Sivaji 90s Web series Teaser: మధ్య తరగతి కష్టాల్లో శివాజీ.. నవ్వించేలా ‘నైంటీస్’ వెబ్ సిరీస్ టీజర్-bigg boss sivaji starrer 90s middle class biopic teaser release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sivaji 90s Web Series Teaser: మధ్య తరగతి కష్టాల్లో శివాజీ.. నవ్వించేలా ‘నైంటీస్’ వెబ్ సిరీస్ టీజర్

Sivaji 90s Web series Teaser: మధ్య తరగతి కష్టాల్లో శివాజీ.. నవ్వించేలా ‘నైంటీస్’ వెబ్ సిరీస్ టీజర్

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 01, 2023 05:40 PM IST

Sivaji 90s Web series Teaser: ‘నైంటీస్’ వెబ్ సిరీస్ టీజర్ వచ్చేసింది. శివాజీ ఈ సిరీస్‍లో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. నవ్వించేలా, 1990 దశకం జ్ఞాపకాలను గుర్తు చేసేలా ఈ టీజర్ ఉంది.

Sivaji 90s Web series Teaser: మధ్య తరగతి కష్టాల్లో శివాజీ.. నవ్వించేలా ‘నైంటీస్’ వెబ్ సిరీస్ టీజర్
Sivaji 90s Web series Teaser: మధ్య తరగతి కష్టాల్లో శివాజీ.. నవ్వించేలా ‘నైంటీస్’ వెబ్ సిరీస్ టీజర్

Sivaji 90s Web series Teaser: సీనియర్ నటుడు, బిగ్‍బాస్‍ కంటెస్టెంట్ శివాజీ ప్రధాన పాత్రలో ‘నైంటీస్’ వెబ్ సిరీస్ రానుంది. ఓ మిడిల్ క్లాస్ బయోపిక్ అనేది ఈ సిరీస్ ట్యాగ్ లైన్‍. ఈ సిరీస్‍తో ఓటీటీలోకి శివాజీ అడుగుపెడుతున్నారు. 1990ల బ్యాక్‍డ్రాప్‍లో.. అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసేలా.. మధ్య తరగతి కుటుంబ పరిస్థితులను కళ్లకు కట్టేలా ఈ సిరీస్ ఉండనుంది. పవన్ కల్యాణ్ ‘తొలిప్రేమ’ సినిమాలో చెల్లెలిగా నటించిన వాసుకీ ఆనంద్ ఈ సిరీస్‍లో శివాజీ భార్య పాత్ర చేస్తున్నారు. నేడు (నవంబర్ 1) ఈ ‘నైంటీస్’ వెబ్ సిరీస్ టీజర్ వచ్చింది.

నైంటీస్ వెబ్ సిరీస్ టీజర్‌ను ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ నేడు రిలీజ్ చేసింది. మధ్య తరగతి కుటుంబ బాధ్యతలు మోసే శేఖర్ అనే ఉపాధ్యాయుడిగా ఈ వెబ్ సిరీస్‍లో శివాజీ నటించారు. ఆయన భార్య పాత్రను వాసుకి పోషించారు. ఈ టీజర్ ఆద్యంతం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పరిస్థితులను సరదాగా చూపించారు మేకర్స్. పిల్లల మార్కుల పట్ల శివాజీ అసంతృప్తి వ్యక్తం చేస్తారు. “ఈ నెల మీ అక్క గృహ ప్రవేశం ఉందా.. ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా. చీటి డబ్బులు ఈ నెల కట్టాలి.. చిన్నోడికి సైకిల్ కొనాలి” అంటూ శేఖర్ (శివాజీ)కు కుటుంబ అవసరాలను వాసుకి చెబుతారు. కోపంలో ఓ దశలో వంట పాత్రను విసిరేస్తారు. లుంగీ, కాస్త చిరిగిన బినియన్ వేసుకొని శివాజీ.. పక్కా మిడిల్ క్లాస్ మెన్‍గా కనిపించారు.

శేఖర్ పిల్లల చదువులు, కుటుంబ పరిస్థితులు ఇలా టీజర్ ఆసాంతం సరదాగా సాగింది. 1990ల్లోని మధ్య తరగతి కుటుంబ పరిస్థితులను ఈ సిరీస్‍లో చూపించబోతున్నట్టు అర్థమవుతోంది. వచ్చే ఏడాది (2024) జనవరి 5వ తేదీన ‘నైంటీస్’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు రానుంది. “మ్యాథ్స్ టీచర్.. టిఫిన్ బాక్స్.. మీ నైంటీస్ మొమరీస్ మళ్లీ కలుసుకోవడానికి మీ ముందుకు నైంటీస్ వెబ్ సిరీస్ తీసుకొస్తున్నాం” అని ఈటీవీ విన్ పేర్కొంది.

నైంటీస్ వెబ్ సిరీస్‍లో శివాజీ, వాసుకీ ఆనంద్‍తో పాటు వసంతిక, రోహన్, స్నేహల్ కామత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఆదిత్య హసన్ ఈ సిరీస్‍కు దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ మేడారం, రాజశేఖర్ మేడారం ఈ సిరీస్‍ను నిర్మిస్తున్నారు. సురేశ్ బొబ్బిలి సంగీతం అందిస్తుండగా.. అజీమ్ మహమ్మద్ సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు.

IPL_Entry_Point