Sivaji Elimination: హీరో శివాజీ సెల్ఫ్ ఎలిమినేషన్.. బాధ భరించలేకపోతున్నానంటూ ఆవేదన-bigg boss 7 telugu sivaji self elimination due to health issues ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sivaji Elimination: హీరో శివాజీ సెల్ఫ్ ఎలిమినేషన్.. బాధ భరించలేకపోతున్నానంటూ ఆవేదన

Sivaji Elimination: హీరో శివాజీ సెల్ఫ్ ఎలిమినేషన్.. బాధ భరించలేకపోతున్నానంటూ ఆవేదన

Sanjiv Kumar HT Telugu
Oct 21, 2023 06:33 AM IST

Bigg Boss 7 Telugu Sivaji Elimination: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‌లో స్ట్రాంగ్ అండ్ విన్నర్ మెటేరియల్‌గా హీరో శివాజీ పేరు తెచ్చుకున్నారు. కానీ, తాజా ఎపిసోడ్‌లో ఆయన మాట్లాడిన మాటలు, బిగ్ బాస్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం శివాజీ ఎలిమినేట్ కానున్నాడని టాక్.

బిగ్ బాస్ 7 తెలుగు హీరో శివాజీ ఎలిమినేషన్
బిగ్ బాస్ 7 తెలుగు హీరో శివాజీ ఎలిమినేషన్

Bigg Boss 7 Telugu October 20th Episode: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‌లో ప్రస్తుతం ఏడో వారం కెప్టెన్సీ టాస్క్ కంటెండర్ పోటీ జరుగుతోంది. ఇందులో ఫైనల్‌లోకి ఆట సందీప్, అర్జున్ అంబటి వెళ్లారు. ఆ విషయాన్ని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. అనంతరం అనారోగ్యంగా ఉన్న శివాజీని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచాడు బిగ్ బాస్. అక్కడ తన ఆవేదన చెప్పుకుంటూ శివాజీ కన్నీటి పర్యంతం అయ్యాడు.

అర్థం కావడం లేదు

ఎలా ఉన్నారు శివాజీ అని బిగ్ బాస్ అడిగాడు. బాలేదు బిగ్ బాస్. "ఈ బాధను భరించలేకపోతున్నాను. నా బాధను ఎవరితోనూ చెప్పుకోలేకపోతున్నాను. నేను టైగర్‌ని, ఎవరికీ భయపడను. కొండనైనా ఢీ కొడతా. ఉంటే ఉంటే పోతే పోతా. కానీ, ఈ చేయితో నేను ఆటకు న్యాయం చేయలేకపోతున్నాను. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నేను చాలా ఆశలతో వచ్చాను. ఈ గాయం తగ్గాలంటే టైమ్ పడుతుంది. నాకు తెలిసిపోతుంది. నా బాడీ నాకు సపోర్ట్ చేయడం లేదు" అని శివాజీ తెలిపాడు.

ఏడవలేకపోతున్నాను

"నోరు ఉంది. దానితో భయపెట్టొచ్చు. కానీ, అది కరెక్ట్ కాదు. ఆడితేనే ఆడియెన్స్ రెస్పెక్ట్ చేస్తారు. గౌతమ్ అన్నట్లుగా నేను లేకపోతే వేరే వాళ్లకు అవకాశం వస్తుందనేది నిజం. నాకు తెలుసు. నేను ఇక్కడ ఉంటే కప్పు కొడతా. కప్పు కొడదామనే వచ్చాను. కానీ డెస్టినీ కలిసిరావడం లేదు. ఆరోగ్యం సహకరించడం లేదు. కాబట్టిన నేను వెళ్లిపోతాను బిగ్ బాస్. వీళ్లందరి ముందు ఏడవలేకపోతున్నాను. ఏడుస్తూ జనం ముందు నేను ఆడలేను. నాకు ఇప్పుడు కూడా చాలా పెయిన్ ఉంది. కానీ, నటిస్తున్నా. ఇక నేను ఉండలేను బిగ్ బాస్ పంపించేయండి" అని శివాజీ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

గంగవ్వ తరహాలో

శివాజీ మాటలకు మరోసారి డాక్టర్‌ని సంప్రదించి అప్పుడు నిర్ణయం తీసుకుంటాం. అప్పటివరకు కంగారు పడకండి. ధైర్యంగా, జాగ్రత్తగా ఉండండి అని బిగ్ బాస్ చెప్పాడు. అయితే, గాయం కారణంగా శివాజీ సెల్ఫ్ ఎలిమినేట్ అయి వెళ్లిపోతున్నట్లు బిగ్ బాస్ వర్గాల నుంచి ఓ సమాచారం వచ్చింది. ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్‌తోపాటు శివాజీని కూడా హౌజ్ నుంచి పంపించేయనున్నారట. ఇదివరకు సీజన్ 4లో అనారోగ్యం కారణంగా గంగవ్వను పంపించినట్లుగా శివాజీని కూడా పంపించేస్తారని తెలుస్తోంది.

Whats_app_banner