Bigg Boss Elimination: ఈ వారం మళ్లీ ఎలిమినేషన్‌లో కన్ఫ్యూజన్.. ఆ ముగ్గురిలో ఒకరు అవుట్.. ఓటింగ్‌లో ఇప్పటికీ ఆమెనే టాప్!-bigg boss telugu 8 eight week elimination gangavva mehaboob nayani confusion in bigg boss 8 telugu elimination this week ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Elimination: ఈ వారం మళ్లీ ఎలిమినేషన్‌లో కన్ఫ్యూజన్.. ఆ ముగ్గురిలో ఒకరు అవుట్.. ఓటింగ్‌లో ఇప్పటికీ ఆమెనే టాప్!

Bigg Boss Elimination: ఈ వారం మళ్లీ ఎలిమినేషన్‌లో కన్ఫ్యూజన్.. ఆ ముగ్గురిలో ఒకరు అవుట్.. ఓటింగ్‌లో ఇప్పటికీ ఆమెనే టాప్!

Sanjiv Kumar HT Telugu
Oct 25, 2024 06:56 AM IST

Bigg Boss Telugu 8 Elimination Eight Week: బిగ్ బాస్ తెలుగు 8 ఎనిమిదో వారం ఎలిమినేషన్‌లో మళ్లీ కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. డేంజర్ జోన్‌లో ముగ్గురు ఉంటే వారిలో ఎవరు ఎలిమినేట్ కానున్నారనేది ఎవరు ఊహించనివిధంగా మారింది. అలాగే, బిగ్ బాస్ తెలుగు 8 ఓటింగ్‌లో ఆ లేడి కంటెస్టెంటే టాప్‌లో దంచికొడుతోంది.

ఈ వారం మళ్లీ ఎలిమినేషన్‌లో కన్ఫ్యూజన్.. ఆ ముగ్గురిలో ఒకరు అవుట్.. ఓటింగ్‌లో ఇప్పటికీ ఆమెనే టాప్!
ఈ వారం మళ్లీ ఎలిమినేషన్‌లో కన్ఫ్యూజన్.. ఆ ముగ్గురిలో ఒకరు అవుట్.. ఓటింగ్‌లో ఇప్పటికీ ఆమెనే టాప్!

Bigg Boss Telugu 8 Elimination This Week: బిగ్ బాస్ తెలుగు 8 ఎనిమిదో వారానికి చేరుకుంది. ఎప్పటిలాగే ఈ వారం కూడా ఒకరు ఎలిమినేట్ కానున్నారు. అయితే, బిగ్ బాస్ 8 తెలుగు ఏడో వారం ఎలిమినేషన్ లాగానే ఈ వారం కూడా ఎవిక్షన్‌లో కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్న విషయం ఎవరు ఊహించని విధంగా ఉంది.

నామినేషన్స్‌లో ఆరుగురు

బిగ్ బాస్ తెలుగు 8 ఎనిమిదో వారం ఆరుగురు ఇంటి సభ్యులు నామినేట్ అయిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ 8 తెలుగు ఎనిమిదో వారం నామినేషన్స్‌లో నిఖిల్, విష్ణుప్రియ, పృథ్వీ, ప్రేరణ, నయని పావని, మెహబూబ్ ఉన్నారు. వీరికి నామినేషన్స్ పూర్తయినప్పటి నుంచే ఓటింగ్ పోల్స్ తెరుచుకున్నాయి. దాంతో ఎవరి ఫ్యాన్స్ వారికి గట్టిగానే ఓట్లు వేస్తున్నారు.

ఓటింగ్ టాప్‌లో ప్రేరణ

అయితే, బిగ్ బాస్ తెలుగు 8 ఎనిమిదో వారం నామినేషన్స్ ఓటింగ్ ఫలితాల్లో లేడి కంటెస్టెంట్ ప్రేరణనే టాప్‌లో దంచికొడుతోంది. మొదటి రోజు నుంచి ఇప్పటివరకు ప్రేరణ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. టైటిల్ విన్నర్ మెటీరియల్ నిఖిల్ దాటేసి మరి టాప్‌లో ఉంటోంది ప్రేరణ.

ఎవరికి ఎంత ఓటింగ్

ప్రేరణకు 29.15 శాతం ఓటింగ్ (4,821 ఓట్లు) నమోదు అయింది. తర్వాత రెండో స్థానంలో నిఖిల్ 26.29 శాతం ఓటింగ్, 4,431 ఓట్లు సంపాదించుకున్నాడు. 13.26 శాతం ఓటింగ్, 2,192 ఓట్లతో మూడో స్థానంలో పృథ్వీ ఉన్నాడు. ఇక నాలుగో స్థానంలో విష్ణుప్రియ 11.98 శాతం ఓటింగ్ (1,981 ఓట్లు)తో నిలిచింది. అయితే, పృథ్వీ, విష్ణుప్రియ స్థానాలు మారుతున్నాయి.

డేంజర్ జోన్‌లో ఇద్దరు

ఒక్కోసారి మూడో స్థానంలో విష్ణుప్రియ ఉంటే.. నాలుగో స్థానంలో పృథ్వీ ఉంటున్నాడు. ఇక ఐదు, ఆరు స్థానాల్లో మెహబూబ్, నయని పావని వరుసగా ఉన్నారు. మెహబూబ్‌కు 9.46 శాతం ఓటింగ్ (1,565 ఓట్లు) వస్తే నయనికి 9.35 శాతం ఓటింగ్ (1,547 ఓట్లు) నమోదు అయింది. ఈ లెక్కల ప్రకారం స్వల్ప ఓట్ల తేడాతో డేంజర్ జోన్‌లో మెహబూబ్, నయని పావని ఉన్నారు.

యానిమల్ యాక్ట్ కేసు

అలాగే, ఈ మధ్య విపరీతమైన నెగెటివిటీ తెచ్చుకున్న పృథ్వీ కూడా దాదాపుగా డేంజర్‌ జోన్‌లో ఉన్నట్లే కనిపిస్తున్నాడు. కానీ, పృథ్వీ హౌజ్‌లో ఉండటం ఇంపార్టెంట్ అని భావించినా బిగ్ బాస్ టీమ్ అతన్నీ తీసేసే అవకాశం లేదు. కానీ, ఇటీవల గంగవ్వపై యానిమల్ యాక్ట్ కింద కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గంగవ్వను అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

ముగ్గురిలో ఒకరు అవుట్

కాబట్టి, ఈ వారం గంగవ్వ కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇలా బిగ్ బాస్ తెలుగు 8 ఎలిమినేషన్‌లో గతం వారం లాగే కన్ఫ్యూజన్ ఏర్పడింది. మెహబూబ్, నయనికి స్వల్ప ఓటింగ్ తేడా మాత్రమే ఉంది. కాబట్టి, చివరన ఎవరు ఉంటారో చెప్పలేం. అలాగే, వీళ్లిద్దరిలో ఒకరు కాకుండా గంగవ్వ కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏది ఏమైనా ఈ ముగ్గురిలో మాత్రం ఒకరు ఎలిమినేట్ అయి హౌజ్ నుంచి అవుట్ కానున్నారని తెలుస్తోంది.

Whats_app_banner