Bollywood Actor: 200 సినిమాల్ని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ నటుడు - సూపర్‌స్టార్ కావాల్సినోడు .. సీరియల్స్ చేస్తోన్నాడు
Bollywood Actor: బాలీవుడ్ నటుడు సుదేశ్ బెర్రీ సుదీర్ఘ కెరీర్‌లో 200లకుపైగా సినిమాలు వదులుకున్నాడు. అతడు రిజెక్ట్ చేసిన సినిమాలు అమీర్‌ఖాన్, షారుఖ్‌ఖాన్‌లకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
Bollywood Actor: సినీ పరిశ్రమలో టాలెంట్ ఒక్కటే సరిపోదు. కొన్నిసార్లు అదృష్టం కూడా కలిసిరావాలి. ఎంతో టాలెంట్ ఉండి కూడా లక్ కలిసిరాక తెరమరుగైన నటులు చాలా మందే ఇండస్ట్రీలో కనిపిస్తారు. అలాంటి వారిలో బాలీవుడ్ నటుడు సుదేశ్ బెర్రీ ఒకరు.
గాయల్ మూవీతో పేరుప్రఖ్యాతులు...
1980-90దశకంలో బాలీవుడ్‌లో పలు విజయవంతమైన సినిమాల్లో నటించాడు సుదేశ్ బెర్రీ. వైవిధ్యమైన పాత్రలతో విలక్షణ నటుడిగా ప్రేక్షకుల మన్ననల్ని అందుకున్నాడు. 1988లో రిలీజైన ఖత్రోంకి ఖిలాడి మూవీతో సుదేశ్ బెర్రీ కెరీర్ ప్రారంభమైంది సన్నీ డియోల్ హీరోగా నటించిన గాయల్ మూవీతో నటుడిగా బాలీవుడ్‌లో మంచి పేరును సొంతం చేసుకున్నాడు సుదేష్.
200 సినిమాలు రిజెక్ట్...
గాయల్ సినిమాలో తన నటనతో బాలీవుడ్ వర్గాల దృష్టిని ఆకర్షించాడు సుదేశ్. గాయల్ హిట్‌తో సుదేష్‌కు హీరోగా చాలా అవకాశాలు వచ్చాయి. కానీ స్క్రిప్ట్ సెలెక్షన్స్‌లో మొదటి మూవీ నుంచి సెలెక్టివ్‌గా ఉన్న సుదేష్ బెర్రీ కథలు, క్యారెక్టర్స్ నచ్చక ఎన్నో సినిమాలను వదలుకున్నాడు. కెరీర్ మొత్తంలో ఆయన వదులుకున్న సినిమాల సంఖ్య 200లకుపైనే ఉన్నాయట. ఈ విషయాన్ని సుదేష్ బెర్రీ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పడు.
డర్‌లో షారుఖ్ కంటే ముందు...
సుదేశ్ బెర్రీ వదులుకున్న సినిమాలతోనే షారుఖ్‌ఖాన్, అమీర్‌ఖాన్, అజయ్ దేవ్‌గణ్ వంటి హీరోలు స్టార్‌డమ్‌ను సంపాదించుకోవడం గమనార్హం. డర్ మూవీలో సుదేష్ బెర్రీ హీరోగా సెలెక్ట్ చేశారు డైరెక్టర్ యశ్ చోప్రా. స్క్రీన్ టెస్ట్ కూడా చేశారు. కానీ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్ చేయడం ఇష్టం లేక ఈ మూవీని సుదేశ్ బెర్రీ రిజెక్ట్ చేశాడు. సుదేశ్ బెర్రీ రిజెక్ట్ చేసిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. షారుఖ్‌ఖాన్‌కు హీరోగా ఎనలేని పేరును తీసుకొచ్చింది. పలు సినిమా హిట్ మూవీస్‌లో అవకాశం వచ్చిన నటించలేకపోయాడు సుదేశ్.
మూడేళ్లుగా బాలీవుడ్‌కు దూరం...
35 ఏళ్ల కెరీర్‌లో అతడు చేసిన సినిమాలకంటే రిజెక్ట్ చేసిన మూవీస్ ఎక్కువగా ఉన్నాయి. బోర్డర్, ఎల్‌వోసీ, బోర్డర్ హిందుస్థాన్ కా సినిమాల్లో అసమాన నటనతో ఆకట్టుకున్నాడు. కొత్త తరం నటుల రాకతో పోటీ పెరిగి సుదేశ్ బెర్రీకి సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. గత మూడేళ్లుగా బాలీవుడ్‌కు దూరంగా ఉంటున్నాడు సుదేశ్ బెర్రీ. 2021లో రిలీజైన రాజ్‌నందిని మూవీతో చివరగా బాలీవుడ్ ప్రేక్షకులకు కనిపించాడు సుదేశ్ బెర్రీ.
25 సీరియల్స్...
ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే సీరియల్స్‌పై ఫోకస్ పెట్టాడు సుదేశ్. మహాభారత్ సీరియల్‌లో విచిత్రవీర్య పాత్ర చేశాడు. ఈ పాత్ర మంచి పేరుతెచ్చిపెట్టడంతో బుల్లితెరపై మాత్రం సూపర్‌స్టార్‌గా నిలిచాడు. ముప్పైకి పైగా సీరియల్స్‌లో విలన్‌గా, సహాయక పాత్రల్లో నటించాడు. ప్రస్తుతం హిందీలో టెలికాస్ట్ అవుతోన్న పూర్ణిమ సీరియల్‌లో సుదేశ్ కీలక పాత్ర చేస్తోన్నాడు.