Bhola Shankar Review: భోళా శంక‌ర్ రివ్యూ - వేదాళం రీమేక్‌తో చిరంజీవి హిట్టు కొట్టాడా? మిస్ ఫైర్ అయ్యిందా?-bhola shankar review chiranjeevi meher ramesh vedalam remake review tamannaah keerthy suresh ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bhola Shankar Review: భోళా శంక‌ర్ రివ్యూ - వేదాళం రీమేక్‌తో చిరంజీవి హిట్టు కొట్టాడా? మిస్ ఫైర్ అయ్యిందా?

Bhola Shankar Review: భోళా శంక‌ర్ రివ్యూ - వేదాళం రీమేక్‌తో చిరంజీవి హిట్టు కొట్టాడా? మిస్ ఫైర్ అయ్యిందా?

HT Telugu Desk HT Telugu
Aug 11, 2023 12:30 PM IST

Bhola Shankar Review: చిరంజీవి హీరోగా న‌టించిన భోళాశంక‌ర్ మూవీ శుక్ర‌వారం (ఆగ‌స్ట్ 11న) భారీ అంచ‌నాతో పాటు వివాదాల న‌డుమ తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ ఎలా ఉందంటే

చిరంజీవి భోళాశంక‌ర్‌
చిరంజీవి భోళాశంక‌ర్‌

Bhola Shankar Review:సెకండ్ ఇన్నింగ్స్‌లో స్ట్రెయిట్ సినిమాల‌కంటే రీమేక్ క‌థ‌ల‌నే ఎక్కువ‌గా న‌మ్ముకుంటున్నాడు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)). ఖైదీ నంబ‌ర్ 150, లూసిఫ‌ర్ త‌ర్వాత చిరంజీవి న‌టించిన రీమేక్ మూవీ భోళాశంక‌ర్‌(Bhola shankar). త‌మిళంలో విజ‌య‌వంత‌మైన వేదాళం ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

అన్నాచెల్లెళ్ల అనుబంధం నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో చిరంజీవి సోద‌రి పాత్ర‌ను కీర్తిసురేష్ (Keerthy Suresh) పోషించ‌గా త‌మ‌న్నా(Tamannaah) హీరోయిన్‌గా న‌టించింది.భోళా శంక‌ర్ సినిమాను ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై అనిల్ సుంక‌ర నిర్మించాడు. ఈ శుక్ర‌వారం (ఆగ‌స్ట్ 11న) థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ ఎలా ఉంది? రీమేక్ క‌థ చిరంజీవికి హిట్టు తెచ్చిపెట్టిందా? లేదా? అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోని వెళ్లాల్సిందే...

శంక‌ర్ కథ‌...

శంక‌ర్ (చిరంజీవి) త‌న చెల్లెలు మ‌హాల‌క్ష్మి (కీర్తిసురేష్‌) చ‌దువు కోసం కోల్‌క‌తాకు వ‌స్తాడు. టాక్సీ డ్రైవ‌ర్‌గా ఉద్యోగం చేస్తూ మ‌హాల‌క్ష్మిని బాగా చ‌దివించాల‌ని క‌ల‌ల‌కంటాడు. మ‌హాల‌క్ష్మిని శ్రీక‌ర్ (సుశాంత్‌) అనే పైలెట్ ఇష్ట‌ప‌డ‌తాడు. చెల్లెలి ప్రేమ‌కు శంక‌ర్ కూడా గ్రీన్‌సిగ్న‌ల్ ఇస్తాడు. కోల్‌క‌తాలో ఓ గ్యాంగ్ అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తూ విదేశాల‌కు అమ్ముతుంటారు.

ఆ గ్యాంగ్ ఆచూకీని శంక‌ర్ పోలీసుల‌కు చేర‌వేస్తాడు. అత‌డిపై ప‌గ‌ను పెంచుకున్న గ్యాంగ్ మెంబ‌ర్ ఛోటు శంక‌ర్‌పై ఎటాక్ చేస్తాడు. ఛోటును శంక‌ర్ చంపేస్తాడు. ఎటాక్‌లో ఆ గ్యాంగ్‌ను వెతుక్కుంటూ శంక‌ర్ కోల్‌క‌తాను వ‌చ్చాడ‌నే నిజం బ‌య‌ట‌ప‌డుతుంది. ఛోటుతో పాటు అత‌డి అన్న ఛార్లెస్‌ను కూడా శంక‌ర్ చంపేస్తాడు? మ‌హాల‌క్ష్మి అస‌లు శంక‌ర్‌కు చెల్లెలు కాద‌ని తెలుస్తుంది. అస‌లు శంక‌ర్ ఎవ‌రు? మ‌హాల‌క్ష్మిని త‌న చెల్లెలిగా అంద‌రికి ఎందుకు ప‌రిచ‌యం చేశాడు? శంక‌ర్‌తో పాటు మ‌హాల‌క్ష్మి గ‌తం ఏమిటి?

హ్యూమ‌న్ ట్రాఫికింగ్ ముఠా మ‌హాల‌క్ష్మిని చంప‌డానికి ఎందుకు ప్ర‌య‌త్నించింది? త‌న త‌మ్ముళ్లు ఛార్లెస్‌, ఛోటుల‌ను చంపిన శంక‌ర్‌పై ప‌గ‌తో ర‌గిలిపోయిన గ్యాంగ్ లీడ‌ర్ అలెగ్జాండ‌ర్ (త‌రుణ్ ఆరోణా)... మ‌హాల‌క్ష్మికి ఎలాంటి అపాయం త‌ల‌పెట్టాడు? శంక‌ర్‌ను ఇష్ట‌ప‌డిన క్రిమిన‌ల్ లాయ‌ర్ లాస్య (త‌మ‌న్నా) ఎవ‌రు? అన్న‌దే భోళా శంక‌ర్(Bhola Shankar Review) సినిమా క‌థ‌.

చిరు కామెడీ టైమింగ్‌...

అన్నాచెల్లెళ్ల‌ అనుబంధానికి యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అంశాల‌ను జోడిస్తూ భోళాశంక‌ర్ సినిమాను తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేష్‌. త‌మిళ మాతృక వేదాళంలోని మెయిన్ స్టోరీలో పెద్ద‌గా మార్పులు చేయ‌కుండా చిరంజీవి ఇమేజ్‌కు త‌గ్గ‌ట్లుగా కొన్ని యాక్ష‌న్ అంశాలు, కామెడీ సీన్స్ చేర్చి రీమేక్‌ను తీర్చిదిద్దారు.

చిరులోని కామెడీ టైమింగ్‌, రైమింగ్‌ను వాడుకుంటూ పాస్ అయిపోవ‌చ్చున‌ని ద‌ర్శ‌కుడు భావించారు. క‌థ‌ను ఆయువుప‌ట్టుగా నిలిచే మెయిన్ పాయింట్ చాలా చిన్న‌దైపోవ‌డం, ఆ ఎమోష‌న్‌ను న‌డిపించే డ్రామా పూర్తిగా సాగ‌తీత వ్య‌వ‌హారంగా మార‌డంతో భోళాశంక‌ర్ (Bhola Shankar Review)ఆరంభం నుండే బ్రేకులు లేని బండిలా ఇష్టానుసారం ప‌రుగులు తీసింది.

ఔట్‌డేటెడ్‌...

అమ్మ‌యిల్ని కిడ్నాప్ చేసే ఓ ఇంట‌ర్‌నేష‌న‌ల్ గ్యాంగ్‌, వారిని ఎదురించి పోరాడే ఓ రౌడీ షీట‌ర్ అనే కాన్సెప్ట్ వేదాళం టైమ్‌లో కొత్త‌ది. ఆ త‌ర్వాత ఈ పాయింట్‌తో తెలుగు, త‌మిళంలో చాలా సినిమాలొచ్చాయి. భోళాశంక‌ర్(Bhola Shankar Review) టైమ్‌కు ఈ కాన్సెప్ట్ ఔట్‌డేటెడ్‌ అయిన ఫీలింగ్ క‌లిగింది. రొటీన్ పాయింట్‌ను కొత్త‌గా చెప్పేలా సీన్స్ రాసుకున్నా బాగుండేది. ఆ విష‌యంలో మెహ‌ర్ ర‌మేష్ విఫ‌ల‌మైపోయాడు. కామెడీ మొత్తం మిస్‌ఫైర్ అయ్యింది. క‌నీసం సింగిల్ సీన్ కూడా న‌వ్వించ‌లేక‌పోయింది. ఫ‌స్ట్ హాఫ్‌లో వెన్నెల‌కిషోర్ ట్రాక్‌, సెకండాఫ్‌లో చిరంజీవి, శ్రీముఖి కామెడీ సీన్స్‌ జ‌బ‌ర్ధ‌స్థ్ స్కిట్‌ల‌ను త‌ల‌పిస్తాయి.

యాక్ష‌న్ ఎపిసోడ్స్ మాత్ర‌మే...

శంక‌ర్‌, మ‌హాల‌క్ష్మి కోల్‌క‌తాలో అడుగుపెట్ట‌డంతోనే ఈ సినిమా మొద‌ల‌వుతుంది. ఆ త‌ర్వాత లాస్య‌, శ్రీక‌ర్ ఇలా ఒక్కో పాత్ర‌ను ప్ర‌వేశ‌పెడుతూ ఫ‌స్ట్ హాఫ్ చాలా వ‌ర‌కు కామెడీతోనే న‌డిపించారు డైరెక్ట‌ర్ మెహ‌ర్ ర‌మేష్‌. అలెగ్జాండ‌ర్ బ్ర‌ద‌ర్స్‌ను శంక‌ర్ ప‌ట్టుకొని చంపే యాక్ష‌న్ ఎపిసోడ్స్‌ను స్టైలిష్‌గా డిజైన్ చేసుకున్నాడు. ఇందులోని చిరంజీవి ఎలివేష‌న్స్ అభిమానుల‌ను మెప్పిస్తాయి.

ఆ త‌ర్వాత అస‌లు మ‌హాల‌క్ష్మి త‌న చెల్లెలు కాద‌నే నిజాన్ని శంక‌ర్ రివిల్ చేయ‌డంతో సెకండాఫ్‌పై కాస్తంత ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఆ త‌ర్వాత కోల్‌క‌తాను నుంచి తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌కు క‌థ‌ను షిప్ట్ చేశారు మోహ‌ర్ ర‌మేష్. జ‌బ‌ర్ధ‌స్థ్ గ్యాంగ్‌తో చిరు చేసే కామెడీతో సెకండాఫ్ న‌డిపించారు. ఆ సీన్స్ మొత్తం ప్రేక్ష‌కుల ఓపిక‌కు, స‌హ‌నానికి ప‌రీక్ష పెడ‌తాయి. క్లైమాక్స్ కూడా రొటీన్‌గానే ఎండ్ చేశారు. ఒక్క‌టంటే ఒక్క ట్విస్ట్ కూడా స‌రిగా రాలేసుకోలేక‌పోయాడు.

రొటీన్ క్యారెక్ట‌ర్‌...

శంక‌ర్ అనే టాక్సీ డ్రైవ‌ర్‌గా, భోళా అనే రౌడీగా డిఫ‌రెంట్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో చిరంజీవి చూపించిన వేరియేష‌న్స్ బాగున్నాయి. కామెడీ టైమింగ్‌తో ఆక‌ట్టుకున్నాడు. ఇలాంటి పాత్ర‌లు కొట్టిన పిండే కావ‌డంతో ఈజీగా చేసుకుంటూ వెళ్లిపోయాడు. చిరంజీవి కెరీర్‌లో భోళాశంకర్ ఓ రొటీన్ క్యారెక్టర్ గానే మిగిలింది త‌ప్పితే కొత్త‌గా చెప్పుకోవ‌డానికి ఏం లేదు.

క‌థ‌లో బ‌లం లేక‌పోవ‌డంతో చిరు క‌ష్టం మొత్తం వృథాగా మారిపోయింది. త‌మ‌న్నా కేవ‌లం పాట‌ల‌కు, కొన్ని సీన్స్‌కే ప‌రిమితం. చిరంజీవి చెల్లెలి పాత్ర‌లో కీర్తిసురేష్ ఒదిగిపోయింది. చిరంజీవి, కీర్తిసురేష్ కాంబినేష‌న్ సీన్స్ మాత్ర‌మే ఉన్నంత‌లో నిల‌బెట్టాయి.విల‌న్ గ్యాంగ్ గురించి ఎంత త‌క్కువ చెప్పుకుంటే అంత మంచింది.

వెన్నెల‌కిషోర్‌, గెట‌ప్ శీను, వేణు టిల్లుతో పాటు జ‌బ‌ర్ధ‌స్త్ గ్యాంగ్ మొత్తం ఎవ‌రూ పెద్ద‌గా న‌వ్వించ‌లేదు. బ్ర‌హ్మానందం గెస్ట్‌గా క‌నిపించాడు. పాట‌లు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకు మైన‌స్ అయ్యాయి. టైటిల్ ట్రాక్ త‌ప్పితే మిగిలిన పాటలు, వాటి ప్లేస్‌మెంట్ స‌రిగా కుద‌ర‌లేదు. న‌ర్స‌ప‌ల్లె పాట‌కు చిరు వేసిన స్టెప్పులు మాత్రం మెప్పిస్తాయి.

Bhola Shankar Review -చిరు ఇమేజ్ కూడా…

భోళా శంక‌ర్ కంప్లీట్ ఔట్‌డేటెడ్ రిమేక్ మూవీ. కామెడీ, ఎమోష‌న్‌,సెంటిమెంట్‌తో పాటు ఏది వ‌ర్క‌వుట్ కాలేదు. చిరంజీవి ఇమేజ్ కూడా ఈ సినిమాను సేవ్ చేయ‌లేక‌పోయింది.

రేటింగ్ : 2/5

Whats_app_banner