Bandla Ganesh on Trivikram: భార్య-భర్తలనైనా విడదీస్తాడు.. త్రివిక్రమ్‌పై బండ్ల గణెష్ పరోక్ష కౌంటర్లు..!
Bandla Ganesh on Trivikram: టాలీవుడ నిర్మాత బండ్ల గణేష్, డైరెక్టర్ త్రివిక్రమ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. వీలు చిక్కినప్పుడల్లా త్రివిక్రమ్‌పై బండ్ల గణేష్ కామెంట్లు చేస్తున్నారు. ఈ సారి ఏకంగా భార్యభర్తలనైనా విడదీస్తాడని ట్విటర్ వేదికగా ట్వీట్ చేశారు బండ్ల గణేష్.
Bandla Ganesh on Trivikram: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ఆరంభించి ఇండస్ట్రీలో బడా నిర్మాతల్లో ఒకరిగా ఎదిగారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే ఆయనకు ఎనలేని అభిమానం. ప్రీ రిలీజ్ ఈవెంట్లలో పవన్‌పై ఆయన మాట్లాడే మాటలు ఎప్పుడూ హైలెట్‌గా నిలుస్తాయి. ఆయన పొగడ్తలకు అభిమానులు ఫిదా అవుతుంటారు. అందుకే పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు బండ్ల గణేష్ అంటే చెప్పలేని అభిమానం. పవన్ సినిమా ఫంక్షన్లలో తప్పకుండా ఆయన ఉండాలని కోరుకుంటారు. ఏమైందే ఏమో తెలియదు కానీ.. ఈ మధ్య కాలంలో పవర్ స్టార్-బండ్ల గణేష్ మధ్య కాస్త గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియా వేదికగా పవన్ అంటే బండ్ల గణేష్ అభిమానం చూపిస్తున్నప్పటికీ.. ప్రత్యక్షంగా కనిపించింది చాలా తక్కువ. వీరిద్దరి మధ్య ఈ గ్యాప్‌కు కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ అని తెలుస్తోంది. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో వీరిద్దరి మధ్య వివాదం చెలరేగింది. ఆ ఈవెంట్‌కు రాకుండా త్రివిక్రమ్ అడ్డుపడ్డాడని, కావాలని తనను పిలవలేదని బండ్ల గణేష్ తీవ్రమైన పదజాలంతో దూషించిన ఆడియో లీక్ అయింది. అప్పట్లో అది విపరీతంగా వైరల్ అయింది.
ప్రారంభంలో ఆ ఆడియో తనది కాదని బుకాయించిన బండ్ల గణేష్.. ఆ తర్వాత తనదేనంటూ ఒప్పేసుకున్నారు. అప్పటి నుంచి వీలు చిక్కినప్పుడల్లా త్రివిక్రమ్‌ను పరోక్షంగా గురూజీ అంటూ సెటైర్లు, కౌంటర్లు వేస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి త్రివిక్రమ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయన భార్య-భర్తలను, తండ్రి-కొడుకులను కూడా విడదీస్తాడంటూ ట్విటర్ వేదికగా పోస్టును పెట్టారు.
అసలు విషయానికొస్తే.. "నాకు నిర్మత కావాలని ఉందని" బండ్ల గణేష్‌ను ఓ నెటిజన్ సలహా అడిగారు. "గురూజీని కలిసి కాస్ట్ లీ గిఫ్టును ఇవ్వు" అంటూ అతడి సమాధానమిస్తూ పరోక్షంగా త్రివిక్రమ్‌కు కౌంటర్ ఇచ్చారు బండ్ల గణేష్. ఆ తర్వాత మరో నెటిజన్ వేసిన ప్రశ్నకు బండ్లన్న ఇచ్చిన సమాధానం పుండుపై పుల్లతో పొడిసినట్లు కాక రేపుతోంది. "గురూజీకి కథ చెబితే.. స్క్రీన్ ప్లే రాసి.. దానికి తగినట్లుగా కథను మార్చి.. అసలు అనుకున్న కథను షెడ్డుకు పంపిస్తాడట కదా?" అని అడిగాడు. ఇందుకు బండ్ల గణేష్ రిప్లయి ఇస్తూ.."అదే కాదు.. భార్యభర్తల్నీ, తండ్రి కొడుకుల్నీ, గురు శిష్యులను ఎవరినైనా వేరు చేస్తాడు అనుకుంటే" అది మన గురూజీ స్పెషాలటీ అంటూ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం బండ్ల గణేష్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారాయి. నెటిజన్లు కూడా వీటిపై విశేషంగా స్పందిస్తున్నారు. బండ్ల గణేష్ చెప్పింది నిజమేనని చాలా మంది అంటున్నారు. అంతేకాకుండా పవన్ సినిమాల ఎంపికలో త్రివిక్రమ్ పాత్ర ఎంతో ఉందని అనుకుంటున్నారు.
సంబంధిత కథనం