Gemini Tv Serials: ఈ మూడు జెమిని టీవీ సీరియల్స్ టైమింగ్స్ ఛేంజ్ - మార్పులు ఎప్పటినుంచంటే?
Gemini Tv Serials: శ్రీమద్ రామాయణం, అర్ధాంగితో పాటు భైరవి సీరియల్స్ టెలికాస్ట్ టైమింగ్స్‌ను జెమిని టీవీ ఛేంజ్ చేసింది. కొత్త ప్రసార సమయాలకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
Gemini Tv Serials: జెమిని టీవీ మూడు సీరియల్స్ టెలికాస్ట్ టైమింగ్స్‌ను మార్చేసింది. జూలై 8 (సోమవారం) నుంచి ఈ ప్రసార సమయాల మార్పులు అమలులోకి వస్తాయని ప్రకటించింది. శ్రీమద్ రామాయణం సీరియల్ ఇక నుంచి రాత్రి ఏడు గంటలకు టెలికాస్ట్ అవుతోందని జెమిని టీవీ ప్రకటించింది. ఇదివరకు ఈ సీరియల్ సాయంత్రం ఆరున్నర గంటల నుంచి ఏడు వరకు టెలికాస్ట్ అయ్యేది. సీరియల్ టైమింగ్‌ను ముందుకు జరిపారు.
అర్ధాంగి సీరియల్ కొత్త టైమ్ ఇదే...
శ్రీమద్ రామాయణం స్థానంలో ఆరున్నర గంటలకు అర్ధాంగి సీరియల్‌ను ప్రసారమవుతుందని జెమిని టీవీ ప్రకటించింది. ఇదివరకు అర్ధాంగి సీరియల్ రాత్రి 8.30 నుంచి 9 గంటల వరకు టెలికాస్ట్ అయ్యేది. ఇప్పుడు ఈ సీరియల్‌ను రెండున్నర గంటలు వెనక్కి తీసుకొచ్చారు. అర్ధాంగి సీరియల్ ఇదివరకు జెమిని టీవీలో టీఆర్‌పీ రేటింగ్ పరంగా టాప్ ఫైవ్‌లో ఉండేది.
కొన్నాళ్లుగా సీరియల్‌ను ఆసక్తికరంగా నడిపించడంలో మేకర్స్ తడబడటంతో టీఆర్‌పీ రేటింగ్ పడిపోయింది. అందువల్లే మేకర్స్ సీరియల్ టైమింగ్‌ను ఛేంజ్ చేసినట్లు చెబుతోన్నారు. అర్ధాంగి సీరియల్‌లో హరిత, లక్ష్మణ్, దుర్గశ్రీ కీలక పాత్రలు పోషిస్తోన్నారు. ఈ సీరియల్‌కు రాఘవేంద్ర దర్శకత్వం వహిస్తోన్నాడు.
భైరవి ఇక నుంచి గంట పాటు...
శ్రీమద్ రామాయణం, అర్ధాంగితో పాటు భైరవి సీరియల్ టైలికాస్ట్ టైమింగ్‌లో జెమిని టీవీ మార్పులు చేసింది. ఇదివరకు ఈ సీరియల్ ఏడు గంటలకు ప్రసామరయ్యేది. జూలై 8 నుంచి రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు గంట పాటు భైరవి సీరియల్ టెలికాస్ట్ అవుతుందని జెమిని టీవీ ప్రకటించింది.భైరవి సీరియల్‍లో ఆకాంక్ష గాంధీ, బేబి రచన, భరద్వాజ్, బసవరాజ్, వణ పొన్నప్ప, రోహిత్ డాలీ, శిల్ప గౌడ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
భైరవి సీరియల్ కథ ఇదే...
భైరవి సీరియల్ రివేంజ్ సోషియో ఫాంటసీ డ్రామాగా తెరకెక్కింది.ఓ సంపన్న కుటుంబానికి భైరవి దేవీ.. ఇంటి దేవతగా ఉంటుంది. ఆ ఇంట్లో పుట్టిన ఏకైక ఆడిపిల్లకు భైరవి అని అమ్మవారి పేరు పెడుతుంది తల్లి శివగామి. శివగామిఆస్తిపై కన్నే స్తాడు భైరవి చిన్నాన్న ఆస్తి కోసం భైరవిని చంపేస్తాడు.
ఆ తర్వాత శివగామి పిచ్చిది అని ప్రపంచాన్ని నమ్మిస్తాడు ఆది. ఆస్తులు, వ్యాపారాలను చేజిక్కుచుకుంటాడు. వ్యాపారంలో భారీగా ఎదుగుతాడు. అయితే, ఊహించని విధంగా కొన్నాళ్లకు భైరవి తిరిగి వస్తుంది. భైరవి ఎలా తిరిగి వచ్చింది? ఆమె ఆత్మనా లేకపోతే అమ్మవారు ఆవహించిందా? తనను అంతం చేసి, తన తల్లి శివగామిని మతిస్థిమితం లేని వ్యక్తిగా చేసిన వారిపై ఎలా పగతీర్చుకుంటుంది? తన తల్లిని ఎలా కాపాడుతుందనే? అనే పాయింట్‌తో భైరవీ సీరియల్ రూపొందింది.
సోమవారం నుంచి శుక్రవారం వరకు...
శ్రీమద్ రామాయణం, భైరవితో పాటు అర్ధాంగి ఈ మూడు సీరియల్స్ సోమవారం నుంచి కొత్త టైమింగ్స్ ప్రకారం టెలికాస్ట్ అవుతాయని జెమిని టీవీ తెలిపింది. ఈ మూడు సీరియల్స్ సోమవారం నుంచి శనివారం వరకు టెలికాస్ట్ అవుతాయి.