Balakrishna On Nurses Controversy: నా మాటలను వక్రీకరించారు - నర్సుల వివాదంపై స్పందించిన బాలకృష్ణ
Balakrishna On Nurses Controversy: ఇటీవల అన్‌స్టాపబుల్ షోలో నర్సులను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై బాలకృష్ణ క్షమాపణలు చెప్పాడు. తన మాటలను కావాలనే కొందరు వక్రీకరించారని బాలకృష్ణ పేర్కొన్నాడు.
Balakrishna On Nurses Controversy: నర్సులను ఉద్దేశించి తాను మాట్లాడిన మాటలను కొందరు వక్రీకరించారని హీరో బాలకృష్ణ పేర్కొన్నాడు. తాను హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న అన్‌స్టాపబుల్ షోలో నర్సులపై బాలకృష్ణ అభ్యంతర వ్యాఖ్యలు చేశాడని వాటిపై క్షమాపణలు చెప్పాలని నర్సింగ్ అసోసియేషన్స్ డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ వివాదంపై సోమవారం బాలకృష్ణ స్పందించాడు. ఈ మేరకు ఫేస్‌బుక్ ద్వారా ఓ ప్రకటనను రిలీజ్ చేశాడు. నర్సులను కించపరిచానంటూ కొందరు తనపై చేస్తోన్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఈ ప్రకటనలో బాలకృష్ణ తెలిపాడు. తన మాటలను కావాలనే వక్రీకరించారని పేర్కొన్నాడు. రోగులకు సేవలందించే సోదరీమణులంటే తనకెంతో గౌరవమని బాలకృష్ణ చెప్పాడు.
బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశాను. రాత్రింబవళ్లు రోగులకు సపర్యలు చేసి ప్రాణాలు నిలిపే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. వారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. కరోనా వేళ ఎంతో మంది నర్సులు పగలనక, రాత్రనక నిద్రాహారాలు మానేసి రోగులకు ఎంతగానో సేవలందరించారు.
అటువంటి నర్సులను మనం మెచ్చుకొని తీరాలి. నిజంగా నా మాటలు మీ మనోభావాలు దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నా అంటూ బాలకృష్ణ ఈ ప్రకటనలో పేర్కొన్నాడు. అన్‌స్టాబుల్ షోలో తనకు యాక్సిండెంట్ అయిన సందర్భాన్ని గుర్తుచేసుకున్న బాలకృష్ణ ఆ సమయంలో వైద్య సహాయం చేసిన నర్సు భలే అందంగా ఉందంటూ పేర్కొన్నాడు.
ఈ కామెంట్స్ వివాదానికి దారితీశాయి. వీటికి ముందు వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ వేడుకలో అక్కినేని నాగేశ్వరరావుపై బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.