Veera Simha Reddy OTT Streaming: బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. గురువారం సాయంత్రం ఆరు గంటల నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు దక్షిణాది భాషలన్నింటిలో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నారు. వీరసింహారెడ్డి డిజిటల్ రైట్స్‌ను దాదాపు పదిహేను కోట్లకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ థియేటర్ రిలీజ్‌కు ముందే దక్కించుకున్నది.
బాలకృష్ణ డ్యూయల్ రోల్‌లో నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో రిలీజైంది. ఇందులో వీరసింహారెడ్డి అనే ఫాక్ష్యన్ నాయకుడిగా, జై అనే యువకుడిగా బాలకృష్ణ నటించారు.
ఫ్యాక్షనిజాన్ని నిర్మూలించి రాయలసీమ యువతలో మార్పు కోసం ప్రయత్నించే వ్యక్తి కథతో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా గోపీచంద్ మలినేని వీరసింహారెడ్డి సినిమాను తెరకెక్కించారు.ఈ పాయింట్‌కు అన్నాచెల్లెళ్ల పగ ప్రతీకారాలను జోడించారు.
బాలకృష్ణ యాక్టింగ్‌తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకుల్ని మెప్పించాయి. బాక్సాఫీస్ వద్ద వంద కోట్లపైగా ఈ సినిమా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాలో బాలకృష్ణకు సరసన శృతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటించారు. నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.