Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్‌కు షాక్ ఇచ్చిన కోర్టు.. మరో 16 మంది అరెస్ట్, అందులో నలుగురు మైనర్లు
Pallavi Prashanth Nampally Court: బిగ్ బాస్ 7 తెలుగు విన్నర్ పల్లవి ప్రశాంత్‌కు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. అంతేకాకుండా ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో మరో 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో నలుగురు మైనర్లు ఉన్నారు.
Pallavi Prashanth Bail: బిగ్ బాస్ 7 తెలుగు విజేత పల్లవి ప్రశాంత్ కేసులో మలుపు చోటుచేసుకుంది. దీంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. డిసెంబర్ 17న అంటే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే నిర్వహించిన రోజున జరిగిన అల్లర్ల నేపథ్యంలో పల్లవి ప్రశాంత్, అతని సోదురుడు మహావీర్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
గజ్వేల్‌లోని కొల్లూరులో వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసం కేసులో పల్లవి ప్రశాంత్, అతని సోదురుడు మహావీర్‌కు 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమార్తి. దీంతో వారిద్దరిని చంచల్ గూడా జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో తాజాగా పల్లవి ప్రశాంత్‌కు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది.
తనకు బెయిల్ మంజూరు చేయాలంటి పల్లవి ప్రశాంత్ పిటిషన్ దాఖలు చేశాడు. కానీ, అందుకు నాంపల్లి కోర్టు అంగీకరించలేదు. ప్రశాంత్ బెయిల్ మంజూరు పిటిషన్‌పై తీర్పును రేపటికి వాయిదా వేసింది. దీంతో ప్రశాంత్ ఇంకా జైలుగా ఖైదీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అలాగే అల్లర్లలో భాగంగా ఆర్టీసీ బస్సులు, పోలీసు వాహనాలపై దాడికి పాల్పడిన వారిలో మరో 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో 12 మంది మేజర్లు ఉంటే.. నలుగురు మైనర్లు ఉన్నారు. వీరిని కూడా కోర్టులో పోలీసులు హాజరుపర్చనున్నారు. ఇప్పటికే ఈ కేసులో ప్రశాంత్, మహావీర్, వినయ్, డ్రైవర్స్ సాయికిరణ్, రాజ్‍కు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.