్త ఇంటిలోకి ర‌ణ్‌వీర్‌, దీపికా షిప్ట్ కానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తోన్నాయి. షారుఖ్‌ఖాన్ మ‌న్న‌త్ ప‌క్క‌నే దాదాపు 119 కోట్ల‌తో ల‌గ్జ‌రీయ‌స్ అపార్ట్‌మెంట్‌నుఇటీవ‌లే ర‌ణ్‌వీర్‌, దీపికా కొనుగోలు చేసిన‌ట్లు స‌మాచారం. 16 నుంచి 19వ ఫ్లోర్ వ‌ర‌కు మొత్తం మూడు ఫ్లోర్ల‌ను త‌మ అభిరుచుల‌కు త‌గ్గ‌ట్లుగా రిచ్‌గా డిజైన్ చేసుకున్న‌ట్లు స‌మాచారం.

క‌ల్కితో...

ప్ర‌స్తుతం ర‌ణ్‌వీర్‌సింగ్‌, దీపికా ప‌దుకోణ్ ఇద్ద‌రు ప‌లు పాన్ ఇండియ‌న్ సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ప్ర‌భాస్ క‌ల్కి మూవీతో ఈ ఏడాది టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది దీపికా ప‌దుకోణ్‌. సైన్స్ ఫిక్ష‌న్ యాక్ష‌న్ మూవీలో త‌న బిడ్డ కోసం ఆరాట‌ప‌డే త‌ల్లి పాత్ర‌లో అస‌మాన న‌ట‌న‌ను క‌న‌బ‌రిచింది. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ 1150 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ప్ర‌స్తుతం క‌ల్కి సీక్వెల్‌లో దీపికా ప‌దుకోణ్ న‌టిస్తోంది.

మాతృత్వ బంధం కార‌ణంగా...

మాతృత్వ బంధం కార‌ణంగా వ‌చ్చే ఏడాది మార్చి వ‌ర‌కు సినిమా షూటింగ్‌ల‌కు దీపికా ప‌దుకోణ్ బ్రేక్ తీసుకోనున్న‌ట్లు స‌మాచారం. ఆ త‌ర్వాతే ఆమె షూటింగ్‌ల‌లో పాల్గొనే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

మ‌రోవైపు ర‌ణ్‌వీర్‌సింగ్ ప్ర‌స్తుతం సింగ్ అగైన్ సినిమా చేస్తోన్నాడు. ఈ యాక్ష‌న్ మూవీలో ర‌ణ్‌వీర్‌సింగ్‌తో పాటు అక్ష‌య్‌కుమార్‌, అజ‌య్‌దేవ్‌గ‌ణ్ న‌టిస్తోన్నారు.