Bigg Boss Voting: ఓటింగ్‌లో మార్పులు.. తగ్గిన శివాజీ క్రేజ్.. బెస్ట్ ఫ్రెండ్స్‌లో ఒకరు ఎలిమినేట్-bigg boss 7 telugu 13th week voting and gautham or arjun will eliminate ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Voting: ఓటింగ్‌లో మార్పులు.. తగ్గిన శివాజీ క్రేజ్.. బెస్ట్ ఫ్రెండ్స్‌లో ఒకరు ఎలిమినేట్

Bigg Boss Voting: ఓటింగ్‌లో మార్పులు.. తగ్గిన శివాజీ క్రేజ్.. బెస్ట్ ఫ్రెండ్స్‌లో ఒకరు ఎలిమినేట్

Sanjiv Kumar HT Telugu
Nov 30, 2023 05:58 AM IST

Bigg Boss 7 Telugu Voting: బిగ్ బాస్ 7 తెలుగు 13వ వారం ఓటింగ్‌‌లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. టాప్ కంటెస్టెంట్స్ ఓట్స్ తన ఫ్రెండ్స్‌కి స్ల్పిట్స్ కానుండగా.. స్ట్రాంగ్ ప్లేయర్ ఎలిమినేట్ కానున్నారు.

బిగ్ బాస్ 7 తెలుగు 13వ వారం ఓటింగ్ ఫలితాలు
బిగ్ బాస్ 7 తెలుగు 13వ వారం ఓటింగ్ ఫలితాలు

Bigg Boss 7 Telugu 13th Week Elimination: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ ఫైనల్‌కు చేరుకోనుంది. ప్రస్తుతం హౌజ్‌లో టికెట్ టు ఫినాలే టాస్క్ జరుగుతోంది. ఇందులో టాప్‌లో అమర్ దీప్ చౌదరి ఉన్నాడు. ఈ రేస్ నుంచి శోభా శెట్టి, శివాజీ, ప్రియాంక్ ఔట్ అయి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే సోమవారం బిగ్ బాస్ 7 తెలుగు 13వ వారానికి సంబంధించిన నామినేషన్స్ జరిగాయి.

బిగ్ బాస్ 7 తెలుగు 13వ వారం నామినేషన్స్‌లలో పల్లవి ప్రశాంత్, శివాజీ, ప్రియాంక జైన్, అర్జున్ అంబటి, శోభా శెట్టి, గౌతమ్, ప్రిన్స్ యావర్ ఏడుగురు ఉన్నారు. ఒక అమర్ దీప్‌ను ఎవరు నామినేట్ చేయకపోవడంతో నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యాడు. అయితే, గత కొన్ని వారాలుగా ఓటింగ్‌లో అమర్ టాప్‌లో వస్తున్నాడు. ఇప్పుడు నామినేషన్స్‌లో లేకపోయేసరికి అమర్ ఓట్లు ప్రియాంక, శోభాకు పడుతున్నాయి.

ఫినాలే టాస్క్‌లో జరిగిన సంఘటనల కారణంగా ప్రియాంకకు గ్రాఫ్ పెరిగింది. అలాగే ప్రియాంక వల్ల అమర్‌కు నెగెటివిటీ ఏర్పడింది. దీంతో అమర్ ఫ్యాన్స్ తనతో ఎక్కువగా లోయల్‌గా ఉండే శోభాకు ఓట్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టాప్‌లో 30.23 శాతం ఓట్లతో పల్లవి ప్రశాంత్ ఉండగా 27.76 శాతం ఓటింగ్‌తో హీరో శివాజీ రెండో స్థానంలో ఉన్నాడు. ప్రిన్స్ యావర్ 13.98 శాతంతో మూడో స్థానంలో నిలిచాడు.

8.22 శాతంతో అర్జున్ నాలుగో స్థానం, 6.97 శాతంతో శోభా ఐదో స్థానం, 6.84 శాతంతో ప్రియాంక ఆరో స్థానం, 5.99 శాతంతో గౌతమ్ ఏడో స్థానంలో ఉన్నారు. అంటే, డేంజర్ జోన్‌లో అన్నా చెల్లెలు గౌతమ్ అండ్ ప్రియాంక ఉన్నారు. వీకెండ్ వచ్చేసరికి ప్రియాంకకు ఓట్లు పెరిగే అవకాశం ఉంది. కానీ, శివాజీతో గొడవ కారణంగా గౌతమ్, అలాగే అర్జున్‌కు ఓటు బ్యాంక్ తగ్గే పరిస్థితి ఉంది.

ప్రస్తుతం హౌజ్‌లో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కాబట్టి ఈవారం కచ్చితంగా మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. నిజానికి 13వ వారం డేంజర్ జోన్‌లో గౌతమ్ అండ్ అర్జున్ ఉన్నారు. ఈ ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్సే. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన అర్జున్ ఆట పరంగా బాగా పేరు తెచ్చుకున్నాడు. కానీ, ఇటీవల నామినేషన్లలో శివాజీతో గొడవ కారణంగా అతనికి నెగెటివిటీ అయింది.

ఒకవేళ అర్జున్ ఫినాలే ఆస్త్ర గెలిస్తే ఎలిమినేషన్ నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. ఇక బిగ్ బాస్ 7 తెలుగు 13వ వారం స్ట్రాంగ్ ప్లేయర్స్ అయిన గౌతమ్ లేదా అర్జున్ వీళ్లలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాగా వీళ్లిద్దరు హౌజ్‌లో మంచి బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్నారు. అర్జున్ వచ్చినప్పటి నుంచి వీరిద్దరు బాండింగ్ పెరిగింది. ఇప్పుడు ఈ బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ కావడం గమనార్హం.

Whats_app_banner